Kriti Shetty : కృతి శెట్టి రెమ్యూనరేషన్ ని ఏం చేస్తుందో తెలుసా… అమ్మడు తెలివి మామూలుగా లేదుగా…

Kriti Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో హీరోయిన్ కృతి శెట్టి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా ఓ రెంజ్ లో సంపాదించుకుంటుంది. ‘ ఉప్పెన ‘ సినిమా హిట్ తర్వాత నాని ‘ శ్యాం సింగరాయ్ ‘, ‘ బంగార్రాజు ‘ సినిమాలో నటించింది. తన రెండో సినిమా నాని ‘ శ్యాం సింగరాయ్ ‘ సినిమాకి అమ్మడు కోటి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి రెండో సినిమాకి ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఒకవేళ హీరోయిన్స్ అడిగిన మేకర్స్ అంత ఇవ్వరు. కానీ కృతిలో ఏం చూసారో గాని ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేశారు దర్శకనిర్మాతలు.

Advertisement

బంగార్రాజు సినిమాకి కూడా అంతే పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. మళ్లీ మధ్యలో అమ్మడు బుల్లితెర ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యి బాగానే సంపాదించుకుంది. మరి ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమైన ఓ సీరియల్ ను ప్రమోట్ చేసినందుకు రెండు కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు కృతి శెట్టి చేసింది ఐదు సినిమాలు మాత్రమే. వీటి తర్వాత చేతిలో ఆరు సినిమాలను రెడీగా పెట్టుకుంది. వీటన్నింటికీ కృతి శెట్టి దాదాపుగా కోటి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని అంటున్నారు. మరి ముఖ్యంగా స్టార్ హీరో సూర్య సినిమాకి రెండు కోట్ల పారితోషకం తీసుకుపోతుందంట.

Advertisement

Kriti Shetty : అమ్మడు తెలివి మామూలుగా లేదుగా…

Do you know what does Kriti Shetty's remuneration
Do you know what does Kriti Shetty’s remuneration

ఈ క్రమంలోనే ఇంత డబ్బులు ఈ చిన్న వయసులో కృతి ఏం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. కృతి శెట్టి సినిమాలకు తీసుకున్న పారితోషికాన్ని మొత్తాన్ని తన అమ్మకి ఇచ్చేస్తుందట. ఒక్క రూపాయి కూడా తను తీసుకోదట. ఆ డబ్బులను కృతి వాళ్ళ అమ్మ కృతి డ్రీమ్ హౌస్ నిర్మించాలని దాచిపెడుతుందంట. అందుకే ఇంత చిన్న వయసులోనే ఒకపక్క చదువును కొనసాగిస్తూనే మరో ప్రక్క సినిమాలు చేస్తుంది. దీనికోసమే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా నెట్టుకొస్తుందంట. అంతేకాదు సినిమాలో కొంచెం బోల్డ్ సీన్స్ ఉంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు రూమర్ కూడా ఉంది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో కృతి తెలివితేటలు మామూలుగా లేవుగా అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement