Bigg boss 6 Telugu : బిగ్ బాస్ 6 సందడి షురూ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ 6 హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అనే దానిపైనే చర్చ. ఆ యాంకర్ కు బిగ్ బాస్ 6 లోకి చాన్స్ వచ్చిందట. ఈ యాంకర్ కు వచ్చిందట. ఈ హీరోకు చాన్స్ వచ్చిందట.. అంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ 6 సీజన్ గురించే చర్చ. అయితే.. ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసి వాళ్లను క్వారంటైన్ కు కూడా పంపించేశారట బిగ్ బాస్ యాజమాన్యం.

సెప్టెంబర్ 4న గ్రాండ్ గా లాంచ్ కానుంది బిగ్ బాస్ తెలుగు 6 సీజన్. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటున్నందుకు రూ.15 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడట. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
Bigg boss 6 Telugu : సీజన్ 6 లో అలరించబోయేది ఎవరో తెలుసా?
16 మంది కంటెస్టెంట్లలో మొదటి కంటెస్టెంట్ శ్రీహాన్. ఈయన సిరి బాయ్ ఫ్రెండ్. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ ఆది రెడ్డి. ఇతడు బిగ్ బాస్ షోలనే యూట్యూబ్ లో రివ్యూ చేస్తూ ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆది రెడ్డికి చాలామంది పాలోవర్స్ ఉన్నారు. అందుకే బిగ్ బాస్ 6 లోకి ఆది రెడ్డిని సెలెక్ట్ చేశారు.
ఆ తర్వాత లిస్టులో జబర్దస్త్ చలాకీ చంటీ ఉన్నాడు. ఆ తర్వాత పటాస్ ఫైమా(జబర్దస్త్), సింగర్ రేవంత్, నటి సుదీప, సీరియల్ నటి శ్రీసత్య, వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించిన నటి వసంతి కృష్ణన్, యువ హీరో అర్జున్ కళ్యాణ్, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్, యాంకర్ ఆరోహి రావ్, మోడల్ సుల్తానా, యాంకర్ దీపికా పిల్లి, ట్రాన్స్ జెండర్ తన్మయి(జబర్దస్త్ ఆర్టిస్ట్), యూట్యూబర్ గీతూరాయ్, జబర్దస్త్ అప్పారావు ఈసారి బిగ్ బాస్ 6 సీజన్ లో అలరించబోతున్నారు.