Guppedantha Manasu 26 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 26-August-2022 ఎపిసోడ్ 539 ముందుగా మీ కోసం…. వసుధార, రిషితో తన మనసులో మాటను చెపుతుంది, ఐలవ్యూ చెబుతుంది. ఈ మాట చెప్పాక నేను మళ్ళీ కొత్తగా పుట్టాను అని అనిపిస్తుంది అని చెబుతోంది. దాంతో రిషి వసుధార నువ్వు నువ్వేనా అని అంటాడు. అప్పుడు వసుధరా కాదు సార్ నేను నేను కాదు, నేనెప్పుడొ వసుధార నుండి రిషిధారని అయ్యాను అని అంటుంది.వసుధార రిషికి గిఫ్ట్ ని ఇస్తుంది, రిషి ఆ గిఫ్ట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార ఒకప్పుడు ఇది మీ హృదయం, ఇప్పుడు మన హృదయం సార్ అని అంటుంది. రెండు పేర్లు, రెండు మనసులు ఒక్కటయ్యాయి అని అంటుంది. అప్పుడు రిషి నాకిచ్చావు కదా కాపాడే బాధ్యత ఇకపై నాది అని అంటాడు. ఇంతలో వర్షం ఎక్కువగా పడుతుందని పక్కకి వెళతారు ఇద్దరు. ఒకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపు.
Guppedantha Manasu 26 August 2022 Episode : తన లక్ష్యాన్ని సాధించే వరకు తన ప్రేమను పక్కకు పెట్టామని వసుధార దగ్గర మాట తీసుకున్న రిషి
ఒకవైపు రిషి, వసుధారతో వసుధార మన మధ్య జ్ఞాపకాలు తప్ప దాపరికాలు ఉండకూడదని నా కోరిక అని అంటాడు. అప్పుడు ఉండవు సార్ నేను మాటిస్తున్నాను అని వసుధార అంటుంది. రిషి అప్పుడు ఈ గిఫ్ట్ ఆరోజు నేను నీకిచ్చిన రోజూ నిన్ను బెదిరించింది ఎవరు అని అడుగుతాడు.సాక్షి సార్ అని చెపుతుంది. వెంటనే రిషి నేను ఊహించాను అని,కానీ నువ్వు నేను మనమైనా ఈరోజు మాత్రం సాక్షి ఈ వర్షమే అని వర్షాన్ని చూపిస్తూ, ఒకసారి నువ్వు నాకు దూరమయ్యావు, ఒకసారి నాదానివే అని చెప్పింది, ఈ వర్షమే అంటూ ఇలా కొద్దిసేపు మాట్లాడతాడు రిషి. రిషి వసుధార చేతికి రింగ్ని పెడుతూ ఆగి, మన ప్రేమ గెలవాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి వసుధార అని, నీ లక్ష్యం నీకుంది కదా, యూనివర్శిటీ టాపర్ కావాలి, గోల్డ్ మెడల్ సాధించాలని,మన ప్రేమ నీ లక్ష్యాన్ని మారిస్తే, మన ప్రేమలో స్వార్థం ఉన్నట్టు అవుతుంది.

దాని కోసం మన ప్రేమని కొన్నిరోజులు పక్కకుపెట్టాలి అని, మాట్లాడుతూ ఉంటాడు రిషి వసుధారతొ. మీరు చెప్పినట్టే చేస్తాను సార్ కానీ, ఆ ఉంగరం ఎప్పుడైనా నాదే కదా అని వసుధార అనగానే, రిషి మాటిస్తాడు పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను,ఇది నీ స్థానం అని చెబుతాడు. నాకు మాటివ్వు వసుధార నీ చదువుని నిర్లక్ష్యం చేయనని, అప్పుడు వసుధార మీకోసం, మన ప్రేమ కోసం, నా ఆశయం కోసం మీ మాట వింటాను అని అంటోంది. మీరు చెప్పినట్టే పరీక్షలు పూర్తయ్యే దాకా ప్రేమ గురించి ఆలోచించను అని చెప్తుంది ప్రామిస్ చేస్తోంది.ఉరుము ఉరమడంతో ఇద్దరు హగ్ చేసుకుంటారు.రిషి ఈ క్షణం నుండి మన ప్రేమ మొదలవుతుంది అని మాట్లాడుతూ ఉంటాడు వసుధారతొ.రిషి వసుధార తర్వాత కారులో వెళుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.