Bigg Boss 6 : ప్రస్తుతం బుల్లితెర అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది బిగ్ బాస్ 6 సీజన్ కోసం. ఇప్పటికే 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్.. త్వరలోనే ఆరో సీజన్ ను ప్రారంభించనున్నారు. తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు దీన్ని ఢీకొట్టే షో రాలేదు. టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న రియాలిటీ షో ఇది. తెలుగులోనే కాదు.. దాదాపు అన్ని భాషల్లో బిగ్ బాస్ సక్సెస్ అయింది.

బిగ్ బాస్ 6 ను మేనేజ్ మెంట్ ప్రకటించడంతో పాటు లోగో, ప్రోమోను కూడా విడుదల చేసింది. బిగ్ బాస్ 6 కు హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జునే వ్యవహరించనున్నాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై చాలా రోజుల నుంచి తెగ చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు యూట్యూబ్, టీవీ సెలబ్రిటీలను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అందులో ఒకరి పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కు చెల్లెలుగా నటించిన సుధీప. ఆ ఒక్కసినిమాలోనే కాదు.. చాలా సినిమాల్లో సుధీప చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందట. తను కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 6 ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు, అందులో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు. లాంచింగ్ రోజున 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్తారు. నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్తారు.
యూట్యూబర్ ఆదిరెడ్డి, గలాటా గీతూ రాయల్, నేహా చౌదరి, ఉదయభాను, చలాకీ చంటీ, సుధీప, జబర్దస్త్ అప్పారావు, శ్రీహాన్ లాంటి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.