Guppedantha Manasu 31 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 31-August-2022 ఎపిసోడ్ 543 ముందుగా మీ కోసం.రిషి కాలేజ్లో స్టాఫ్ అందరికీ ఎగ్జామ్స్ బాగా జరిగేలా చూసుకోవాలి అని చెపుతూ వుంటాడు. జగతి మహేంద్ర కి, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో స్టూడెంట్ దగ్గరికి వెళుతూ ఉండమని చెప్పి, డీబీఎస్ కాలేష్ పరువు నిలబెట్టాలని, ఎటువంటి ఛీటింగ్ జరగకుండా చూసుకోవాలని, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి, వెళతాడు. రిషి ని చూసి వసుధార థ్యాంక్యూ సార్ అని చెబుతుంది.తర్వాత ఎగ్జామ్హాల్లో రిషి ఇచ్చిన పెన్నుని చూస్తూ, మీరు నేను గెలవడం కోసం ఎంత తపన పడుతున్నారో నాకర్థమవుతుంది సార్ అని అనుకుంటూ ఉండగా, రిషి అక్కడికి వస్తాడు. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్ అని వసుధార మనసులో అనుకుంటుంది. తరవాత రిషి ఎగ్జామ్ పూర్తయ్యింది ఎలా రాసిందొ చెప్పలేదు వసుధార, ఫోన్ చేయాల వద్దా అని ఆలోచిస్తూ వుంటాడు.ఇంతలో గౌతమ్ వచ్చి రిషి ఇబ్బంది పడటానికి గమనించి, నేను ఫోన్ చేస్తాను అని వసుధార కి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్ చేసి ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగుతూ ఉంటాడు.
అప్పుడు వసుధార కి అర్థమౌతుంది, స్పీకర్ ఆన్ చేసి రిషి గౌతమ్ చేత వసుధార ని అడ్డగిస్తూ ఉంటాడు అని, అప్పుడు వసుధార సార్ నేను ఒకరికి మాటిచ్చాను, నాకు గుర్తుంది నా లక్ష్యం కోసం నేను బాగా చదువుతాను, ఇలా డిస్టర్బ్ చేయకండి అని, అందరికీ బాయ్ అని ఇన్ డైరెక్టుగా రిషికి సమాధానం చెపుతుంది.రిషి తనలో తాను నవ్వుకుంటూ, గౌతమ్ ఇక నువ్వెళ్ళరా నాకు రేపు పనుంది. త్వరగా నిద్ర పోవాలి అని చెప్పి గౌతమిని పంపిస్తాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మళ్లీ, రిషి వసుధార ఉన్న రూమ్కి వచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళతాడు.అలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా, రిషి వసుధార ఒకరిని ఒకరు చూసుకోవడాన్ని మహేంద్ర చూసి, నవ్వుకుంటూ ఉంటాడు. ఎగ్జామ్ పూర్తయ్యాక పుష్ప, వసుధార ఇద్దరూ నడుచుకుంటూ వెళుతుండగా, రిషి వచ్చి పుష్పతో ఎగ్జామ్ ఎలా రాశావు అనగానే,బానే రాసాము సార్ అని అంటోంది. ఇంటికి వెళ్లాక, ఛాటింగ్ అని టైమ్ వేస్ట్ చేయకుండా, చదువుకోమని చెప్పి వెళతాడు. తరువాత మహేంద్ర జగతి తొ, వసుధార, రిషి గురించి మాట్లాడుతూ ఉండగా, ఇంతలో రిషి వస్తాడు.
Guppedantha Manasu 31 August 2022 Episode : వసుధార ఎగ్జామ్ ఎలా రాసిందో తెలుసుకునే ప్రయత్నంలో రిషి

స్టూడెంట్స్ కి ఇబ్బంది ఏమీ కాకూడదు అని అంటూ వుండగా, దేవయానిని పిలిచి పెద్దమ్మ కూర్చోండి అని, మాట్లాడుతూ ఉంటారు కొద్దిసేపు.పెద్దమ్మ ఎగ్జామ్స్ అయిపోయాక, మీకొక గుడ్ న్యూస్ చెబుతాను అని అనగానే, ఏంటో ఇప్పుడు చెప్పు రిషి అని అంటుంది. అప్పుడు వసుధార మంచి మార్కులు సాధించి మన కాలేజ్ కి మంచి పేరును తెచ్చిపెడుతుంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటాడు. తర్వాత వసుధార అందరూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అప్పుడు పుష్ప ఎగ్జామ్ ఒక్కటి పూర్తయితే మనం వెళ్లిపోతాం కదా, నీకు బాధగా లేదా అని వసుధార తొ అంటూ ఉంటుంది పుష్ప. ఇంతలో రిషి వస్తాడు అక్కడికి,వసుధార తో మాట్లాడకూడదని కండిషన్ పెట్టాను కానీ, ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు అని, మనసులో ఇద్దరు రిషి, వసుధార ఒకరి గురించి ఒకరు అనుకుంటూ ఉంటారు. రిషి ఎగ్జామ్స్ ఎలా రాశారు అని అనగానే, బానే రాశాం అని అందరూ చెబుతారు, వసుధార సైలెంటుగా ఉంటుంది. నేను అందరినీ అడిగాను అని అనగానే, వసుధార బానే రాసాము సార్ అని అంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.