Guppedantha Manasu 18 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 18-Aug-2022 ఎపిసోడ్ 531 ముందుగా మీ కోసం…..మహీంద్రా జగతి గౌతమ్ మీరెక్కడున్నారు ఏంటి అని రిషి వాళ్ళని అడిగితే మహేంద్ర నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అని చెప్పి తప్పించుకుంటాడు. అలాగే రిషిని కూడా మహేంద్ర మీరిక్కడేం చేస్తున్నారని అడిగితే ఎగ్జామ్ కి సంబంధించిన చర్ఛలు చెయ్యడానికి కలిశాము అని చెప్తాడు రిషి.రిషి, మహేంద్ర, జగతి, గౌతమ్, కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్లందరికీ వసుధార కాఫీ తెచ్చి ఇచ్చింది. నువుకూడా తాగు పర్లేదు అని చెప్పి వసుదారని కూర్చోమంటాడు రిషి.రిషి కాఫీని వసుధారతో షేర్ చేసుకుంటాడు.నైట్ డిన్నర్ టైంలో రిషి వాళ్లింట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కానీ దేవయాని రాకపోయేసరికి రిషి భోజనం తీసుకొని దేవయాని దగ్గరికి వెళ్తాడు.దేవయానికి రిషి భోజనం తినిపిస్తూ వుంటాడు. దేవయాని మాత్రం ఏడుస్తూ రిషి దగ్గర ప్రేమను నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. దేవయాని సాక్షి గురించి మాట్లాడితే పెద్దమ్మ ఇప్పుడు సాక్షి గురించి వద్దు. తన ప్రేమ మోసం తను మోసం. వద్దనుకొని వెళ్ళిపోయిందికదా పెద్దమ్మ వదిలేయండి ఆ విషయం అని చెప్పి రిషి దేవయానికి భోజనం తినిపిస్తాడు.
Guppedantha Manasu 18 August Today Episode : జగతి ని రిషి సార్ అని కాకుండా రిషి అని పిలవమని చెప్పిన రిషి.
పెద్దమ్మ ఏది ఏమైనా సరే నన్ను ప్రేమించకపోయినా ఫర్వాలేదు ఏదైనా సరే నేను తట్టుకుంటున్నాను కానీ నన్ను మోసం చేసి నా దగ్గర నటిస్తే మాత్రం నేను తట్టుకోలేను అని అంటాడు రిషి. దాంతో ఒక్కసారిగా దేవయాని కంగారు పడిపోతుంది. నా విషయం తెలిస్తే రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ ఉంటుంది దేవయాని.దేవయానికి భోజనం తినిపిస్తున్నది జగతీ చూసి తనకు తినిపిస్తున్నట్టు ఊహించుకొని బాధ పడుతూ ఉంటుంది జగతి.జగతి దగ్గరికి మహేంద్ర వచ్చి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఎప్పుడైనా సరే తప్పకుండా నీ కోరిక తీరుతుంది. రిషి నిన్ను తల్లి అని పిలుస్తాడు అని బాధపడుతున్న జగతికి నచ్చచెప్తాడు మహేంద్ర.వసుధార రూములో ఆలోచిస్తూ ఈరోజు జరిగిన దానికి నాకు ఆకలి కావట్లేదు తినకుండా ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో డ్రైవర్ తో రిషి భోజనం పంపిస్తాడు.వసుధ కి ఫోన్ చేసి టైంకి సరిగా తెనాలి భోజనం తిను అని చెప్తాడు రిషి.తెల్లవారిన తర్వాత రిషి కాఫీకోసం కిచెన్లోకి వెళ్లి వదినా కాఫీ అని అడుగుతాడు.

కానీ అక్కడా జగతి ఉంటుంది.కాఫీ కోసం వచ్చాను అని చెప్తాడు రిషి నన్ను నమ్మమంటారా సార్ అని అడుగుతుంది జగతి ఓకే అని చెప్తాడు రిషి.రిషి జగతితో మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నన్ను రిషి సార్ అని పిలవకండి. రిషి అని పిలవండి అని చెప్తాడు. ఆ మాటతో జగతి సంతోషంతో ఉప్పొంగిపోతోంది.మికు నాకు మధ్య ఉన్న బంధం గురించి నేను మాట్లాడను. కానీ మీరిప్పటినుంచీ నన్ను రిషి అని పిలవండి అని చెప్తాడు.మీకు నాకు అన్ని విషయాల్లో దాదాపు అభిప్రాయాలు కలుస్తాయి ఒక్క విషయంలో తప్ప అని రిషి చెప్తాడు. ఆ ఒక్క విషయం గురించి మాత్రం నేను మాట్లాడను అని చెప్తాడు రిషి.మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి నాకేం నచ్చుతుందో నచ్చదో మీకింతల తెలుస్తుందని నేను అనుకోలేదు అని చెప్తాడు రిషి.వసుధార విషయంలో తన చివరి దిశగా వెళుతోంది తన విషయంలో మీరు సహకరిస్తారనే నాకు తెలుసు అంతకంటే నేనేం చెప్పలేను అని అంటాడు రిషి. జగతి సంతోషంతో ఏడుస్తూ ఉంటుంది.రిషీ కాఫీ అడిగితే ఇస్తాను రిషి అనే సంతోషంతో చెప్తోంది.రిషికి కాఫీ చేసి ఇస్తుంది జగతి. ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.