Hero Nithin : టీవీ సీరియల్స్ లో నటించనున్న హీరో నితిన్? కారణం అదేనా? సినిమాలు మానేస్తాడా?

Hero Nithin : ఈ మధ్య సినిమాల కన్నా.. సీరియల్స్ కే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఒకప్పుడు సీరియల్స్ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. ఇప్పుడు టీవీ సీరియల్స్ ను ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆడా, మగా అనే తేడా లేకుండా ఇంటిల్లి పాది సీరియల్స్ చూస్తున్నారు. తెలుగు అనే కాదు.. ఇతర భాషల్లోనూ సీరియల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. వాటికే టీఆర్పీ ఎక్కువ వస్తోంది.

Advertisement
hero nithin to act in tv serials
hero nithin to act in tv serials

అయితే.. సీరియల్స్ లో నటించే వాళ్లు సినిమాల్లో నటించరు. సినిమాల్లో నటించేవారు సీరియల్స్ లో నటించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే సీరియల్స్ లో నటించేవాళ్లు సినిమాల్లో నటిస్తారు. కానీ.. హీరోలు, హీరోయిన్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు సీరియల్స్ జోలికి పోరు. చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసే వాళ్లు అటు సీరియల్స్, ఇటు సినిమాలు రెండింటినీ మేనేజ్ చేస్తుంటారు.

Advertisement

Hero Nithin : త్వరలో సీరియల్స్ లో కనిపించనున్న నితిన్

అయితే.. తెలుగులో స్టార్ హీరో గా వెలుగొందుతున్న హీరో నితిన్ త్వరలో సీరియల్స్ లో నటించనున్నాడట. ఇది వినడానికే షాకింగ్ గా ఉంది కదా. మంచి ఫేమ్ ఉన్న హీరో.. సినిమాలు కూడా చేతినిండా ఉన్నాయి. ఈ సమయంలో సీరియల్స్ లో నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటారా?

ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఈ వార్తే తెగ చక్కర్లు కొడుతోంది. మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పటికే భారీగా ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ ను వెరైటీగా చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది.

అందులో భాగంగానే టీవీ సీరియల్స్ లో నితిన్, తన మూవీ యూనిట్ కనిపించనున్నారట. ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే.. ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ప్రస్తుతం తెలుగులో టాప్ లో ఉన్న పాపులర్ సీరియల్స్ లో అతిథి పాత్రలో నటించబోతున్నాడట.

ఆ సీరియల్స్ లో కనిపించి.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటాడట. మరి.. అవి ఏ సీరియల్స్ అనే విషయం మాత్రం తెలియదు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ అంజలి.. ఐటెమ్ సాంగ్ లో నటించింది.

Advertisement