Guppedantha Manasu 9 July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 9-7-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. కళ్లు తిరిగిపడిపోయిన వసుధార, తర్వాత ఏం జరుగుతుంది.

Guppedantha Manasu 9 July Today Episode : సాక్షి చేసిన పనికి ,కొప్పడ్డ రిషి తర్వాత సాక్షి సూసైడ్ చేసుకుంది గుర్తుతెచ్చుకొని తనమీద కోపం తగ్గించుకుని నిదానంగా మాట్లాడతాడు రిషి.సాక్షి ఏమో రిషి నేను సూసైడ్ చేసుకుంటే తప్ప నా దారిలోకి రాలేదు. నీతో ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పించటానికి ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటోంది సాక్షి.నన్ను క్షమించు రిషి కాలేజీకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను. అని సాక్షి రిషి తో అంటుంది. పర్లేదు సాక్షి కాలేజ్కి నువ్వెప్పుడైనా రావొచ్చు కానీ మనిద్దరం ఒక క్లారిటీ గా ఉంటే చాలు ఫ్రెండ్స్లాగా వుండాలి అని చెప్పాడు రిషి. సరే రిషి చెప్పినట్టే చేద్దాం కానీ నువ్వు నాకు ఒక బాకీ ఉన్నావ్. సినిమాకి తీసుకెళ్తాను అన్నావ్ పోలేదు కదా నన్ను సిన్మాకెప్పుడు తిస్కెళ్తావ్ అని సాక్షి రిషిని అడుగుతుంది.

Advertisement

ఇంకెప్పుడైనా చూద్దాం ఇప్పుడు పని ఉంది అని రిషి చెప్తాడు. దాంతో సరే రిషి ఇప్పుడు పనులో వున్నట్టున్నావ్ నేను వెళ్తాను బాయ్ అని చెప్పి సాక్షి వెళ్లిపోతూ ఉంటుంది. సాక్షి వెళ్ళిపోగానే విరిగిపోయిన హార్ట్ సింబల్ ని చూసి రిషి బాధపడతాడు.ఇకపోతే తర్వాత గౌతమ్,మహీంద్రా ఇదేంటి గౌతమ్ మనం చేసిన ప్లాన్ సక్సెస్ కాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు.కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు కదా మళ్లీ ప్రయత్నం చేద్దాం అని గౌతమ్ మహేంద్రతో చెప్తాడు.ఇంతలో అటువైపుగా వెళుతున్న వసుధర కళ్లుతిరిగి పడబోతుంటే, గౌతమ్ మహేంద్ర వెళ్లి పట్టుకొని తీసుకొచ్చి ఒకదగ్గర కూర్చోబెడతారు.ఏమైందమ్మా అని మహీంద్రా అడిగితే, ఏం లేదు సార్ కొంచెం నీరసంగా వుంది అందుకే ఇలా కళ్లు తిరిగాయి అని అంటోంది వసుదార.అంకుల్ హాస్పిటల్కి తీసుకెళ్లాం అని గౌతమ్ అంటాడు.

Advertisement

Guppedantha Manasu 9 July Today Episode : కళ్లు తిరిగిపడిపోయిన వసుధార, తర్వాత ఏం జరుగుతుంది.

Guppedantha Manasu 9 July Today Episode
Guppedantha Manasu 9 July Today Episode

కానీ ఏం వద్దు సార్ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని వసుదార అంటోంది. దాంతో కారు కీస్ ఇవ్వండి అంకుల్ నేను వెళ్ళి రూమ్ లో డ్రాప్ చేసి వస్తాను అని గౌతమ్ అంటాడు. నేను ఈరోజు కార్ తీసుకురాలేదు గౌతమ్ అని మహేంద్ర చెప్పాడు. దాంతో సరే అంకుల్ నేను రిషి దగ్గరికి వెళ్ళి కారు కీస్ తీసుకొస్తాను. అని రిషి దగ్గరికి వెళ్తాడు గౌతమ్.జగపతి మేడం క్లాస్ సరిగా వినడం లేదని చేసిన పనిష్మెంట్ గురించి వసుదార ఆలోచిస్తూ, జగతి మేడమ్ కి సారీ చెప్పాలి.అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుదార.వసుదారని క్లాస్ నుంచి బయటకు పంపించిన విషయం గురించే రిషి కూడా తన స్టాఫ్ రూంలో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు.

వసుధర కి అసలు ఏమైంది క్లాస్ కూడా సరిగా వినడం లేదు. తను ఎందుకు అలా మూడీగా ఉంది అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు.అలా తనకు తానే కొద్దిసేపు అన్నీ గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ వుంటాడు రిషి.ఇంతలో గౌతమ్ వచ్చి అరే రిషి వసుదార గ్రౌండ్లో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తాడు.ఇప్పుడు తనకి ఎలా వుంది అని రిషి అడుగుతాడు పర్లేదురా తను కళ్లు తిరిగి పడిపోవడం నేను,డాడీ చూశాము. తనకిప్పుడు బాగానే ఉంది అని అంటాడు గౌతమ్. రిషి హాస్పటల్కి తీసుకువెళ్దాంఅని అంటే, పర్లేదు తనకు ఇప్పుడు బాగానే వుంది. నేను వెళ్ళి రూమ్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని గౌతమ్ అంటాడు.వసుదారకి అలా వుంది అని అంటే నయున రిషి వచ్చి తనని ట్రాప్ చేస్తాడని అనుకుంటాడు గౌతమ్. కానీ రిషి ఏం మాట్లాడకపోయేసరికి వెంటనే తన ప్లాన్ చేసి గౌతమ్ కిందపడినట్టు నాటకం ఆడతాడు.

రిషి వెంటనే గౌతమ్ దగ్గరికి వచ్చి పరామర్శిస్తాడు. నా సంగతి తర్వాత అక్కడ వసుదారని ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యాలి.ఇప్పుడు ఆ సంగతి ఎలా అని గౌతమ్ రిషిని అడుగుతాడు.డ్రైవర్ ని ఇచ్చి పంపిస్తాను అని రిషి అంటాడు. డ్రైవర్తో పంపిస్తే వసుధార మనోభావాలు దెబ్బతింటాయి, అని గౌతమ్ అంటాడు. అయితే సరే నేనే వెళ్లి ట్రాప్ చేసి వస్తాను అని రిషి గౌతమ్ తో చెప్తాడు.ఇకపోతే అటెండర్ వచ్చి ఏమైంది సార్ అని గౌతమ్ ని అడుగుతారు. ఏం లేదు బాబూ కిందపడిపోయాను కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇవ్వు అని అంటాడు. మంచినీళ్లు తాగగానే ఏం చేశావయ్యా నాకు కాలినొప్పి వెంటనే పోయింది అని గౌతమ్ అటెండర్తో అంటాడు నీ చేతిలో ఏదో మాయ ఉంది అని అంటూ నవ్వుతూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.ఇకపోతే గౌతమ్ ప్లాన్ మహేంద్రకి ఆల్రెడీ తెలుసుకాబట్టి.

కార్ సౌండ్ చెయ్యగానే మహేంద్ర వసుదారని తీసుకొచ్చి కార్లో కూర్చోబెడతాడు.ఇంతలో రిషి వస్తుండటం చూసిన మహీంద్రా నువ్వేంటి రిషి, గౌతమ్ ఎక్కడ అని అడగగానే, వాడికి కాళ్లు దెబ్బ తగిలింది,అందుకే నేను వచ్చాను.ఇప్పుడు వసుధరకి ఎలా ఉంది అని అడుగుతాడు రిషి.చాలా నీరసంగా వుంది కళ్ళు తిరిగి పడబోతుంటే చూశాను, అని దీనంగా మాట్లాడతాడు మహేంద్ర.రిషి మహేంద్రని డాడీ మీరు వెళ్లి డ్రాప్ చేసి రండి అని అంటాడు.మహేంద్ర ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి డాడీ మీకేమైనా పని ఉందా అని అంటాడు రిషి.మీరే వెళ్లి ట్రాప్ చేసి రండి, డాడీ అని రిషి మహేంద్రతో చెప్తాడు. జాగ్రత్తగా తీసుకు వెళ్ళండి అని చెప్తాడు.ఏం చేయాలో తెలియక మహేంద్ర సైలెంటుగా వెళుతూ ఉంటే మళ్లీ, రిషి మహేంద్రని పిలుస్తాడు.మీరు వద్దులెండి డాడీ నేనే వెళతాను

