Guppedanta Manasu 22 October Episode : దేవయానిని గట్టిగా ప్రశ్నిస్తున్న రిషి… ప్రేమ కురిపిస్తూ డ్రామాలు ఆడుతున్న దేవయాని…

Guppedanta Manasu 22 October Episode :  చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 588 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతి మహేంద్రలు వెళ్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర నేను రిషి ని వదిలి వెళ్తుంటే నా గుండె ఏదో బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి తట్టుకోవాలి మహేంద్ర తప్పదు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంకొకపక్క రిషి వసుధారాలు ఈరోజు చాలా సంతోషంగా గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. అని రిషి వసుధారతో చెప్తూ ఉంటాడు.

Advertisement
Guppedanta-manasu-22-october 2022 episode
Guppedanta-manasu-22-october 2022 episode

ఇంకొకపక్క మహేంద్ర జగతితో ఈరోజు రాత్రి భయంకరమైన రాత్రిగా మీగలబోతుంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి తనని ఓదారుస్తూ ఉంటుంది. తర్వాత రిషి వసుధారాన్ని ఇంటిదగ్గర దింపి వెళ్లిపోతాడు. ఇక తెల్లవారుజామున వసుధర లేవక ముందే జగతి ఫోన్ నుంచి తనకి మెసేజ్లు వెంట వెంటనే వస్తూ ఉండటంతో తను లేసి ఆ ఫోన్ ని చూసుకుంటుంది. అప్పుడు దాన్లో కొన్ని ఫైల్స్ పంపించి ఇవి ఇప్పటినుంచి నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది. అప్పుడు అది చూసిన వసుధార నేను చూసుకోవడం ఏంటి అని కంగారుపడుతూ ఉంటుంది. కట్ చేస్తే రిషి మహేంద్ర రూమ్ లోకి వెళ్లి డాడ్ డాడ్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళులేక పోయేసరికి రిషి అంత వెతుకుతాడు. కానీ వాళ్ళు కనిపించపోయేసరికి అక్కడ ఉన్న ఫ్రేమ్ వైపు చూడగా దానిపైన వెళ్తున్నాం అని రాసి ఉంటుంది.

Advertisement

అది చూసి నా ఋషి కంగారుపడుతూ బయటికి వెళ్లి దేవయానిని అడుగుతూ ఉంటాడు. కానీ దేవయాని ఏమీ తెలియనట్లుగా డ్రామా చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి గట్టిగా పెద్దమ్మ మీరు ఆపాలి కదా లేదా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అసలు అలా ఎలా వెళ్లారు అని గట్టిగా తనని ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ దేవయాని నాకు ఏమీ తెలియదు అమ్మ.. వాళ్ళు ఇలా వెళ్తారు అని అనుకోలేదు అని ప్రేమ వలక పోస్తు తెగ నటిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి మీరు ఏమైనా అన్నారా? అంటే చెప్పండి డాడ్ బాధపడేలా అన్నారా డాడీ ఎందుకు వెళ్ళిపోయాడు డాడీ అలా ఎలా వెళ్ళిపోతాడు అని కంగారుపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు దేవియాని నేనేమంటాను నేనేమీ అనలేదు వాళ్ళని ఆపాను కానీ వాళ్ళ నా ఇష్టం అని వెళ్ళిపోయారు.. వాళ్లకి ప్రేమ ఉంటే కదా ఆగడానికి అని వారి వాళ్లపై నిందలు వేస్తూ ఉంటుంది. అంతలో గౌతం అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగగా… దేవయాని జరిగింది తనకి చెప్తుంది అప్పుడు రిషి ని ఓదారుస్తూ తనని అక్కడ కూర్చోబెట్టి నేను వెళ్లి వెతుకుతాను రిషి నువ్వు కంగారు పడకు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవయాని రిషి పక్కన కూర్చొని తన మీద ప్రేమ కురిపిస్తూ జగతి వచ్చింది ఇలా జరుగుతుంది. అని జగతి పై నిందలు వేస్తూ ఉంటుంది.

కట్ చేస్తే గౌతం బయటికి వెళ్లి వసుధారతో అంతా చెప్పి నువ్వు వెళ్లి రిషి ని చూసుకో వాడు చాలా సెన్సిటివ్ అసలు తట్టుకోలేడు అని చెప్తూ ఉండగా.. కంగారుపడుతూ అలా ఎలా వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఇదంతా నా వల్లే జరిగిందా అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. రిషి రూమ్ లో కూర్చొని వెళ్తున్నాం అనే దానిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అంతలో దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి పెద్దమ్మ డాడ్ అలా ఎలా వెళ్ళిపోయాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నన్ను ఒక మాట కూడా అనడు నేనంటే డాడ్ కి ప్రాణం తను నన్ను తిట్టలేక ఏమీ అనలేక తనకు తాను శిక్ష వేసుకున్నాడా… పెద్దమ్మ మీరు వాళ్ళని ఏదైనా అని ఉంటారా.. లేదా జగతి మేడం అన్నారా అని అంటూ ఉంటాడు. అప్పుడు దేవియని లేదు నాన్న నేను ఏమీ అనలేదు నేను నీకు అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి మళ్ళీ జగతికి మహేంద్ర కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఫోన్లు మాత్రం స్విచాఫ్ వస్తూనే ఉంటాయి. అంతలో అక్కడికి వసుధార వచ్చి సార్ సార్ అని పిలుస్తూ ఉంటుంది.

అప్పుడు రిషి బయటికి వచ్చి వసుదారని కంగారుపడుతూ డాడ్ వాళ్ళు ఎక్కడైనా కనిపించార.. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అంటూ ఉండగా… వసుధార మీరు కంగారు పడకండి సార్ వాళ్లు ఎక్కడికి వెళ్లరు గౌతమ్ సార్ వెళ్లారు వెతకడానికి రండి మీరు రిలాక్స్అయిదురుగాని అని తీసుకొని వెళ్తూ ఉండగా.. దేవియాని ఆగు వసుదార ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటుంది. అప్పుడు సార్ చాలా టెన్షన్ పడుతున్నారు. కొద్దిసేపు రిలాక్స్ అవుతారు మీరు స్ట్రాంగ్ గా టీ పెట్టి తీసుకురండి అని దేవియానికి చెప్తూ ఉంటుంది. ఏంటి నేను టీ పెట్టి తీసుకురావాలా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వసుధార అవును మేడం ఉత్త టీ కాదు స్ట్రాంగ్ గా పెట్టి తీసుకొని రండి అని చెప్పి రిషి ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా చూస్తూ దేవియాని షాక్ అవుతుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే…

Advertisement