Guppedantha Manasu 16th July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 16-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం, దేవయాని సాక్షికి వార్నింగ్ ఇచ్చిన జగతి.

Guppedantha Manasu 16th July Today Episode : సాక్షి తెచ్చిన కాఫీని గౌతమ్ తీసుకొని ఒకటి గౌతమ్ తీసుకుని మరొకటి రిషికి ఇస్తాడు. నువ్వు కాఫీ తెచ్చావేంటి సాక్షి అని రిషి అడుగుతాడు నాకు అలా ఏం లేదు రిషి నేను ఫోజులకు పోను అందర్నీ కలుపుకొని పోతాను అని సాక్షి చెప్పగానే, నేను కూడా సేమ్ అలాగే అని గౌతమ్ అంటాడు ఫ్రెండుగా ఇంట్లో సిగ్గులేకుండా ఏది కావాలంటే అది చేస్తూపోతూ ఉంటాను అని గౌతమ్ అంటాడు నేనేం భయపడను అని చెప్తాడు గౌతమ్. ఇంతలో వసుదార గుడ్ మార్నింగ్ సార్ అని అనుకుంటూ వస్తుంది.హాయ్ వసుదర అని గౌతమ్ చెప్పి వసుధరా కాఫీ తాగుతావా అని అడుగుతాడు లేరుసార్ కాఫీ తాగాలని ఉంది తల పగిలిపోతోంది సార్ అని వసుదార చెప్తుంది.

Advertisement

ఇంతలో రిషి అవునా అలాగైతే ఈ కాఫీ మనిద్దరం షేర్ చేసుకున్నాం అని రిషి చెప్తాడు.అసలే రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండి నువ్వు వర్క్ చేశావుకదా ఫర్లేదు ఇద్దరం కలిసి తాగుదాం అని రిషి కాఫీని సాసర్లో పోస్తాడు. వసుధార నీకు కప్ లో కావాలా సాసర్లో కావాలా అని రిషి అడుగుతాడు. దానికి సమాధానంగా సాక్షి నేను కప్ లో తాగుతాను రిషి అని అంటోంది. ఏంటి సాక్షి నువు మా గెస్ట్వి.నీకు ఇలా సగంసగం కాఫీ ఇస్తాన చెప్పు నువు అడిగినా నేను ఇవ్వను అని రిషి సమాధానమిస్తాడు. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సాక్షి గారికి నేను స్పెషల్గా కాఫీ చేస్తాను.

Advertisement

Guppedantha Manasu 16th July Today Episode : దేవయాని సాక్షికి వార్నింగ్ ఇచ్చిన జగతి.

Guppedantha Manasu 16th July Today Episode
Guppedantha Manasu 16th July Today Episode

ముందు నాకు కాఫీ ఇవ్వండి సార్ అని రిషి చేతిలో వున్న కప్పుని తీసుకొని వసుధార తాగుతుంది.గౌతమ్ వెంటనే రిషి నీకు సాసర్లో కాఫీ తాగడం వచ్చా అని అడుగుతాడు నేర్చుకున్నాను అని రిషి చెప్తాడు. కాఫీ చాలా బాగుంది సాక్షి అనే వసుదార చెప్తోంది.అవును సాక్షి కాఫీ చాలా బావుంది అని రిషి కూడా చెప్తాడు.నేను తెచ్చిన కాఫీ రిషి, వసుదార షేర్ చేసుకుంటారా, ఎలాగైనా వసుదారని ఇరికిస్తాను అని మనసులో అనుకుంటోంది సాక్షి.అవును వసుదార ఎప్పుడూ ఒకేరకమైన బట్టలు వేసుకుంటవేంటి అని సాక్షి అడుగుతోంది. నేను ఒకే ప్యాట్రన్ ఉన్న డ్రస్సులు వాడతాను అని వసుధార సమాధానం ఇస్తుంది.

అందుకే అలా అనిపిస్తూ ఉంటుంది అని చెబుతుంది. అలా ఎందుకు అంటావు ఉన్నవే నీకు నాలుగు జతల అనుకుంటా అందుకే ఎప్పుడూ ఆవే వేసుకుని కనిపిస్తూ ఉంటావు అని వెటకారంగా చెబుతోంది సాక్షి. దానికి అందరూ ఫీలవుతారు.ఇకపోతే తర్వాత దేవయాని హాల్లో కూర్చుని ఉంటే జగతి వచ్చి గుడ్ మార్నింగ్ అక్కయ్యా అని అనగానే ఏంటి కొత్తగా నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అని అంటోంది. అందరూ బాగుండాలి అని కోరుకున్నప్పుడె గుడ్మార్ఫింగ్ అని చెప్తాం. మనం బావుండాలని అందరి మనసులు బాగుండాలని కోరుకోవడం నా మనస్తత్వం అని చెబుతోంది జగతి. ఏంటి పొత్తున క్లాస్ చెప్పడానికి వచ్చావా అని దేవయాని అంటోంది.