అని రిషి అంటాడు.ఏమైంది రిషి, నన్ను వెళ్ళమన్నావు కదా. నేను వెళతాను అని మహీంద్రా అంటాడు. కారణం చెప్తేగానీ నన్ను వెళ్లనివ్వర డాడీ అని రిషి మహేంద్రతో అంటాడు.నేనే వెళతాను డాడీ అని రిషి చెప్తాడు.వసుధార జాగ్రత్త అని మహేంద్ర చెప్పాడు. గౌతమ్ జాగ్రత్త డాడీ అని రిషి చెప్పాడు.కారులో ఎక్కిన రిషి వసుధారని చూస్తూ ఉంటాడు. వసుదార అప్పటికే నిద్ర పోతూ ఉంటుంది. తనకి సీటు బెల్టు పెట్టి కారు స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు రిషి.అవసరం లేని పనులు తనకి సంబంధం లేని పనులు అన్నీ చేస్తూ అలసిపోయింది.అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని మనసులో అనుకుంటాడు రిషి.ఇకపోతే సగంసగం మెలుకువ వచ్చిన వసుదార, గౌతమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అనుకొని గౌతమ్ సార్ , రిషి సర్ కార్ తీసుకొస్తే, రిషి సార్కి, ఇబ్బంది అవుతుందేమో అని అంటోంది వసుదార.ఇదేంటి తను ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నా గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటాడు రిషి.

నా గురించి ఇంత ఆలోచించే వసుదార నాకు ఎలా నో చెప్పింది.అని అనుకుంటాడు రిషి.ఇంతలో ఏదో అడ్డుగా వస్తే రిషి కార్ హారను కొడతాడు.అది విన్న వసుధార ఏంటి గౌతమ్ సార్ మీరు కూడా రిషి సార్ లాగానే మాటిమాటికీ ఆరన్ కొడుతున్నారు అని అంటోంది వసుదార.వెంటనే ఉలిక్కిపడినట్టు వసుధార లేస్తుంది. రిషి ని చూసి ఆశ్చర్యపోతుంది. సార్ ఏంటి మీరిక్కడ అని అంటోంది వసుధార. ఏంటి అలా అడుగుతున్నావు నేనే కదా డ్రైవింగ్ చేస్తుంది అని అంటాడు రిషి.గౌతమ్ సార్ డ్రైవింగ్ చేస్తున్నారు అని అనుకున్నాను సార్ అంటోంది వసుదార.గౌతమ్ కాలికి దెబ్బ తగిలింది, అందుకే నేను వచ్చాను అని అంటాడు రిషి. ఏం నేను డ్రైవింగ్ చేస్తే కూర్చోవా అని అంటాడు రిషి. అయ్యో అలాంటిది ఏం లేదు అని అంటోంది వసుదార.మరి ఎందుకు అలా నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు ఆశ్చర్యపోతున్నావు అని అంటాడు రిషి.

అయితే ఇప్పుడు ఏంటి నేను వచ్చానని కారుదిగి వెళ్ళిపోతావా అని అంటాడు రిషి. అయ్యో అలా ఏం లేదు సార్ నేను అలా అనలేదు కదా అని వసుదార రిషి తో అంటోంది.అలా కొద్ది సేపు ఇద్దరూ సైలెంటుగా ఉంటారు. ఒకరికొకరు ఏంటి వసుధార ఏం మాట్లాడట్లేదు అని రషి అనుకుంటాడు. ఏంటిది రిషి సార్ ఏం మాట్లాడతలేడు అని వసుదార అనుకుంటుంది.అలా ఒకరి ఒకరు అనుకోగానే ఒకే సమయానికి ఇద్దరూ మాట్లాడతారు. నువ్వు చెప్పు’ అంటే నువ్వు చెప్పు, అని అనుకుంటూ ఉంటారు.లేని పనులు అన్నీ తలమీదికి తెచ్చుకుంటావు ఇలాంటివన్నీ నీకు అవసరమా అని రిషి వసుధరతో అంటాడు.

ఏదో అలా అయిపోయింది సార్ అని వసుదార అంటోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే వసుదార ఈరోజు ఎందుకు సీరియస్గా ఉంది. ఒకవేళ తన ఆరోగ్యం బాగోలేక అలా వుందో ఏమో అని అనుకుంటాడు రిషి.ఏమిటో ఈ వసుదార నాకు ఏదైనా జరిగితే, తను అస్సలు ఊరుకోదు. నాకేదైనా అయితే తాను ప్రాణాలతో ఉండను అంటోంది,కానీ నాకు నో చెప్పింది. అని ఆలోచిస్తాడు రిషి.నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వసుదార, అని రిషి మనసులో అనుకుంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement