Guppedantha Manasu 21 Augest 2022 Episide : గుప్పెడంత మనసు ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 537 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి వసుధారకి అసలు ఏమైంది ఆ చేతి మీద ఆ లెక్కలు ఏంటి అని అడగాలని తను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి వసుధార కోసం ఎదురు చూస్తాడు. కానీ అక్కడ వసుధర కనిపించదు. అప్పుడు అక్కడ ఉన్న ఓనర్ ని అడుగుతాడు. వసుధార డ్యూటీ దిగి వెళ్లిపోయిందా అని అడుగుతాడు. లేదు సార్ తన ఏదో పని ఉంది అని ఒక పదివేల రూపాయలు అడిగి తీసుకొని వెళ్ళింది అని చెప్తాడు. అప్పుడు రిషి తనకి డబ్బులు కావాలంటే నన్ను అడగాలి కానీ ఇలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్తాడు. వసుధార రిషి వి అని చేయించిన ఉంగరమును చూస్తూ దాన్ని తీసుకొని దారంతో మెడలో కట్టుకొని సెల్ఫీలు దిగుతుండగా…
రిషి అక్కడికి వెళ్తాడు. అప్పుడు రిషి ని చూసి కంగారుపడుతూ ఆ దండను తీసి దాచిపెడుతుంది. అప్పుడు రిషి ఏమైంది వసుధార నీకు నువ్వు ఏదో దాచావు ఏంటది చూపించు అని అడుగుతాడు. అప్పుడు వసుధార ఏం లేదు సార్ అని తనకి చూపించదు. అప్పుడు రిషి వసుధారని నువ్వు యూత్ ఐకానివి, కాలేజ్ గౌరమ్మర్యాదులు నిలబెట్టిన దానివి.. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి నువ్వు చదువు మీద దృష్టి పెట్టకుండా ఎందుకు ఇలా వింతగా చేస్తున్నావు. అసలు నువ్వు ఏం దాచావు చూపించు అని తన చేతిని దగ్గర నుంచి లాగుతాడు. అప్పుడు ఆ ఉంగరం రిషి చూస్తాడు. ఇది నేను సాక్షి కోసం చేయించిన ఉంగరం కదా.. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది. అవును దీనిని ఎందుకు దాచి పెట్టావు దీనిని మెడలో ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు వసుధార కంగారుపడుతూ ఏం లేదు సార్ అని తడబడుతూ ఉంటుంది. అప్పుడు రిషి తన మనసులో అంటే వసుధార నన్ను ఇష్టపడుతుంది.
Guppedantha Manasu 21 Augest 2022 Episide : వసుధరా మనసులో ఉన్న ప్రేమని తెలుసుకున్న ఋషి…

కానీ ఎందుకు నా ప్రేమని కాదు అంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార ఏమైంది సార్? మీరు ఏమో ఆలోచిస్తున్నారు అని వసుధార అంటుంది. ఏం లేదు అని నువ్వు ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. కట్ చేస్తే దేవయాని చెప్పిన ప్లాన్ ప్రకారంగా సాక్షి మళ్లీ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..