Guppedantha Manasu 19 August Today Episode : గుప్పెడ౦త మనసు సీరియల్ 19-aug-2022 ఎపిసోడ్ 532 ముందుగా మీ కోసం. రిషి జగతితో మేడం నన్ను రిషి అని పిలవమని చెప్పినందుకు జగతి చాలా సంతోషపడుతు౦ది మహేంద్ర కూడా చాలా సంతోషపడతాడు. ఇక ఆ తర్వాత వసుధరా ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకొని అన్నీ గుర్తుతెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటోంది. వసుధార రిషి సార్ అని ఒక బుక్ లో మొత్తం రాసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రింగు పైన వి అనే అక్షరం మాత్రమే ఉంటుంది. వసుధార ఒక్కటి ఒంటరిగా ఉంటే బాగోలేదు పక్కన రిషి సార్లొ మొదటి అక్షరం ఆరు కూడా చేర్చాలి ఎలాగైనా అనే ప్లాన్ చేస్తూ ఉంటుంది. కాలేజీకి వెళ్లడానికి మహీంద్రా, జగతి బయల్దేరతారు. కానీ ఇంతలో మహీంద్రా కారు టైర్ పంచర్ అవుతుంది. వాళ్ళిద్దరూ క్యాబ్లో వెళ్లాలి అని అనుకుంటారు.
ఇంతలో అక్కడికి రిషి వచ్చి నేను కూడా కాలేజ్ కి వెళుతున్నాను నాతోపాటు రండి వెళదాం అని చెప్పి అంటాడు.డాడి కారు మీరూ ట్రైవు చేయండి నేను వెనకాల కూర్చుంటాను అని కీస్ మహేంద్రకి ఇస్తాడోగానీ జగతి డ్రైవ్ చేస్తోంది. వాళ్ళు ముగ్గురూ వెళ్తూవుండగా వసుధార ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఆటోకు వెళితే డబ్బులు వేస్ట్ అవుతాయి ఆ డబ్బులు పోగుచేసి ఎలాగైనా సరే ఉంగరం చేయించాలి అని నడుచుకుంటూ వెళ్తాను అని వెళ్తూవుండగా. జగతి వసూనే చూసి కారు ఆపుతున్నది. తనని కూడా కారులో ఎక్కించుకున్నారు. వెంటనే మహీంద్ర నేను ట్రైవు చేస్తానని చెప్పి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కావాలని బ్రేక్ వేస్తూ వాసు రిషి ఒకరినొకరు ఢీకొట్టుకొనే లాగా చేస్తూ ఉంటాడు. రిషి రోడ్లు ఇంత బాగోలేకపోయినా నేనెంత బాగా డ్రైవింగ్ చేస్తున్నాను.
Guppedantha Manasu 19 August Today Episode : క్లాస్ రూమ్ లో క్లాస్ సరిగా వినకుండా వసుధార పరధ్యానంగా ఉండటానికి కారణమేంటో రిషి తెలుసుకుంటాడా?

నాకు ఎంత రేటింగ్స్ ఇస్తారు చెప్పండి అని మహీంద్రా అడిగితే. మీకస్సలు రేటింగ్స్ ఇవ్వను డాడి ఇంకోసారి మీకసలు డ్రైవింగే ఇవ్వను అని రిషి అంటాడు. కాలేజీకి వెళ్లిన తర్వాత వసుదార రేంగుకి ఆర్ అనే అక్షరం చేర్చడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎన్ని డబ్బులు ఖర్చవుతాయో ఏంటో అని పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది. రింగ్ చేయించడానికి అవే అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. రిషి వచ్చింది కూడా గమనించదు. రిషి క్లాస్ మొదలుపెడతాడు కానీ వసుధార క్లాస్ వినకుండా తన లెక్కలు వేసుకోవడం గురించి చేతి వైపు చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది. అది రిషీ గమనిస్తాడు.వసుధార ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం లేదు సార్ అని చెపుతోంది. తర్వాత రిషి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. బోర్డు పైన ఒక ప్రాబ్లం రాసి వసుధారని అది సాల్వ్ చేయమని చెప్పి అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.