అవును అక్కయ్య నేను క్లాస్ ఇవ్వడానికి వచ్చాను కరెక్టుగా చెప్పారు అని అంటోంది జగతి.ఇంతలో పైనుంచి సాక్షి వస్తూ ఉంటుంది తన చేతిలో ఉన్న కప్ ట్రెనీ చూస్తోంది జగతి.ఏంటి సాక్షి ఏం చేస్తున్నావు అని అనగానే సాక్షికి ఏం తెలవదు అనే దేవయాని అంటోంది.సాక్షి కి ఏం తెలియదు అక్కయ్య అంతా మీరే చేస్తున్నారు సాక్షిని మీరే పొల్యూట్ చేస్తున్నారు అని నాకు తెలుసు అని జగతి అంటోంది.ఏంటి అంటీ అలా అంటున్నారు దేవయాని అంటీ నాకు ఏం చెయ్యలో నాకేం చెప్పట్లేదు నేనేం చిన్నపిల్లనా కాదుకదా ఆంటీ అనే సాక్షి అంటోంది.

నువ్వు చిన్నపిల్లవి కావు సాక్షి కానీ సాధ్యాసాధ్యాల చూసి మసులు కోవాలి అని జగతి అంటోంది. కాలేజీకి వస్తున్నావు ఇంటికి వస్తున్నావు నాకేం ప్రాబ్లమ్ లేదు.కానీ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటే నేనైతే చూస్తూ ఊరుకోను ఇప్పుడే చెపుతున్నాను అని జగపతి అంటోంది.ఏం మాట్లాడుతున్నావ్ ప్రగతి అనే దేవయాని గట్టిగా అంటోంది నేను కూడా గట్టిగా మాట్లాడగలను అక్కయ్యా అని జగతి సమాధానమిస్తుంది. నిజానికి అబద్ధానికి కంటే ఎక్కువ కొంతు ఉంటుంది అక్కయ్య. కాని నేను మీలా అరవను అని చెప్తుంది జగతి. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వినండి అని జగతి అంటోంది. సాక్షిని మీరు ఉద్ధరిస్తున్నారు అని అనుకుంటున్నారు.

కానీ నిజానికి సాక్షి ని మీరే చెడగొడుతున్నారు.సాక్షి నువు జాగ్రత్తగా విను నీ జీవితం నీ ఆలోచనలు అన్నీ నీ ఇష్టప్రకారమే సాగాలి జీవితంలో ఒకటే అనుకున్నప్పుడు అది జరగదు అసాధ్యం అని తెలిసినప్పుడు దారి మళ్లించుకోవాలని అంతేగానీ మొండిగా ప్రవర్తించకూడదు అని జగతి గట్టిగా చెబుతోంది.దేవయాని మాట్లాడబోతే ముందు మీరు మాట్లాడకండి అక్కయ్య చేసేవన్నీ చేసి మీరు రిషిని నమ్మించగలరు కానీ నన్ను నమ్మించలేరు జరిగేవేనని రిషికి చెప్తే ఈ క్షణం ఏం జరుగుతుందో ఆలోచించుకోండి.లైబ్రరీలో ఏం చేశారు అభినందన సభలో ఏం చేశారు అసలు మీరేం సాధించాలనుకుంటున్నారు అని జగతి గట్టిగా అంటోంది. రిషి మనసు కష్ట పడే పని ఏమైనా చేస్తే ఇక నేను ఊరుకోను

.మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక నువ్వు వెళ్లు సాక్షి అని జగతి గట్టిగా అంటోంది. అక్కయ్య ఇరవై ఏళ్లకు పైగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ మీ బుద్ది మారలేదు మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవట్లేదు అయినా సరే ఇప్పటికీ నేను మీకు మర్యాద ఇస్తున్నాను ఇప్పటికైనా మీరు మారకపోతే నా మంచితనానికి కూడా కోపం వస్తుంది అది మీరు తట్టుకోలేరు. అప్పుడు మీరు ఇబ్బందులు పడతారు అని జగతి దేవయానితో గట్టిగా చెబుతోంది. నేను వెళ్ళి రిషికి జరిగిన అన్ని చెప్తే ఏం చేస్తాడో మీరే ఆలోచించుకోండి అని జగతి దేవయానితో గట్టిగా చెప్తోంది.

తర్వాత జగతి మహేంద్ర కారులో వెళుతూ ఉంటారు అప్పుడు జగతి సీరియస్గా ఉంటుంది మహేంద్ర కారు ఆపి ఏమైంది జగతి అని అడుగుతాడు ఏమీ లేదు అని జగతి అంటుంది అప్పుడు మహేంద్ర ఎంత పెద్ద కష్టం వచ్చినా చిరునవ్వుతో ఉంటావు అలాంటిది సీరియస్ గా ఉన్నావు అంటే ఏదో అయ్యింది ఏమైంది చెప్పు అని అడుగుతాడు అప్పుడు జగతి కొన్ని సమస్యల్ని పరిష్కరించొచ్చు కొన్నింటిని భరించాలి ప్రతి ఒక్కటి నీకు చెప్పి నిన్ను కష్టపడలేను అని, దేవయాని అక్క రిషి వసుధార కలిసి ఉండటం చూసి రగిలిపోతుంది అని కొద్దిసేపు మాట్లాడతారు జగతి మహేంద్ర.

తర్వాత కాలేజ్లో జగతి దగ్గరికి చదువుల పండుగ ఫైల్ తీసుకుని వసుధార ఒకసారి చూడండి మేడమ్ అని అంటుంది అప్పుడు జగతి నువ్వేచూడు వసుధార ఇది రిషి అప్రూవ్ చేయాలి అన్ని వర్క్స్ రిషితోపాటు కలిసి చేయి అని చెబుతుంది రిషి సార్ పక్కనే ఉండలేను కదా మేడమ్ సార్ చెప్పకుండా అని అంటోంది అన్నీ చెబితేనే చేస్తున్నావా అని అంటుంది జగతి అప్పుడు వసుదార మనసులో మేడం దేని గురించి ఆలోచిస్తున్నారో అని అనుకుంటు ఉంటుంది, ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా సాక్షి అక్కడికి వస్తుంది మీ అబ్బాయిని బాగా చూసుకోమని చేపుతున్నారు కదా మరి అలా నాకెప్పుడూ చెప్పలేదేంటి ఆంటీ అని అడుగుతుంది జగతిని సాక్షి.

అప్పుడు జగతి సాక్షి నా మీద నీకు కోపం ఉందేమో కానీ నీమీదనాకేమి కోపం లేదు అని పైగా బాగా చదువుకున్నావు లండన్ కి వెళ్లవు నీ కాళ్ళమీద నువ్వు నిలబడ్డావు ఇవన్నీ చూస్తే నాకు సంతోషం వేస్తుంది ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉండాలో ఎలా ఆలోచించాలో ఎంతవరకు ఎదగాలో అలాంటి ఆ లక్షణాలన్నీ నీలో చూసి సంతోషించాను కాని ఆ తరువాత నే నువ్వు ఆలోచించే పద్ధతి నాకు నచ్చలేదు సాక్షి నాకు ప్రత్యేకంగా నీమీద కోపం అంటూ ఏమీ లేదు అంటే, అంటీ నేను ఒక్కటే అడుగుతుంటే మీరు ఒకటి చెబుతున్నారు అని సాక్షి అంటుంది మీ అబ్బాయిని నాకు ఇవ్వండి కాలేజ్ ఎండీని వసుధారకి వదిలేయండి ఎవరికి కావాల్సింది వాళ్లు సెలక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది.

వసుధార కి ఎండీగారితో కాలేజీల్లో మాత్రమే పని ఉంది నాకు కాలేజ్ అయిపోయాక కాలేజీ ముందు మీ అబ్బాయి రిషి కావాలని ఆంటీ అని అంటుంది అప్పుడు జగతి ఇదే సాక్షి వద్దు అనేది ఆలోచించే పద్ధతి కరెక్ట్ కాదు అని అంటోంది మామిడి చెట్టుకింద కూర్చుని యాపిల్ రాళాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో నువ్వు ఆలోచించేది కూడా అలానే ఉంటుంది మనకి ఏది సరైందో మనం ఎదుటి వాళ్ళకి సరైన వాళ్ళమో కాదో తెలుసుకోవడం మన విజ్ఞత సాక్షి రిషి నిన్ను వద్దన్నాడు అయినా నువ్వు రిషి వెంటపడుతున్నావు నువ్వు ఇలా చెయ్యడానికి నీ వెనక ఎవరున్నారో కారణం నాకు తెలుసు నీ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు ఈ విషయం నీకు తెలియడం లేదు ఇలా మాట్లాడుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement