Dhal Curry with Rose Petals : గులాబీ రేకుల పప్పుకూర చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు.. కందిపప్పు, నూనె, ఇంగువ,పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి,ఎండుమిర్చి, ఫ్రెష్ గా ఉన్న గులాబీ రేకులు, నూనె, జిలకర, పోపుదినుసులు, కొంచెం కొత్తిమీర….గులాబీ రేకుల పప్పు చేసుకునే విధానం. ముందుగా కుక్కలర్ లో కందిపప్పు కడిగి పెట్టుకోవాలి.పప్పులో కొద్దిగా వాటర్ ఉప్పు, కారం, పసుపు, రెండుమూడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం నూనె వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి.పప్పు మరీ ఎక్కువ మెత్తగా కాకుండా రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి.కుక్కర్ చల్లగా ఆయన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈలోపు పప్పుకి కావాల్సిన తాలింపు పెట్టుకోవచ్చు.
Dhal Curry with Rose Petals : గులాబీ రేకుల పప్పుకూర చేసుకోవడం ఎలా మీకోసం….
పొపు చేసుకునే ఫ్యాన్లొ కొంచెం నూనె వేసుకొని జిలకర, పోపు దినుసులు, వెల్లుల్లి ఎండుమిర్చి, కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు.రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగె లోపు దాంట్లోనే కొంచెం ఇంగువ వేసుకొవాలి. కొంచెం పోపు వేగెకెంతవరకు ఉంచుకోవాలి. పోపు వేగె లొపు మంచిగా గులాబిరెక్కల్ని కడుక్కొవాలి.గులాబీ కలర్లో ఉన్న గులాబిరెక్కలు అయితేనే ఈ పప్పుకూర కి టేస్టు బాగా ఉంటుంది. వేరే రంగుల గులాబిరెక్కలు వాడితే అంత రుచిగా ఉండదు.ఆ గులాబిరెక్కల్ని కూడా పోపులో వేసుకోవాలి.మనం పప్పు చేసుకునే క్వాంటిటీ బట్టి గులాబిరెక్కల్ని తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, కొంచెం తక్కువ చేసుకోవచ్చు, గులాబీ రెక్కలు పోపులో వేసుకొవాలి.

గులాబీ రేకలు మంచిగా మగె౦త వరకు ఉంచుకోవాలి. తర్వాత అవి కలర్ ఛేంజ్ అవుతూ ఉంటాయి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే పప్పులో కొంచెం పసుపు వెశం కాబట్టి పోపులొ కూడా కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది.అలాగే రుచికి సరిపడినంత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.అలా మొత్తం వేగిన తర్వాత కుక్కర్ విజిల్ తీసుకున్నాకొని పప్పుని స్పూన్తో మెత్తగా అనుకోవాలి. తర్వాత ఆ పప్పుని పోపులొకి కలుపుకొని రెండు మూడు నిమిషాల్లో మొత్తం కలిపే లాగా స్టవ్ మీద ఉంచాలి. అంతే ఎంతో రుచికరమైన గులాబీ రేకుల పప్పు కూర రెడీ అవుతోంది.సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత పైన డెకరేషన్ లాగా గులాబిరెక్కలు పెడితే ఇంకా చాలా బాగుంటుంది.