Guppedantha Manasu 15th July Today Episode : గుప్పెడంత మనసు సిరియల్ లో రిషి తో తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నా వసుధార అసలేం జరిగింది.

Guppedantha Manasu 15th July Today Episode : రిషి ఒంటరిగా కూర్చొని కాలేజీలో జరిగిన సన్మానం గురించి ఆలోచిస్తాడు. అప్పుడు వసుధరా మెడలో వేసిన దండ గురించి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ దండ వెతికి తన చేతిలోకి తీసుకొని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు ఆలోచించినా వసుధర మనసులో ఏమనుకుంటుందో నాకు తెలియట్లేదు.నాకు ఏమైనా అయితే తట్టుకోలేను అంటోంది అలాంటిది నాకు నో చెప్పింది. అసలు ఏంటీ వసుధరా నో చెప్పిన దగ్గర్నుంచి నాతో ఇంక చనువుగా ఉంటుంది. అసలు ఏంటీ వసుధార, వసుదార మనసులో ఏం ఉందో తెలుసుకోవాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు రిషి.

Advertisement

ఇంతలో పైనుండి వాసుదార కిందికి దిగి రిషి రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది.వసుధార తనకుతాను తెలియకుండానే రిషి రూమ్ లోకి వస్తుంది. అసలు ఏమైంది నాకు రిషి సార్ పదేపదే గుర్తుకోస్తున్నారు నాకు ఏమైంది అసలు అని అనుకుని వసుదార తిరిగి వెళ్ళిపోతుంది.వసుధార ఫోన్లో రిషి ఫోటో చూసుకుంటూ తిరిగి తన రూమ్ లోకి వెళ్తుంది. అలా రూమ్లోకి వెళ్లగానే వసుదార చేతిలో ఉన్న ఫోన్ సాక్షి లాక్కుంటోంది. ఏంటి వసుదార ఏం చేస్తున్నావు రిషి ఫోటో చేస్తున్నావేంటి అని సాక్షి అంటోంది.సాక్షి చేతిలో ఉన్న ఫోన్ వసుధార తీసుకొని ఒక్కటి నా ఫోన్ లాక్కోవడం తప్పు. రెండు నా ఫోన్ నా ఇష్టం.

Advertisement

Guppedantha Manasu 15th July Today Episode : రిషి తో తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నా వసుధార అసలేం జరిగింది.

Guppedantha Manasu 15th July Today Episode
Guppedantha Manasu 15th July Today Episode

మూడు రిషి సార్ ఫొటోనైనా చూస్తాను ఇంకెవరు ఫొటోనైనా చూస్తాను అది నా ఇష్టం నాలుగు అవసరం లేని విషయాల్లో తలదూర్చకు అని వసుదార సాక్షితో గట్టిగా చెప్తోంది.దాంతో సాక్షికి కోపం వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది .ఏంటి కోపంగా చేస్తున్నావు అని వసుదార అడుగుతుంది. ఇంతలో వసుధారా అవును సాక్షి నేను ఎక్కడి నుంచి వస్తున్ననో తెలుసా నీకు, ఆప్షన్స్ ఇవ్వనా అని అంటోంది. సాక్షి చెప్తే చెప్పు లేకపోతే లేదు అని వసుదారతో అంటోంది. నేను రిషి సార్ గదిలోనుండి వస్తున్నాను.రిషి సార్ ని చూడాలనిపించింది అందుకే వెళ్లాను, అని కావాలనే మాట్లాడుతోంది వసుధార.

చుాడు సాక్షి నేను రిషి సార్ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లి ఏం చేయాలనుకుంటే అది చేయగలను. కానీ నువ్వు చెయ్యలేవు అని వసుదార అంటోంది.ఒకవేళ నువ్వు వెళ్ళినా ఏదో మనసులో కుట్ర పెట్టుకొని వెళ్తావు కానీ నేనలా కాదు అని వసుదార సాక్షితో చెప్తుంది.నీకు ఒకటి చెప్పాలి సాక్షి ఎప్పుడైనా సరే విలన్లు గెలిచినట్టే అనుకుంటారు కానీ గెలవరు చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తుంది. అని వసుదార సాక్షితో చెప్తుంది.అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు కొద్దిసేపు.తర్వాత ఇక చాలు వెళ్ళి పడుకో అని వసుదార చెప్తోంది.తెల్లవారిన తర్వాత రిషి తన రూమ్ నుండి బయటకి వచ్చి నిలబడి వసుదార గురించే ఆలోచిస్తాడు.

ఏంటి నేను ఎన్నిసార్లు వద్దు వద్దు అని అనుకున్నా వసుధార గురించే ఆలోచిస్తున్నాను అని అనుకుంటాడు. తనకి ఈ ఇంట్లో సౌకర్యంగా ఉందో లేదో అని ఆలోచిస్తాడు రిషి.ఇంతలో వసుదార రూమ్లో దేని గురించో వెతుకుతూ ఉంటుంది. రిషి వచ్చి చూస్తాడు.కాసేపు అయినా నిద్రపోయావా లేదా రాత్రంతా వర్క్ చేస్తూనే ఉన్నావా అని రిషి వసుధారని అడుగుతాడు. పర్లేదు సార్ కొద్దిసేపు పడుకున్నాను అను వసుదార చెప్తోంది.వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందా అని రిషి అడుగుతాడు అయిపోయింది సార్ ఒకసారి చెక్ చేసి మెయిన్ పాయింట్ను రాసుకుంటే సరిపోతుంది అని వసుధార చెప్తుంది.ఏదో వెతుకుతున్నావు అని అడిగితే పెన్సిల్ వెతుకుతున్నాను సార్ అని వసుదార చెప్తుంది.

ఎక్కడో పెట్టిను సార్ దొరకట్లేదు పెన్సిల్ అని వసుదార అంటోంది. రిషి వసుధార వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ నన్ను అలా చూస్తున్నాడు అని అనుకుంటుంది వసుదార.ఇంతలో రిషి, వసుధార దగ్గరకి తనను చూస్తూ దగ్గరికి వస్తూనే ఉంటాడు. అలా చాలా దగ్గరకి వచ్చి తన జెడలో ఉన్న పెన్సిల్ని తీశాడు.పెన్సిల్ని ఇలా కూడా వాడతారా అని రిషి అడుగుతాడు ఏదో ధ్యాసలో పడి అలా పెట్టానేమో సార్ అని వసుదార చెప్తుంది. ఏం ధ్యాస అని అడుగుతాడు రిషి.పనిలో పడి మర్చిపోయాను సార్ అని వసుధార చెప్తుంది. మర్చిపోవడమనేది కొందరికి గొప్పవరం అలాగే మర్చిపోలేకపోవడం కొంతమందికి శాపం అని అంటాడు రిషి. పనిలో పడి టిఫిన్ చేయడం కూడా మర్చిపోతావా అని అంటాడు.

లేదుసార్ కొంచెం వర్కుంది చేసుకున్న తర్వాత వచ్చి తింటాను అని వసుదార చెప్తుంది.నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని రిషి వసుదారని అడుగుతాడు.మనసులోనే ఇబ్బందిగా వుంది సార్ మీరు నేను ఇక్కడే ఉన్నాం అయినా సరే నేను నా మనసులో మాట చెప్పలేక పోతున్నాను ఈసారి చెప్పేస్తాను అని అనుకుంటాను కానీ ప్రతిసారీ చెప్పలేకపోతున్నాను మీరు ఎదురు పడే సరికి మాట రావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.హలో ఏమైంది అని రిషి అడుగుతాడు,ఏమీ లేదు సార్ అని వసుధార చెప్తుంది.

కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను నీలో ఏదో మార్పు వచ్చింది వసుదార అని రిషి అంటాడు.నాలో చాలా మార్పు వచ్చింది సార్ నా మనస్సులో మీరు ఉన్నారన్నమాట మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని నా మనసు ఆరాటపడుతోంది అందులో వచ్చిన ఉత్సాహమే మీకు మార్పులా కనిపిస్తుంది. మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నాకు ఏమైందో తెలియదు మీకు నేను నో చెప్పి రిజెక్ట్ చేశాను. కానీ నా మనసులో మాట మీకిప్పుడు చెప్పేస్తాను సార్ ఇంతకంటే మంచి సమయం రాదు అని మనసులో అనుకుంటు, వెంటనే సార్ మీకొక విషయం చెప్పాలి అని వసుధార అనగానే రిషి కూడా నికొక విషయం చెప్పాలి అని అంటాడు.మీరే చెప్పండి సార్ అని అంటోంది.

ఏం లేదు వసుదార కొందర్ని చూస్తుంటే నాకు ఏంటో అర్థం కాదు అప్పటికప్పుడే మాట మారుస్తూ ఉంటారు.అంటే అప్పుడే ఒక అభిప్రాయం చెబుతారు ఇంతలో ఇంకొక మాట చెప్తారు, మనుషులు మాట ఎందుకిలా మారుస్తారు చెప్పు అని వసుదారని రిషి అడుగుతాడు.కష్టమైనా నష్టమైనా ఒకేమాట మీద ఉండటం మంచి లక్షణం కదా అని రిషి అడుగుతాడు. మనుసులో ఒక్కటి మాటగా మరొకటి చెప్పే వాళ్లు ఈ మధ్య కాలేజ్ వ్యవహారాల్లో ఎదురయ్యారు.అందుకే ఈ మాట చెబుతున్నాను అని రిషి వసుదారతో చెప్తాడు. ఇప్పుడు చెప్పు నువ్వు ఏదో చెబుతానన్నావ్ కదా అని రిషి అడుగుతాడు. ఏం లేదు సార్ అని వసుధార అంటోంది. ఇప్పుడే చెప్తానన్నావ్ కదా అని రిషి అడుగుతాడు.

చదువులో పండగ గురించి ఒక డౌటు ఉంది సార్ వర్క్ మొత్తం పూర్తి అయిన తర్వాత డౌటు గురించి అడుగుతాను సార్ అని అంటోంది వసుదార. కొంచెం క్లారిటీ మిస్సయింది సార్ అది రాకపోతే అడుగుతాను అని రిషి తో చెప్తోంది వసుధార.రిషి వెళ్లిపోతాడు తరువాత వసుదార మీకు నా మనసులో మాట తొందరగా చెత్తాను సార్ అని మనసులో అనుకుంటోంది.ఇకపోతే తరువాత దేవయాని కాఫీ చేసి సాక్షి చేతిలో పెట్టి ఇదే నీకు మంచి అవకాశం కరక్టుగా వాడుకొ.నేను చెప్పినట్టువిను పొద్దున్నే కాఫీ ఇస్తే ఆ రోజు మొత్తం కాఫీ ఇచ్చినవాళ్లే గుర్తొస్తారు.

అని దేవయాని ఏదేదో సాక్షితో చెబుతోంది తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని సాక్షి అంటుంది.మీరు చెప్పే ఐడియాలు పాటించాలంటే నాకు కష్టం. నా ఐడియాలు నాకు ఉన్నాయి కానీ మీరేదో నాకు సపోర్ట్ చేస్తున్నారని మీరు చెప్పిందానికి సరే అంటున్నాను అని సాక్షి మనసులో దేవయాని గురించి అనుకుంటూ ఉంటుంది.ముందు రిషి దగ్గరికి వెళ్ళి కాఫీ ఇవ్వు అని పంపిస్తుంది. కాఫీ తీసుకుని వెళ్లిపోతుంటే సాక్షికి, ధరణి ఎదురుపడుతుంది. అత్తయ్యగారు నీకేమైనా కాఫీ కావాలా అని ధరణి అడుగుతుంది నాకు కాఫీ కావాలంటే నేనే నిన్ను అడుగుతాను అస్తమానం వచ్చి నన్ను అడక్కు అని దేవయాని ధరణితో అంటోంది.

నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటాను ఏమైనా కావాలంటే అడుగుతాను అని దేవియాని ధరణితో చెబుతుంది. ధరణి తిరిగివెళ్ళిపోతూ పొద్దున్నే సాక్షితో కాఫీ ఇచ్చి పంపించింది కొత్తగా ఏమి ఐడియా వేస్తుందో అత్తయ్యా అని ధరణి మనుషులో అనుకుంటోంది.ఇకపోతే గౌతం రిషి రూమ్లో ఉంటారు. గౌతమ్ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఏమైందిరా అని రిషి అడుగుతాడు.ఇంత టైమైంది కాఫీ కడుపులో పడలేదురా అదే ఆలోచిస్తున్నాను అని గౌతమ్ అంటాడు. కిచెన్లోకి వెళ్లి వదినని అడిగితే సరిపోతుంది కదా అని రిషి చెప్తాడు.ఇంతలో సాక్షి కాఫీ తీసుకుని వస్తోంది గౌతమ్ వెంటనే సాక్షి చేతిలో వున్న కాఫీని తీసుకుంటాడు,సాక్షి ని మాట్లాడనీయడు ఒక కాఫీ రిషికి ఇంకొక కాఫీ నాకు అని తీసుకుంటాడు గౌతమ్.ఏంటి ఈ గౌతమ్ కాఫీ తను తీసుకున్నాడు. నా ప్లాన్స్ ఫెయిల్ అయ్యింది అని సాక్షి మనుసులో అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement