Guppedantha Manasu 8 July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 8 July 2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం, రిషి దాచుకున్న గుర్తులను నాశనం చేసిన సాక్షి.

Guppedantha Manasu 8 July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 8 July 2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం(రిషి దాచుకున్న గుర్తులను నాశనం చేసిన సాక్షి ):

Advertisement

నీ మీద నీకు క్లారిటీ ఉంటే కడుపుమంట ఉండదు కదా అని జగతి వసుధరా తో అంటోంది. క్లారిటీ ఉంది కాబట్టే కడుపు మండుతుంది మేడం అని అంటోంది వసుధరా. అసలు ఇదంతా కాదుమేడం రిషి సార్ సినిమాకి ఎలా వెళ్తారు అది చెప్పండి ముందు అని అంటోంది వసుధార.వెనకాలే రిషి వచ్చి నిలబడతాడు. అది జగతి చూసి ఊరుకో అని సైగ చేస్తుంది. రిషి మేడం డాడ్ తో మాట్లాడాను మీకు క్యాబ్ బుక్ చేశాను మీరు దాంట్లో ఇంటికి వెళ్లండి మేడం అని జగతి తో చెప్పాడు రిషి.రిషి అక్కడినుండి వెళ్లిపోగానే మేడం మీ అబ్బాయి అని వసుధార ఏదో చెప్పబోతుంటే,అవును మా అబ్బాయి మా అబ్బాయి ఏంటి అని జగతి కోపంగా అంటోంది.

Advertisement

కానీ ప్రాబ్లం తనకి కాదు నీకు నువ్వే తెలుసా వసు అని కోపంగా జగతి అంటోంది.వసుధార ప్రేమ ఎప్పుడు వెల్లడి కావాలి, మబ్బుల చాటు చందమామ లాగ దోబూచులాడ కూడదు.సరే వసు మా అబ్బాయి క్యాబ్ బుక్ చేశాడు బయట నాకోసం ఎదురుచూస్తూ వుంటాడు నేను వెళ్ళిపోతాను అని వసుధారతో అంటోంది.వసు ఈ కాఫీ బిల్లు కూడా ఈసారి మా అబ్బాయి వచ్చినప్పుడు తీసుకో అని జగతి వసుధారతో చెప్పి వెళ్ళిపోతుంది.రెస్టారెంట్లో వసు మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ రిషి డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు.సేమ్ అలాగే వసుధార కూడా ఆటోలో వెళ్తూ రిషితో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.

Guppedantha Manasu 8 July Today Episode
Guppedantha Manasu 8 July Today Episode

అస్సలు రిషి సార్ ఏంటి సాక్షి రమ్మనగానే తనతో సినిమాకి ఎలా వెళ్లాలి అనుకున్నాడు. అని మళ్లీ మళ్లీ అదే ఆలోచిస్తూ ఉంటుంది వసుధార.తెల్లవారగానే సాక్షి దేవయానితో ఫోన్లో మాట్లాడుతుంది అసలు ఏంటి అంటి నేను లండన్ నుంచి వచ్చిందే రిషి కోసం కానీ తను నన్నసలు పట్టించుకోవడమే లేదు అని అంటోంది.సాక్షి నువ్వు విజయం సాధించడం లేదు అంటే అది కచ్చితంగా నీ తప్పే అని దేవయాని సాక్షితో అంటోంది. రిషి మనసులో స్థానం సంపాదించాలన్న,గుర్తింపు సాధించాలన్న నువ్విప్పుడు చేసే పనికంటే ఇంకా రెండు ఇంతలు ఎక్కువ కష్టపడాలి అని దేవయాని, సాక్షితో చెప్తుంది.

Guppedantha Manasu 8 July Today Episode : రిషి దాచుకున్న గుర్తులను నాశనం చేసిన సాక్షి

రిషి మనసు గెలుచుకోవాలంటే రిషి అలవాట్లు, అభిరుచులు అన్నీ నీకు ఇష్టంగా మార్చుకోవాలి అని దేవయాని సాక్షితో చెప్తోంది.ఈ విషయం నీకింతకుముందే చెప్పాను ఫాలో అవుతున్నావా అని దేవయాని సాక్షిని అడుగుతుంది.వచ్చీ రాగానే విజయం సాధించాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది అని దేవియాని అంటోంది.ఇలా కొద్దిసేపు సాక్షి,దేవయాని ఫోన్లో సంభాషణ జరుగుతుంది. ఇకపోతే జగతి, మహేంద్ర రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు జగతి నాకు ఒక విషయం అర్థం కావడం లేదు రిషి సాక్షి విషయంలో తప్పించుకోవాలని అనుకుంటున్నాడు అదైతే అర్థం అవుతుంది కానీ వసుధార కి మాత్రం ఎందుకు దగ్గర కావడం లేదు రిషి అసలు అర్థమే కావడం లేదు అని మహేంద్ర, జగతి తో అంటాడు.

