Guppedanta Manasu 25 October Episode : జగతి, మహేంద్ర గౌతమ్ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వచ్చిన రిషి… ఇక మహేంద్ర ఏం చేయబోతున్నాడు అంటే..

Guppedanta Manasu 25 October Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 590 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కాలేజీలో మహేంద్ర జగతి వాళ్లు మీటింగ్ కి వస్తారని రిషి వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు వసుధారా ఒకవేళ మీరు జగతి మేడంని అని అనగానే రిషి కోపంగా చాలు వసుధారా మా డాడీకి కోపం నామీద వచ్చింది అందుకే వెళ్ళిపోయారు వాళ్లు మళ్లీ వస్తారు అని గట్టిగా అంటూ ఉంటాడు.

Advertisement

అప్పుడు వసుధర బంధాలు బంధాలు విలువ గురించి చెప్తూ వాళ్ళు అలా వచ్చే వాళ్లయితే ఎందుకు వెళ్తారు అని చెబుతూ ఉంటుంది. అప్పుడు రిషి నువ్వు ఆ మాట అనకు వసుదార నాకు వినడానికి చాలా బాధగా ఉంది అని అంటూ నేను అందర్నీ అర్థం చేసుకుంటాను కానీ నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అనగానే.. వసుధర నేనున్నాను కదా సార్ అని ధైర్యం చెబుతూ ఉంటుంది.అప్పుడు రిషి టైం అవుతుంది. మీటింగ్ కి వెళ్ళాం పదా అనగానే.. అక్కడ నుంచి వెళ్లి మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ మహేంద్ర జగతిల గురించి ఎదురుచూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇద్దరు. కట్ చేస్తే గౌతమ్ ఇంట్లో ఉన్న జగతి మహేంద్ర ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.

Advertisement
Guppedanta Manasu 25 October Episode
Guppedanta Manasu 25 October Episode

అప్పుడు గౌతమ్ వచ్చి టీ ఇమ్మంటావా అంకుల్ అని అడగగానే ఏమొద్దు గౌతమ్ అంటూ ఉంటారు. అప్పుడు గౌతమ్ మనసులో ఇటు వీళ్ళని బాధ పెట్టలేను అటు వాడిని బాధ పెట్టలేను అని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మీటింగ్ హాల్లోకి అందరూ వస్తారు కానీ జగతి, మహేంద్ర ల కోసం రిషి వసుధారాలు బయట వెయిట్ చేస్తూ టైం అవుతుంది. వీలు ఇంకా రాలేదు. వసుధార కదా ఫోన్ చేస్తుంటే కలవడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. రిషి ని చూసిన వసుధార గౌతమ్ కి మెసేజ్ పెడుతుంది. అప్పుడు ఆ మెసేజ్ చూసిన గౌతం మహేంద్ర వాళ్ళకి చెప్తాడు. అప్పుడు జగతి మహేంద్ర ఏం చేద్దాం మనకోసం ఎంతో ఎదురుచూస్తూ ఉన్నాడు రిషి పాపం అని అనగానే.. మహేంద్ర కూడా నాకు కూడా అర్థం కావడం లేదు జగతి ఏం చేయాలో అని అంటాడు.

అప్పుడు గౌతమ్ బయటికి వెళ్లి రిషికి లొకేషన్ పెడుతున్నాను నీతో మాట్లాడాలి రా అని పెడతాడు. అప్పుడు రిషి గౌతమ్ మెసేజ్ పెట్టాడు లొకేషన్ పెట్టాడు రమ్మంటున్నాడు అంటే డాడీ వాళ్లు కనిపించారా వెళ్దాం రా వసుధరా అని అనగానే వసుదార మరి మీటింగ్ సార్ అనగానే క్యాన్సిల్ అని చెప్పు అని అంటాడు. అప్పుడు వసుధార వాళ్ళకి వెళ్లి క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే దేవయాని జగతి వాళ్ళు కాలేజీకి రాలేదా అవునా అని సంతోషపడుతూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. ధరణి అక్కడికి వస్తుంది ధరణిని చూసి దేవయాని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ధరణి అత్తయ్య గారు టీ తీసుకుని రమ్మంటారా అని అనగానే నాకు ఏం వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది.

అప్పుడు ఎందుకు అత్తయ్య గారు నన్ను చూసి కంగారుపడుతున్నారు అనగానే.. దేవయాని నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది నువ్వు లోపల ఒకలా ఉంటావు.. బయట ఒకలా ఉంటావు అని అంటూ ఇక నాకు టీ తీసుకురా అని చెప్తుంది. అప్పుడు ఇప్పుడే వద్దనున్నారు కదా అత్తయ్య అని అనగానే… నీతో అరిచి అరిచి తలనొప్పి వచ్చింది తీసుకురా అని చెప్తుంది. అప్పుడు ధరణి సరే అని వెళ్తూ నవ్వుకుంటుంది తనలో తాను. కట్ చేస్తే రిషి వసుధారాలు గౌతం ఇంటికి వెళ్లి డోర్ కొడుతూ ఉండగా.. అప్పుడు మహేంద్ర వాళ్ళు టెన్షన్ పడుతూ రిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు గౌతం నువ్వేమైనా చెప్పావా అని అనగానే.. అవును నేనే చెప్పాను వాడి బాధ చూడలేక అని అనగానే.. మహేంద్ర గౌతమ్ ని తిట్టి నేను రూమ్లో వెళ్లి దాక్కుకుంటాము నువ్వు కానీ చెప్పావంటే ఇక జీవితంలో నీతో మాట్లాడను అని అంటూ.. వెళ్ళిపోతాడు. అప్పుడు గౌతమ్ వెళ్లి డోర్ తీయగానే రిషి ఏందిరా ఇంత టైం పట్టింది డోర్ తీయడానికి అని అనగానే గౌతమ్ కంగారుపడుతూ వాష్ రూమ్ లో ఉన్నాను అందుకే తీయలేదు రా అని అంటూ ఉంటాడు.

అప్పుడు రిషి లోపలికి వెళ్లి మహేంద్ర వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. వాళ్లు ఎక్కడ కనిపించపోయేసరికి గౌతమ్ ని డాడ్ వాళ్లు ఎక్కడున్నారు నీకు కనిపించారా అని అడుగుతూ ఉండగా గౌతం నాకేం తెలుసురా నేను నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను.. కానీ నువ్వు ఇప్పుడే వస్తావు అనుకోలేదు సాయంత్రం వస్తాయులే అనుకున్నాను అనగానే రిషి డాడీ కంటే నాకు ఏది ఎక్కువ కాదురా అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక గౌతమ్ వాటర్ తీసుకోవడానికి వెళ్ళగానే మహేంద్ర చూసిన ఫోటో అక్కడే ఉండిపోవడంతో మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. గౌతమ్ కి మహేంద్ర సైగా చేయడంతో.. గౌతమ్ వేల్లి ఆ ఫోటోని కవర్ చేస్తూ వాళ్ళిద్దర్నీ కూర్చోబెడతాడు. అప్పుడు గౌతమ్ నువ్వు కంగారు పడకురా అంకుల్ వచ్చేస్తారు అని ధైర్యం చెబుతూ ఉంటాడు.

కానీ రిషి మాత్రం డాడ్ లేకుండా నేను ఎలా ఉండాలి రా డాడీ ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటుండగా.. అప్పుడు గౌతమ్ నాకేం తెలుసురా మీ డాడ్ నీవు ఫ్రెండ్స్ కదా అయినా మీవి గొప్ప ఫ్యామిలీ రా బాబు మీవి గొప్ప ప్రేమలు రా అని గౌతమ్ అనగానే అదేంట్రా అలా అంటావు అనగానే… మరి ఏంట్రా మీ డాడీకి నీ నువ్వంటే ఎంతో ఇష్టం ఈ అడ్డు కూడా ఏంట్రా అని అనగానే మా ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డు కూడా లేదురా మా డాడ్ నామీద అలిగాడు అంతే మళ్ళీ కలవగానే హగ్ చేసుకుని సారీ అని చెప్పగానే మా డాడీ కోపం అంతా పోతుంది అని అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement