Chandra Mohan : చంద్రమోహన్ కూతురు కూడా హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా? తను ఏ సినిమాల్లో నటించిందో తెలుసా?

Chandra Mohan : నెపోటిజంపై ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో వివాదమే నడుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ కి ఎదిగిన వాళ్లు తమ వారసులనే ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారని.. అలా సినీ ఇండస్ట్రీని వాళ్లే ఏలుతున్నారని.. మిగితా వాళ్లకు అవకాశాలు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. కానీ.. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో గొప్ప హీరోలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఎదిగిన వాళ్లలో కొందరు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. చాలామంది బిజినెస్ లు చూసుకోవడమో.. చదువుకొని మంచి ఉద్యోగం చేసుకోవడమో చేస్తున్నారు. ఇది సీనియర్ నటుడు చంద్రమోహన్ కు కూడా వర్తిస్తుంది.

Advertisement
have you even seen chandramohan daughter acted in telugu movie
have you even seen chandramohan daughter acted in telugu movie

ఎందుకంటే..చంద్రమోహన్ సాదాసీదా నటుడేమీ కాదు. ఆయన ఒకప్పుడు హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయి కొన్ని వందల సినిమాల్లో నటించాడు. కమెడియన్ గా, విలన్ గానూ నటించాడు. ఆయన ఇప్పటి వరకు 900 కు పైగా సినిమాల్లో నటించాడు. అందులో 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు.

Advertisement

Chandra Mohan : తన పిల్లలను మాత్రం స్టార్లను చేయని చంద్రమోహన్

తనకు ఇండస్ట్రీలో అంత పలుకుబడి ఉన్నా.. ఎన్నో గొప్ప సినిమాల్లో నటించినా.. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు. కానీ.. ఇండస్ట్రీకి ఆయన వాళ్లను దూరంగా పెంచాడు. వాళ్లకు ఇండస్ట్రీ వద్దని.. తన ఇద్దరు పిల్లలను బాగా చదివించాడు. ఇద్దరూ గోల్డ్ మెడల్స్ అందుకొని మంచి ఉద్యోగాలు సాధించారు.

have you even seen chandramohan daughter acted in telugu movie
have you even seen chandramohan daughter acted in telugu movie

కానీ.. చంద్రమోహన్ తమ్ముడి కూతురు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉంది. తన పేరు సబిత. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది అనే సినిమాలో తను హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తనకు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ.. తను సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తను ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. అలా.. చంద్రమోహన్ తమ్ముడి కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కానీ.. తన కూతుళ్లు మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు.

have you even seen chandramohan daughter acted in telugu movie
have you even seen chandramohan daughter acted in telugu movie

Advertisement