Super Star Krishna : మంచి నిర్ణయం :: సూపర్ స్టార్ కృష్ణ జీవితం మీద బయోపిక్..!

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక మన మధ్య లేరు. అయనా కూడా ఆయన జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉన్నాయి. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదేలు అయిపోయింది. దానికి కారణం.. ఆయన ఇండస్ట్రీకే పెద్ద. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులా ఉన్న కృష్ణ ఆకస్మికంగా మనల్ని వదిలేసి పోవడం బాధాకరమే. అందుకే ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి.

Advertisement
biopic movie to be coming on super star krishna
biopic movie to be coming on super star krishna

సాధారణంగా ఏ సెలబ్రిటీ చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకంగా, ఆయన్ను భావితరాలు గుర్తుంచుకోవడం కోసం బయోపిక్ తీయడమో.. వాళ్ల గురించి పుస్తకాలు రాయడమో చేస్తారు. అలా చాలామంది లెజెండరీ నటుల బయోపిక్స్ ను తీశారు. అలాగే.. కృష్ణ బయోపిక్ ను కూడా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Super Star Krishna : బయోపిక్ తీస్తారా? లేక వెబ్ సిరీస్ తీస్తారా?

అయితే.. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కృష్ణ గురించి అన్ని విషయాలు భావితరాలకు తెలిసేలా.. ఈ బయోపిక్ ఉండనుందట. ఆయన టాలీవుడ్ లో ఎలా నటుడిగా మారారు. నిర్మాతగా సొంత బ్యానర్ ను స్థాపించడం, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడం.. వీటన్నింటినీ కలిపి బయోపిక్ తీయాలని భావిస్తున్నారట. అయితే.. బయోపిక్ తీయాలా.. లేక వెబ్ సిరీస్ లా తీయాలా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ కృష్ణ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. వాటన్నింటినీ కలగలిపి కృష్ణ బయోపిక్ ను తీయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. కృష్ణ జ్ఞాపకంగా ఆయన స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయాలని మహేశ్ బాబు కుటుంబం అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ మెమోరియల్ లో కృష్ణ నటించిన అన్ని సినిమాల సమాచారం, ఆయనకు వచ్చిన అవార్డులు, ఫోటోలు ఉండనున్నాయి. అలాగే.. ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కృష్ణ మెమోరియల్ ను పద్మాలయ స్టూడియోలో కట్టాలని మహేశ్ బాబు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement