Guppedantha Manasu 27 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 27-August-2022 ఎపిసోడ్ 540 ముందుగా మీ కోసం రిషి, వసుధార ఇద్దరూ కారులో వెళుతూ, వసుధార మనసులో అనుకున్నది ఏంటో రిషి చెబుతూ ఉంటాడు. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటుా, ఇంటిదగ్గర దించుతాడు రిషి, వసుధార ని, ఆల్ ద బెస్ట్ చెబుతాడు, రేపటినుంచి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వమని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. ఒకదగ్గర కారు ఆపి, చాల సంతోషపడతాడు రిషి, వసుధార ప్రపోజ్ చేసింది గుర్తు తెచ్చుకొని, జీవితంలో సహనంగా ఉండాలని, ఇప్పుడు నా జీవితం అందంగా మారిందని సంతోషపడుతూ ఉంటాడు. ఒకవైపు ఇంట్లో మహేంద్ర, గౌతమ్ రిషి గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారు.ఇంతలో రిషి వస్తాడు, గౌతమ్ వాళ్ళు మాట్లాడదాం అని చూసేలోపు, రేపు మాట్లాడదాం అని చెప్పి లోపలికి వెళుతుండగా, జగతిని చూసి ఆగుతాడు.
Guppedantha Manasu 27 August 2022 Episode : రిషి మీద కుట్ర పన్నుతున్న సాక్షి, దేవయాని.
వసుధార, జగతి వెనక ఉండి నన్ను జగతి మేడం పంపించారు అని అన్నట్టు ఊహించుకుంటూ, వసుధార కాలేజీకి వచ్చిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ, జగతికి థాంక్యూ మేడమ్ అని చెప్పి వెళ్లిపోతాడు. జగతికి ఏమీ అర్థం కాదు.తర్వాత రిషి, వసుధార ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, ఫోన్ చేద్దాము అని, చేయాకుoడ ఆగిపోతూ ఉంటారు ఇద్దరుా, రూల్స్ని బ్రేక్ చేయకుాడదు అని.తరవాత సాక్షి, దేవయాని ఇద్దరూ రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవయాని సాక్షితో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక వసుధార ని కనిపించకుండా చెయ్యాలి అని, ఇద్దరు కుట్రపన్నుతూ ఉంటారు. ఇంతలో ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది.అప్పుడు దేవయాని నువ్వు మా మాటలు విన్నా వినకపోయినా, నీ మనసులో ఏమను కుంటున్నావో తెలుసు, అదే నిజం అవుతుంది అని అంటుంది ధరణితో.

మహేంద్ర, గౌతమ్ ఇద్దరు రిషి పడుకొనివుంటే రిషి పక్కనే కూర్చొని ఉంటూ ఉంటారు. ఇంతలో జగతి టీ తీసుకుని వస్తుంది.అక్కడికి దేవయాని వస్తుంది. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు అని అనగానే, ఏమీ లేదు కాఫీ ఇచ్చి ఉదయాన్నే, ప్రసన్నం చేసుకుందామని కూర్చున్నాం అని మహేంద్ర అంటాడు.గౌతమ్, మహేంద్ర అక్కడినుంచి వెళతారు.జగతి తొ, దేవయాని ఏంటి రిషీని పేరు పెట్టి పిలిచే సరికి తేగ సంబరపడుతున్నావా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి జగతి సమాధానం చెపుతుంది. ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత వసుధార లేచి, ఫోన్లు రిషి ఫోటో చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని అనుకుంటూ, ఒక పేపర్ పైన నీ ఆశయమే నీకు ముఖ్యం రిషి సార్ అని రాసి,ఆ పేపర్ని గోడకి అతికించి, మీరెంతైనా జెంటిల్మెన్ సార్ అని అనుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.