Rakshit Shetty : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తెలుగులో ‘వచార్లీ 777 ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. అయితే రక్షిత్ శెట్టి – రష్మిక మందన లవ్ ఎఫైర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. రష్మిక కన్నడ నటి అని అందరికీ తెలుసు. అక్కడ ఆమె మొదటి సినిమా ‘ కిరాక్ పార్టీ ‘. 2016లో విడుదలైన ఈ కన్నడ సినిమాలో రక్షిత్ శెట్టి , రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సెట్స్ సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .తమ బంధం శాశ్వతం చేసుకోవాలని పెళ్లికి కూడా రెడీ అయ్యారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
మరి కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా రష్మిక మనసు మార్చుకుంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. కన్నడ పరిశ్రమలో ఆమెపై వ్యతిరేకత రావడంతో టాలీవుడ్ కి వచ్చేసింది. కాలం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక రక్షిత్ శెట్టి కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతేడాది విడుదలైన చార్లీ 777 తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘ సప్త సాగరాలు దాటి ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇది నవంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే రక్షిత్ శెట్టి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే రష్మిక కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించినట్లు రక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఓ అమ్మాయిని రక్షిత్ శెట్టి ఇష్టపడ్డారట.
అమ్మాయికి లవ్ లెటర్ కూడా రాశారట. అయితే అవి స్వయంగా తాను ఇవ్వకుండా బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వమనే వారట. రెండేళ్లకు కూడా అమ్మాయి నుంచి ఎటువంటి స్పందన రాలేదట. ఎందుకంటే రక్షిత్ శెట్టి రాసిన లవ్ లెటర్స్ అమ్మాయికి చేరలేదట. ఫ్రెండ్ మోసం చేసి ఆ లెటర్స్ ఇవ్వలేదట. తీరా చూస్తే అతడు అమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్లి కూడా చేసుకున్నాడట. క్లోజ్ ఫ్రెండ్ చీటింగ్ వలన నచ్చిన అమ్మాయిని మిస్ చేసుకున్నానని రక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇలా చూస్తే రక్షిత్ శెట్టి లవ్ ఎఫైర్ కలిసి రావడం లేదనిపిస్తుంది.