మహేంద్ర ప్రతి దానికి కొంచెం టైం పడుతుంది మనం ఎదురుచూడాలి దేనికైనా ఒక సమయం వస్తుంది అని జగతి మహేంద్రతో చెప్తోంది.ఇది రిషి, వసుధార మనుషులకు వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం అని చెప్తోంది జగతి.మనం ఎంతవరకు అయితే ప్రయత్నం చేయగలమో అంతవరకే చేయగలం కానీ పరిధిని మించి చేయలేం కదా అని జగతి మహేంద్ర తో అంటుంది.అలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు.ఏదైనా సరే తొందరపడి చేయకుండా నిదానంగా ఆలోచించి చేయాలి అని జగతి మహేంద్రతో చెప్తుంది.ఇంతలో అటువైపుగా గౌతమ్ వస్తాడు మహేంద్ర గౌతమ్ని పిలుస్తారు.గౌతమ్ నాకొక హెల్ప్ చెయ్యాలి అని మహేంద్ర అంటాడు.

ఏంటి అంకుల్ అని అడగ్గానే మనం రిషి వసుధార విషయంలో ఏదైనా ఒకటి చెయ్యాలి నువ్వు దానికి సహాయం చెయ్యాలి అని గౌతమ్ ని మహేంద్ర అడుగుతారు.మీరు చెప్పాలే కానీ నేను ఏదైనా చేస్తాను అంకుల్ అని గౌతమ్ మహేంద్రతో అంటాడు.ఇకపోతే రిషి కాలేజ్ కి రాగానే అటెండర్ కాఫీ టెర్రస్పైకి తీసుకెళ్తూ వుంటాడు. ఈ కాఫీ ఎవ్వరికీ అని అటెండర్ని రిషి అడిగితే గౌతమ్ గారికి, వసుధార గారికి, పైన ఉన్నారు సార్ అని చెప్పి అటెండర్ చెప్పాడు.వీళ్లు అసలు పైన ఏం చేస్తున్నారు. అని రిషి కూడా టెర్రస్ పైకి వస్తాడు. ఇక చూస్తే వసుధార గౌతమ్ ఏదో వర్క్ చేస్తూ టెర్రస్పైన ఏదో గీతలు గీస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అని రిషి అడుగుతాడు.

కొలుస్తున్నాం సార్ అని వసుధార అంటుంది.కాలేజీలో క్లాసులు వదిలిపెట్టుకొని అసలేంటి ఈ ఎండలో పని అని రిషి అంటాడు. అక్కడి నుండి కోపంగా రిషి కిందికి వస్తాడు. రిషికి మహేంద్ర ఎదురుపడితే అసలు ఏం జరుగుతుంది పైనా అని అంటాడు. ఇదంతా బయటినుంచి కాలేజీ వాళ్లకు క్లాసులు కోచింగ్ లాంటివి చెప్పడానికి ,ఏర్పాటు జరుగుతుందని చెప్తాడు మహేంద్ర .మరి నాతో ఎందుకు చెప్పలేదు అని రిషి మహేంద్రతో అంటాడు.ఇలాంటి పనులు చేయడానికి వేరే వాళ్లని పిలిపిస్తే సరిపోతుంది మీ స్టూడెంట్నే అలా చేయడం సరికాదు అని జగతి తో కోపంగా అంటాడు రిషి. మహేంద్ర కూడా సేమ్ రిషిలాగా జగతితో ఆట పట్టించే విధంగా మాట్లాడతాడు.

ఏంటి మహేంద్ర నువ్వుకూడా రిషిలాగా నువ్వు నన్నేడిపిస్తూనావ అని జగతి అంటోంది.మన పుత్రరత్నం చెప్పిందే చెప్తున్నాను అని మహేంద్ర , జగతితో అంటాడు.అలా కొద్దిసేపు అక్కడే నిలబడి మహేంద్ర , జగతి మాట్లాడుకుంటారు.ఇంకా ఇక్కడే నిలబడతావేంటి మహేంద్ర , ముందు వెళ్లి గౌతమ్ని ,వసుధారతో కిందికి రమ్మని చెప్పు. లేదా మళ్లీ రిషి వచ్చి తిడతాడు అని చెప్తుంది జగతి. ఇకపోతే జగతి క్లాస్ కి టైమ్ అవుతుందని క్లాస్ కి వెళ్లి , క్లాస్ చెప్తూవుంటుంది. ఇద్దరు అబ్బాయిలు క్లాస్ సరిగా వినకుండా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే జగతి వాళ్లపై సీరియస్ అవుతోంది.అందరూ వినండి మరీ, మరీ చెప్తున్నాను ఒక్కరు డిస్ట్రబ్ చేస్తే క్లాస్ మొత్తం డిస్ట్రబ్ అవుతుంది.

అందుకే అందరూ శ్రద్ధగా క్లాస్ వినాలి అని జగతి అందరి స్టూడెంట్స్కి చెప్తుంది.అలా జగతి చెప్పిందో లేదో వెంటనే వసుధార రిషి సార్ ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తుంది. అలా తన మనసులో అనుకోగానే రిషి సార్ బయట్నించి అటువైపుగా వెళ్తూ కనిపిస్తాడు .అదేంటి సార్ గురించి అలా అనుకున్నానో లేదో వెంటనే అలా కనిపించరేంటి అని వసుధార మనసులో అనుకుంటుంది. ఇదంతా నా భ్రమ అయివుంటుంది అని అనుకుంటుంది.కానీ చూస్తే రిషి అక్కడే నిలబడి వసుధార వైపు చూస్తూ ఉంటాడు అలా ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు .ఇదంతా నిజంగా నిజమైన రిషి సార్ నిజంగా వచ్చారా ఒకవేళ ఇదంతా నిజంగా నిజమే అయి ఉంటే, రిషి సార్ మళ్లీ వస్తారు అని వసుధార పదేపదే ఆ విషయం గురించే ఆలోచిస్తూ, కళ్ళుమూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది.

అలా ఆలోచిస్తున్న వసుధారని జగతి చూస్తుంది.వసుధార అని పిలిచినా కూడా వినిపించుకోకుండా తనకుతాను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో జగతికి కోపం వచ్చి తన దగ్గరికి వచ్చి అసలు క్లాస్లులో ఎలా ఉండాలో కూడా నీకు తెలియదా అని చాలా కోపంగా, నువ్వు మంచి ర్యాంకు స్టూడెంట్వి నువ్వే ఇలా ఉంటే అందరూ నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు. ముందు నువ్వు క్లాస్ నుంచి బయటికి వెళ్లిపో అని వసుధారని బయటికి వెళ్లిపోమని జగతి చెప్తుంది.నువ్వు ఇలా చేస్తావని నేనస్సలు అనుకోలేదు వసుధార, నీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నువ్వు ముందు బయటికి వెళ్లిపో అని జగతి చెప్తుంది.

దాంతో వసుధార సైలెంట్గా బ్యాగ్ తీసుకుని క్లాస్ నుంచి బయటకి వెళ్లిపోతుంది.ఇదంతా అక్కడే ఉన్న రిషి కూడా వింటాడు. క్లాస్ నుంచి బయటికి వచ్చిన వసుధార మళ్ళీ వెనక్కి తిరిగి రిషి సార్ వంక చూసింది. అలా ఒకరిని, ఒకరు దీనంగా చూసుకుంటూ ఉంటారు.ఇకపోతే తర్వాత రిషి తన స్టాఫ్ రూమ్ లోకి వెళ్లగానే అక్కడ సాక్షి హార్ట్ సింబల్ ఉన్న గిఫ్ట్ని ని అలాగే వసుధార ఇచ్చిన యల్లో రోజు ఫ్లవర్ చేతిలో పట్టుకుని చూస్తోంది సాక్షి.అది రిషికి, నచ్చదు.సాక్షి అసలు అక్కడ ఏం చేస్తున్నావ్ అని కోపంగా అంటాడు. సాక్షి చేతిలో ఉన్న వాటిని లాక్కోబోతే అవి రెండూ కిందపడి విరిగిపోతాయి.దాంతో రిషికి చాలా కోపం వస్తుంది.

అసలు నీకు బుద్దుందా అని సాక్షిని కోప్పడతాడు రిషి. నా క్యాబిన్లో అసలు నీకు పని ఏంటి అని సాక్షి మీద కోపంగా విరుచుకుపడతాడు. రిషిని క్షమించమని సాక్షి అడుగుతుంది అసలు నీకు ఏం హక్కుందని నా క్యాబిన్లోకి వచ్చావు. అని రిషి సాక్షిపై కోప్పడతాడు ఆ ఫ్లవర్ వాడిపోయిందని తీయబోయాను అని సాక్షి చెప్తోంది. నువ్వసలే మాట్లాడకు ఇది నా క్యాబిన్. నాకిష్టం వచ్చిన వస్తువులని నేను పెట్టుకుంటాను. నీకేం అవసరం అసలు నీకెన్నిసార్లు చెప్పాను, ఫోన్ చెయ్యకుండా కాలేజ్కి రాకూడదని. ఎన్నిసార్లు చెప్పిన వినవు నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పిన వినవు, మినిమం మ్యానర్స్ లేదా అని కోప్పడతాడు రిషి .

ముందు బయటికి వెళ్లిపో అని సాక్షిని అంటారు సాక్షి ఏడుస్తున్నట్టు బయటికి వెళ్తుండగా దేవియాని చెప్పిన మాటలు రిషికి గుర్తుకువచ్చి సాక్షిని మళ్లీ వెనక్కి పిలుస్తాడు.ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడాను వదిలేసి ఏం తాగుతావు కాఫీన,టిన అని సాక్షి ని అడగ్గానే.నీ టైమ్ కావాలి రిషి అని సాక్షి చెప్తోంది.రెండు నిమిషాలు నువ్వు నాతో మాట్లాడితే చాలు రిషి అని సాక్షి చెపుతుంది.అలాగే గేరు మారిస్తే , రూటు మారిస్తే, సూసైడ్ చేసుకొని ఇలా ఎంత చెయ్యడంవల్లనే నువ్వు నా రూట్లోకి వచ్చావు. అని ఇదంతా మనసులో సాక్షి అనుకుంటూ ఉంటుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement