Deepthi Sunaina : అంతా సోషల్ మీడియా మాయ. సోషల్ మీడియా వల్ల చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. ఒకప్పుడు సెలబ్రిటీలు అవ్వాలన్నా.. సినిమాలు, బుల్లితెర మీద అవకాశాలు రావాలన్నా చాలా కష్టంగా ఉండేది. నేడు అంత కష్టపడాల్సిన అవసరం అస్సలే లేదు. సోషల్ మీడియాలో మనకు ఉన్న టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటే చాలు.. అలా చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు. అందులో ఒకరు దీప్తి సునయన. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా పేరు తెచ్చుకున్న దీప్తికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. షార్ట్ మూవీస్ తో పాటు పలు సినిమాలు, బుల్లితెర షోలలో సందడి చేసే దీప్తి సునయన గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బిగ్ బాస్ సీజన్ 2 లో చాన్స్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది దీప్తి సునయన. ఆ తర్వాత మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో లవ్ లో పడి.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని కూడా తిరిగారు. కానీ.. బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లిన షణ్ముఖ్.. సిరి హన్మంత్ తో ఎక్కువగా గడపడం.. తనతో కనెక్ట్ అయినట్టుగా ఉండటంతో బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే.. షణ్ముఖ్ తో దీప్తి బ్రేకప్ చెప్పేసింది.
Deepthi Sunaina : బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ తో క్లోజ్ గా ఉన్న దీప్తి
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో మరో నటుడు సామ్రాట్ రెడ్డితో క్లోజ్ గా ఉంది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో వాళ్లిద్దరి క్లోజ్ నెస్ చూసి చాలామంది ఏదేదో ఊహించేసుకున్నారు. కానీ.. అతడిని దీప్తి ఒక సోదరుడిగానే భావించింది. ఇప్పటికే ఆ బంధం అలాగే కొనసాగుతోంది.
ఎందుకంటే.. సామ్రాట్ రెడ్డికి ఇటీవల కూతురు పుట్టింది. సామ్రాట్ భార్య లిఖిత… ఆగస్టు 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వెంటనే సామ్రాట్ ఇంటికి వెళ్లిన దీప్తి.. ఆ పాప చేయి పట్టుకొని ఫోటో దిగి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు దాన్ని తెగ వైరల్ చేశారు.

అయితే.. ఆ ఫోటోను షేర్ చేయడంతో పాటు నా క్యూటీలు సామ్రాట్ రెడ్డి, లిఖితకు కంగ్రాట్స్ అని చెప్పి.. పాపకు నాకు మధ్య ఉన్న కనెక్షన్ మీకు అది పెద్ద అయ్యాకే తెలుస్తుంది అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీని చూసిన నెటిజన్లు.. మీ అన్నాచెల్లెళ్ల బంధం ఇంకా కొనసాగుతోందా? గ్రేట్.. అంటూ దీప్తిని ప్రశంసిస్తున్నారు. కానీ.. తను పెట్టిన పోస్ట్ కు అర్థం తెలియక మాత్రం తెగ కామెంట్లు చేస్తున్నారు. తను పెద్దయ్యాక ఏం తెలుస్తుంది.. అసలు దీప్తి ఏం చెప్పాలనుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.