Bigg Boss Telugu 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగుతుంది.ఆదివారంతో మూడు వారాలను కంప్లీట్ చేసుకొని నాలుగో వారంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. మొత్తానికి మూడు వారాలు ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటకు వచ్చారు. అయితే తొలివారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా ఇక మూడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు. అయితే మూడు వారాల్లో ముగ్గురు లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు సింగర్ దామిని మూడు వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతుంది. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ సింగర్స్ లో దామిని ఒకరు.
తనదైన శైలిలో పాటలు పాడుతూ గుర్తింపు అందుకుంది. ఇక బాహుబలి సినిమాలో ” పచ్చబొట్టేసిన” అనే పాట తో ఒక్కసారిగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దామిని ఎప్పటికప్పుడు తన పాటలతో అభిమానులను అలరిస్తూ వచ్చేది. ఒక బిగ్ బాస్ హౌస్ లో చాలా స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ గా గట్టి పోటీ ఇచ్చింది. హౌస్ లో ఉండే వారితో ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం పెట్టుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ ఈవారం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకుగాను వారానికి రెండు లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె బయట ఒక పాట పాడితేనే అంత రెమ్యూనికేషన్ వస్తుందట. కానీ బిగ్ బాస్ హౌస్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఆమె హౌస్ లోకి వెళ్లి వచ్చిందని పలువురు చెబుతున్నారు.
గత సీజన్స్ లో కూడా పలువురు సింగర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి కొన్నాళ్లు ఉండి బయటకు వచ్చేవారు. ఈ విధంగా చూస్తే దామిని కు దాదాపు ఒక రోజుకు 28 వేల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే మూడు వారాలకు గాను దాదాపు 6 లక్షల రూపాయలు తీసుకున్నట్లు అంచనా. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే హౌస్ మేట్స్ గా శివాజీ సందీప్ శోభ శెట్టి కన్ఫర్మ్ అయిపోయారు. అయితే ఇప్పుడు దామిని ఎలిమినేషన్ తో హౌస్లో మిగిలింది 11 మంది మాత్రమే. వీరితో ఆట కొనసాగించడం కాస్త కష్టమే. దీంతో ఈవారం బిగ్ బాస్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దామిని విషయానికొస్తే ఎంతో అద్భుతంగా ఆటాడిన సరే దామిని ఎలా బయటకు వచ్చిందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.