Karthika Deepam : కార్తిక దీపంలో వంటలక్క సర్ప్రైజ్, దీప రీఎంట్రీకి ప్లానింగ్…..

Karthika Deepam : చిన్ని తెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ రెండు రాష్ట్రాలలో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. 7.30 నిమిషాలు అయిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా టీవీలకి హత్తుకుపోతూ ఉంటారు. ఈ సీరియల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చి పేర్లు డాక్టర్ బాబు, వంటలక్క వీరి క్యారెక్టర్ తో భారీ రేటింగ్ను అందుకుంది. వంటలక్క పాత్ర పోషించి అభిమానులలో ఎనలేని ప్రేమను అందుకున్నారు. వంటలక్క పాత్ర భారీగా ఫేమస్ అయ్యింది. ఈ వంటలక్క అనే పేరు మీద ఒక కొత్త సీరియల్ వస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కార్తీక దీపం పవర్ అంతా వంటలక్క పాత్రదే. ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాధ్, ఈమె కేరళకు చెందిన ఆర్టిస్టు.

Advertisement

ఈ కార్తిక దీపం సీరియల్ తోనే చిన్ని తెరకు పరిచయమైంది. అయితే ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను చంపేయడంతో ప్రేక్షకులు ఎంతో బాధను వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి క్యారెక్టర్ ఎప్పుడైతే తీసేసారు ఈ సీరియల్ కు ఇక రేటింగ్ అమాంతంగా పడిపోయింది. ఈ సీరియల్ పై పెద్దగా మక్కువ కూడా చూపించడం లేదు. అయితే వంటలక్క మాత్రం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ తో అభిమానులు కు రోజు అప్డేట్ ఇస్తూనే ఉంది. అయితే ప్రేక్షకులు ఆమెను మీరు మళ్లీ కార్తీకదీపం లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది. అని అంటున్నారు. అయితే ఈ సీరియల్ టీం వాళ్లు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement

Karthika Deepam : దీప రీఎంట్రీకి ప్లానింగ్…..

Deepa making a surprise re-entry into Kartik Deepam
Deepa making a surprise re-entry into Kartik Deepam

వంటలక్క అభిమానులకి. లేటెస్ట్ గా వంటలక్క ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. మీ అందరి కోసం నేను వస్తున్న అనే క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఆ వీడియోలో వంటలక్క మేకప్ చేసుకుంటుండగా.. అక్కడికి అసిస్టెంట్ వచ్చి దీపా మేడం స్టార్ట్ రెడీ అనడంతో దీప ఒక్కసారిగా కెమెరా వైపు తిరిగి ఆ వస్తున్న అని అంటున్నది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా… దీప మళ్లీ తిరిగి కార్తీకదీపం సీరియల్ లో అడుగుపెట్టనుందని తన అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.

 

Advertisement