Chalaki chanti : బుల్లితెరలో నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగుతుంది జబర్దస్త్. అయితే ఇటీవల జబర్దస్త్ లో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ షో నుంచి బయటికి వచ్చిన కిరాక్ ఆర్పీ చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, మేనేజర్ ఏడుకొండలు, షేకింగ్ శేషు కౌంటర్ ఇచ్చారు. దాంతో మళ్లీ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు. అయితే తాజాగా జబర్దస్త్ షో గురించి చలాకి చంటి కొన్ని విషయాలను పంచుకున్నారు. తనకు జబర్దస్త్ షో నుంచి పేరు రాలేదని, సినిమాలలో నటించిన తర్వాతే అక్కడికి వెళ్లానని అన్నాడు.
ఎందుకు జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమా షూటింగ్స్ విషయంలో మోసపోతున్నారని యాంకర్ అడగగా చలాకి చంటి దానికి రిప్లై గా నేను జబర్దస్త్ నుంచి నా పేరు రాలేదు. నేను సినిమాలు చేసినాక జబర్దస్త్ షోకు వచ్చా. సినిమాలు తెలియకుండా జబర్దస్త్ వచ్చిన వాళ్లకు అలా జరిగి ఉండవచ్చు ఏమో అప్పటికి 20 సినిమాలు చేశాను. నాకు తెలుసు స్కిట్ వేరు, సినిమా సీన్ వేరు, డైరెక్టర్ చెప్పిన నా పాయింట్ నాకు అర్థమవుతుంది. సీన్ విషయంలో నా ఐడియాలు కూడా పంచుకుంటా నేను మూడుసార్లు జబర్దస్త్ షోకు వెళ్లి బయటికి వచ్చా. ఎవరైనా బయటకు వెళితే మళ్ళీ ఆ షోలోకి రాకూడదని అది వాళ్ళ రూల్.
Chalaki chanti : జబర్దస్త్ నాకు మంచి గుర్తింపును ఇవ్వలేదు…

అయితే వాళ్లు నాకు గౌరవం ఇచ్చారు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఏది ఉన్న ఏ తప్పు జరిగిన అప్పటికప్పుడే అడుగుతాను. నానబెట్టి తర్వాత అడగటం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసింది. నేను జబర్దస్త్ షో నుంచి ఎప్పుడు బయటికి వెళ్లినా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చెప్పే వెళ్లేవాడిని. ఒకసారి మూడు నెలల గ్యాప్ తీసుకొని వెళ్ళా. కంటిన్యూగా చేయడంతో తలనొప్పి అనిపిస్తుందని రెస్ట్ తీసుకొని వచ్చా. రెండోసారి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ తో వెళ్లి వచ్చా మూడోసారి 27 రోజులు యూఎస్ షెడ్యూల్ లో షూటింగ్ ఉండడంతో వెళ్లి వచ్చా. ఎవరి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు అంటూ చలాకి చంటి చెప్పుకొచ్చాడు