Guppedantha Manasu 24 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 24-aug-2022 ఎపిసోడ్ 537 ముందుగా మీ కోసం…..రిషి జ్ఞాపకాలన్నీ ఒకచోట పెట్టి మాట్లాడుతూ తనకు తాను ఆనంద పడుతూ ఉంటుంది వసుదార.రిషి కూడా తన ఇంట్లో వసుదారతోన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.రిషీ క్యాలెండర్లో ఫేర్వెల్ పార్టీ జరిగే రోజునే టిక్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు.ఫేర్వెల్ పార్టీ గురించి మహీంద్రా, జగతి మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్లతో దేవయానికూడా మాటలు కలుపుతుంది. ఫేర్వెల్ పార్టీ అవుతుందని ఇంట్లో స్వీట్ చేయించాను. మీరు తినండి కాలెస్కీ తీసుకెళ్లండి అని దేవయాని చెప్తోంది. అదేంటి అని అడిగితే ఫేర్వెల్ పార్టీ అయితే కొంతమంది దూరం అవుతారు కదా ఆ సంతోషంతో చేయించాను అని చెప్తుంది దేవయాని.
Guppedantha Manasu 24 August 2022 Episode : వసుధార తన మనసులో మాట రిషికి చెప్తుందా?
రిషి ని జగతి పేరు పెట్టి పిలుస్తున్న విషయం తెలియక దేవయాని జగతితో వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో రిషి రాగానే జగతి మంచిగా రిషి అనే పేరు పెట్టి పిలిచి తనకి కాఫీ ఇస్తుంది. అదంతా చూసి దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.ఇకపోతే కాలేజీ బోర్డులో ఫేర్వెల్ పార్టీ గురించి అనౌన్స్ చేస్తారు.తర్వాత కాలేజీలో ఫేర్వెల్ పార్టీ కి సంబందించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.రిషి దగ్గరికి వసుదార వెళ్లి నాక్కూడా ఏమైనా పని చెప్పండి సార్ అని అడిగితే. పార్టీ చేసెదె మీకోసం మీకేం పని చెప్పాం మీరు మా అతిథులు అనే అంటాడు రిషి.ఇంతలో మహేంద్ర వచ్చి కావాలనే గౌతమ్ని తీసుకెళ్తాడు. వసుధారని,రిషి ని ఒంటరిగా వదిలేసి కాసేపు వాళ్లు మాట్లాడుకుంటారు అని చెప్పి అక్కడ వున్న వాళ్లందర్నీ తీసుకెళ్లిపోతారు.

రిషి వసుదార దగ్గరకి వెళ్లి మాట్లాడబోతుంటే వాళ్ళ పెదనాన్న రిషి ని తీసుకెళ్తాడు.వసుదారని ఇక్కడే వుండు ఎక్కడికీ వెళ్ళకు అని చెప్పి అంటాడు. తర్వాత మహేంద్ర, జగతి ఇద్దరు వసుధార రిషి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజైనా వసుధార తన మనసులో మాట చెప్తుందేమోని నాకనిపిస్తుంది అనే జగతి అంటోంది.తర్వాత రిషి తన స్పీచ్ మొదలు పెడతాడు.స్టూడెంట్స్ తో ఉన్న జ్ఞాపకాలను, అనుభూతుల్ని అన్ని రిషి మాట్లాడుతూ ఉంటాడు.తర్వాత జగతి మేడం తన స్పీచ్ మొదలు పెడుతుంది.జగతి అందరి స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెబుతోంది. తర్వాత ఎవర్నన్నా మాట్లాడమని చెబితే అందరూ వసుధార పేరు చెప్తారు.వసుదార వచ్చి స్టేజ్పైపైన నిలబడుతుంది ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.