Shahrukh Khan Manager : సినీ ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీ తమ వద్ద పనిచేసేందుకు మేనేజర్లను నియమించుకుంటారు. అలా ఇప్పటికీ చాలామంది హీరోలకు హీరోయిన్లకు మేనేజర్స్ దగ్గరుండి అన్ని విషయాలను చూసుకుంటూ వస్తున్నారు. సినిమాల నుండి వారికి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాల వరకు అన్నింటినీ మేనేజర్స్ చూసుకుంటారు. అయితే అందరిలాగానే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దగ్గర ఓ మంచి తెలివైన పూజ అనే మేనేజర్ ఉంది. ఈమెను షారుక్ ఖాన్ దాదాపు పది సంవత్సరాల క్రితం నియమించుకున్నారట. అప్పటినుండి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా పూజ షారుక్ ఖాన్ వద్ద పనిచేస్తూ వస్తుంది.
కేవలం షారుక్ కు సంబంధించిన సినిమా విషయాలు మాత్రమే కాకుండా, తన ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా పూజా తనకి వచ్చిన సలహాలను సూచనలను ఇస్తూ ఉంటుందట. అయితే అలాంటి పూజ ఒక ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ సైతం ఈమె ముందు దిగదుడుపే అన్నట్లు ఉంటుంది. మరి ఆమె సంపాదన ఎంతో తెలుసుకుందామా….అయితే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ మరియు మేనేజర్ పూజ దట్ల చాలా మంచి స్నేహితులట. అయితే పూజ షారుక్ ఖాన్ వద్ద మేనేజర్ గా 2012లో చేరింది. ఇప్పటికీ కూడా పూజనే ఆయనకు నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వస్తుంది.
అలాగే పూజ సినిమాలకు సంబంధించిన విషయాలు మరియు ఫైనాన్షియల్ విషయాలు మాత్రమే కాకుండా షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే వాటిని కూడా పూజ నే దగ్గరుండి చూసుకుంటుందట. ఇలా దాదాపు పూజ ఏడాదికి 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి సినీ ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుంది. సెలబ్రిటీ యొక్క పర్సనల్ విషయాలన్నీ వారికి తెలుస్తాయి. ఇక వాటిని కప్పిపుచ్చుతూ మేనేజర్స్ వ్యవహరిస్తారు కాబట్టి సెలబ్రిటీలు సైతం వీరికి ఎంత ఇవ్వడానికైనా వెనుకాడబోరు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.