Guppedantha Manasu 28 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 541 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతికి రిషి థ్యాంక్స్ అని చెప్పడంతో తనకి ఏమీ అర్థం కాదు. ఎందుకు నాకు రిషి థ్యాంక్స్ అని చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే వస్తదా రా రిషి ఫోటోలు చూస్తూ సంతోషంతో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మీరు జెంటిల్మెన్ మీ ఆశయమే నాకు ముఖ్యం అని ఒక పేపర్ మీద రాసి గోడపై అతికిస్తుంది. కట్ చేస్తే రిషి వసుధార ప్రపోజ్ చేసిన విషయాలను గుర్తు చేసుకుంటూ తనలో తాను సిగ్గుపడుతూ పక్కన ఎవరున్నారు కూడా చూసుకోకుండా తను ఏదేదో చేస్తూ ఉంటాడు.
అప్పుడు అక్కడికి గౌతం మహేంద్ర ఇద్దరు వచ్చి అరే రిషి ఏమైందిరా అని గౌతమ్ అడుగుతాడు. అయ్యో ఏమి లేదురా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మహేంద్ర, గౌతమ్ అసలు ఋషికి ఏమైంది. ఏం చేస్తున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు అని మాట్లాడుకుంటారు. కట్ చేస్తే దేవయని, సాక్షి వసుధారని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనని కిడ్నాప్ చేయించాలి. అని ప్లాన్ వేస్తూ ఉంటారు. అదంతా ధరణి విని వెళ్లి జగతికి చెప్తుంది. అప్పుడు జగతి మహీంద్రా కి చెప్పి వాళ్ళ ప్లాన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. జగతి మహేంద్ర కూర్చొని రిషి గురించి మాట్లాడుతూ ఉంటారు. మహేంద్ర రిషి నీకు దగ్గరవుతున్నాడు. ఇక తర్వాత నిన్ను అమ్మ అని పిలవడం ఒకటే మిగిలి ఉన్నది అని చెప్తాడు.
Guppedantha Manasu 28 August 2022 Episode : వసుధార గురించి ఆలోచిస్తున్న రిషి…

అప్పుడు జగతి అవును మహేంద్ర ఆ రోజులు కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఆరోజు ఎప్పుడు వస్తుందో అని అంటుంది. తొందర్లోనే రాబోతుంది జగతి అని మహేంద్ర అంటారు. కాలేజీలో రిషి క్లాస్ చెప్తుండగా.. వసుధార తన గురించి ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి తననే చూస్తూ ఉంటాడు. అప్పుడు స్టూడెంట్స్ సార్.. ఈరోజు మాకు క్లాస్ చెప్పరా అని అడుగుతారు. అప్పుడు రిషి కంగారుపడుతూ ఆ చెప్తున్నా అనేసి చెప్తాడు. తర్వాత రిషి వసుధార కలసి మనం ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇవన్నీ పక్కన పెట్టాలి అని మాట్లాడుకుంటూ.. డివిఎస్ కాలేజీ పరువు నిలబెట్టాలి. చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.