Guppedantha Manasu 12th July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త ప్లాన్తో మిషిన్ ఎడ్యుకేషన్ లోకి అడుగుపెట్టబోతున్న సాక్షి, తర్వాత ఏం జరగబోతోంది…

Guppedantha Manasu 12th July Today Episode : మిషన్ ఎడ్యుకేషన్ గురించి కాలేజ్లో మీటింగ్ జరుగుతోంది.మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో, మినిస్టర్ గారి సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఈ విషయంలో మినిస్టరుగారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. అని రిషి అందరితో చెప్తాడు.అందరి కాలేజ్ స్టూడెంట్స్ ని పిలిపించి మన కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి అందరితో చెప్పాడ౦. దీని గురించి అందరికీ తెలిసే లాగా చేద్దాం అని రిషి చెప్పాడు. దీనికి అచ్చతెలుగులో చదువుల పండగ అని పేరు పెట్టుకుందాం అని రిషి అందరితో చెప్తాడు.

Advertisement

ఈ విషయంలో మీ అందరి సహకారం కోరుకుంటున్నాను అని మీటింగ్లో అందరితో రిషి చెప్తాడు.ఆ మీటింగ్ కి సంబంధించిన ఫైల్ ని రిషి , జగతి మేడమ్ ని అడుగుతాడు. జగతి మేడమ్ ఏమో వసుని అడుగుతోంది.ఆ వసుధారని అడిగితే ఫైల్ ఎక్కడో మిస్సయింది మేడం అని చెబుతుంది. దాంతో జగతికి,రిషి సరెే మేడం తర్వాత ఫైల్ పంపించండి అని నిదానంగానే సమాధానం చెప్పాడు.ఇంతలో ఆ మీటింగ్ దగ్గరకి సాక్షి వస్తుంది. నేను ఈ మీటింగ్ లో కూర్చోవచ్చ అని అడుగుతుంది.అందరూ ఆశ్చర్యపోతారు. కానీ రిషి మాత్రం సాక్షిని కూర్చో రా అని సాక్షిని పిలుస్తాడు.

Advertisement
Guppedantha Manasu 12th July Today Episode
Guppedantha Manasu 12th July Today Episode

సాక్షి వచ్చి అందరికీ నమస్కారం చెప్తుంది.సారి ఈ కాలేజ్ కి నాకు సంబంధం లేదు కానీ నాకు ఈ మీటింగ్ గురించి తెలుసు అందుకే వచ్చాను అని చెప్తుంది సాక్షి.మిషన్ ఎడ్యూకెషన్ గురించి సంబందించిన కొన్ని ఐడియాస్ తో వచ్చాను అని చెప్తుంది సాక్షి.రిషి విత్ యువర్ పర్మీషన్ ఈ మిషన్ ఎడ్యుకేషన్లో నేను కూడా వాలెంటైన్ గా పనిచేస్తాను అని సాక్షి,రిషిని అడుగుతుంది.జగతి, వసుధార, మహేంద్ర అందరూ కచ్చితంగా సాక్షి ఏదో ప్లాన్ తోనే వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటారు.ఈ విషయంలో అందరికీ అభ్యంతరం లేకపోతే తనను మనలో జాయిన్ చేసుకుంటాను అని అడుగుతాడు రిషి .డాడి మీరేమంటారు అనే రిషి,మహేంద్రని అడుగుతారు. నాకు ఓకే అని మహేంద్ర చెప్తాడు.

Guppedantha Manasu 12th July Today Episode : కొత్త ప్లాన్తో మిషిన్ ఎడ్యుకేషన్ లోకి అడుగుపెట్టబోతున్న సాక్షి

మిగిలిన అందర్నీ కూడా అడిగితే అందరూ ఓకే అని అంటారు.తర్వాత జగతి మేడమ్ ని అడిగితే తన కూడా ఓకే చెబుతుంది.అందరికీ థ్యాంక్స్ చెప్పి కూర్చుంటుంది సాక్షి.రిషి సార్ నా దగ్గర ఒక కొత్త ఐడియా ఉంది అని టాపిక్ మొదలుపెడుతుంది సాక్షి.ఏంటి సాక్షితో ఇంత బాగా మాట్లాడుతున్నాడు రిషి అని. మహేంద్ర, జగతి ఆశ్చర్యపోతూ ఉంటారు.ఎప్పుడు లెేనిది సాక్షితో ఇలా మాట్లాడటం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సాక్షి తన ఐడియా మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ తీరా చూస్తే ఐడియా మొత్తం జగతి మేడమ్ తయారుచేసిన ఫైల్ అని వసుధార కి అనుమానం వస్తుంది.

ఎందుకంటే వసుధర దగ్గర ఉన్న ఫైల్ మిస్సయింది కదా అలా అనుమానం వస్తుంది. వసుధార ఏమో మీరెందుకు సాక్షి ప్రపోజల్ను ఒప్పుకున్నారు నాకర్థమైంది సార్. నేను మీకు నో చెప్పానని నా మీద కోపంతో ఇలా చేస్తున్నారు కదా అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత జగతి తన క్యాబిన్ లో కూర్చొని మీటింగ్లో జరిగిన దాని గురించి మొత్తం ఆలోచించుకుంటూ ఉంటుంది.ఇంతలో జగతి దగ్గరికి వసుధార వస్తుంది.ఏంటి ఏమైంది ఇంతకు
ముందులాగా చురుగ్గా కనిపించట్లేదు.

ఇంతకుముందు ఎప్పుడైనా మీటింగ్ గురించి అడిగితే ముందుగానే అన్ని ఫైల్స్ తయారు చేసి సిద్ధంగా ఉంచెదానవి. కాని ఈరోజు ఏంటీ ఇలా అయింది అని జగతి వసుధారని అడుగుతుంది.నేను ప్రింట్ తీసి పెట్టాను మేడం కానీ ఎక్కడో కనిపించకుండా పోయింది. నాకర్థం కావట్లేదు అని వసుధార జగతి తో చెప్తుంది.జీవితంలో ప్రతి ఒక్కటి ప్లానింగ్ చెసుకోవడం అనేది చాలా ముఖ్యం అని జగతి వసుతో చెప్తుంది.ఈ మధ్య ని ఏకాగ్రత తగ్గింది అని జగతి వసుధారతో అంటోంది.అది ఏం లేదు మేడమ్ నేను బాగానే ఉన్నాను అని వసుధార చెప్తుంది.నీ వల్ల ఇతరులకు నష్టం జరిగితే అది చాలా పెద్ద ప్రమాదం జాగ్రత్తగా ఉండు అని జగతి వసుధారకి చెప్తుంది.

అసలు ఆ ఫైల్ ఎలా మిస్సయిందో నాకర్థం కావడంలేదు అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.జగతి, వసుధార మాట్లాడుకుంటుంది మొత్తం సాక్షి డోర్ దగ్గర ఉండి, అంతా వింటుంది. ఈ ఫైలు మొత్తం కొట్టేసింది నేనే అని సాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది.రిషి దగ్గర మార్కులు కొట్టేయడానికి నేనే అలా చేశాను అని సాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది.నేను నా ప్లాన్ ఛేంజ్ చేశాను వసుధార, ని తెలివితేటల్ని నేను ఉపయోగించుకొని రిషి దగ్గర మార్కులు కొట్టేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది సాక్షి. ఇంతలో రిషి బయటికి వెళ్తుండగా, సాక్షి ఎదురుపడుతుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్వావు ఇంటికి వెళ్ల లేదా అంటే నేను ఏదైనా పని మొదలుపెడితే పూర్తి అయిందాకా వదిలిపెట్టను అని సాక్షి, రిషితో చెప్తుంది.

ఇంతలో అక్కడికి అటెండర్ వస్తారు, శివ అన్నీ చెక్ చేసి తాళాలు సరిగా వెేసేయి అని చెప్పాడు. ఇంకా వసుధార మేడం లోపలే ఉంది సార్ అని అటెండర్ చెప్తారు.దాంతో వసుధారని వెళ్లి పిలువు అని రిషి చెప్తాడు.ఇదేంటి నేను రిషితో వెళ్దామనుకుంటే వసుధార ఇక్కడే ఉంది. తనకి క్యాబ్ బుక్ చేసి తనని క్యాబ్ లో పంపిచేద్దాం అని సాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఇదేంటి సాక్షి ఇక్కడే ఉంది అని తను కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది.వసుధార నువ్వేంటీ ఇంకా ఇక్కడే ఉన్నావు అని సాక్షి వసుధారాని అంటుంది. ఆ ప్రశ్న నేను అడగాలి అని వసుధార అంటోంది. ఒక పని ఒప్పుకున్నాక పూర్తి అయిందాకా బాధ్యతతో ఉండాలి.అని సాక్షి చెప్తోంది.

నేను ఈ వర్క్ చేస్తాను. క్యాబ్ బుక్ చేస్తాన్లే అని సాక్షి చెప్తుంది.ఏంటి సాక్షి క్యాబ్ బుక్ చేశవ,అని రిషి సాక్షిని అంటాడు. అవును రిషి అని సాక్షి చెప్తుంది. థాంక్స్ ఒక శ్రమ తగ్గించావు అని రిషి అంటాడు నేను నిన్ను ఎలా డ్రాప్ చేయాలి అని ఆలోచిస్తున్నాను అని రిషి సాక్షి తో అంటాడు.అది విన్న సాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రిషి క్యాబ్ బుక్ చేసింది నాకోసం కాదు వసుధార కోసం అని అంటోంది. సాక్షి వసుధార కోసం ఎందుకు క్యాబ్ అని రిషి అంటాడు.నేను వసుధార మా ఇంటికి వెళ్లి చదువుల పండగ వర్క్ చెయ్యాలి కదా అని రిషి సాక్షితో అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సాక్షి.

అదేంటి రిషి నేను మీ ఇంటికి రాకూడదా తాను మాత్రమే రావాలా అని అంటోంది సాక్షి, తనని తన రూమ్ కి పంపించు నేను వస్తాను అని అంటోంది సాక్షి.నువ్వు వచ్చి ఏం చేస్తావు సాక్షి. అక్కడైతే మేడం, వసుధార ఇద్దరూ కలిసి సరైన అవుట్పుట్ చేసుకుంటారు అని అంటాడు రిషి.ప్లీజ్ రిషి నేనుకూడా వస్తాను ఒక్కదాన్నే ఉంటే ఏదోలా అనిపిస్తోంది అని సింపతితో మాట్లాడుతోంది సాక్షి ,దాంతో వెంటనే రిషీకి, తను సూసైడ్ చేసుకుంది గుర్తొచ్చి కాదనలేక పద సాక్షి అని ఓకే చెప్తాడు. పదండి వెళ్దాం అని రిషి చెప్పగానే,వసుధార ని పక్కకు తోసేసి మరీ సాక్షి వెళ్లే ముందు సీట్లో కూర్చుంటుొ౦ది.

దాంతో ఏంటి ఈ సాక్షి అసలేం చెయ్యాలనుకుంటుంది నిన్నటిదాకా రిషి సార్ ని ఇబ్బందిపెట్టింది. అలాంటి తనతో ఎందుకు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు రిషి సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధార.అలా అనుకుంటూ కోపంగా కారులోకి ఎక్కి కూర్చుంటుంది వసుధార.మొత్తానికి రిషి పక్కన కూర్చునే వసుధారని వెనక్కి పంపి నేను కూర్చున్నాను అలాగే నేను కూడా వసుధార స్థానంలోకి ఎలాగైనా వెళ్తాను అని, రిషి మనసులో వసుధార స్థానంలోకి నేను రావడమే మిగిలింది అని సాక్షి మనసులో అనుకుంటు ఉంటుంది.

తరువాత సాక్షి ఎన్ని తప్పులు చేసినా సాక్షిని ఎందుకు క్షమించాడు రిషి సార్ అని వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది.అది గమనించిన సాక్షి, రిషి తో ఏదో మాట్లాడబోతుంది.తన ఎంగేజ్మెంట్ టాపిక్ తీసుకొస్తుంది.ఒక్కొక్క సారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో తరువాత ఆ నిర్ణయం తప్పు అని తెలిసిన తర్వాత బాధపడతారో నా విషయంలో కూడా అలాగే జరిగింది రిషి అని సాక్షి చెప్తోంది .అలా రిషి తో సాక్షి ఏదేదో మాట్లాడుతుంది. అంతా బాగుంటే ఈపాటికి మనిద్దరి పెళ్లి అయి వుండేది కదా అని సాక్షి, రిషి తో అంటోంది.దాంతో వసుధార కి కోపం వచ్చి ఆపుతారా అని గట్టిగా అరుస్తోంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement