Ram Pothineni : రామ్ రెమ్యూనరేషన్ 20 కోట్లు అంట… సినిమా వసూళ్లు కూడా అంత రావడం లేదుగా… అంటున్న నెటిజన్లు

Ram Pothineni : సినీ పరిశ్రమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. టాలీవుడ్ లో చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా హీరోలు, దర్శకులు మాత్రం తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో విడుదలైన మహేష్ బాబు ‘ సర్కారు వారి పాట ‘ తప్ప మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ ఆచార్య ‘,నాగచైతన్య నటించిన ‘ థాంక్యూ ‘ ఇవన్నీ బాగా ప్లాప్ అయి డిజాస్టర్స్ గా రికార్డులకి ఎక్కాయి. ఓటీటీ ట్రెండ్, పెరిగిన టికెట్స్ ధరల వలన ప్రేక్షకులు థియేటర్స్ కి ఎక్కువగా వెళ్ళలేక పోతున్నారు. మామూలు టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా భారీగా నష్టాల పాలవుతున్నాయి.

Advertisement

అయితే ఈ క్రమంలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో టికెట్స్ ధరలను సవరిస్తూ కొత్త ప్రతిపాదనలు చేశారు. అలాగే ఆరు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలు నాలుగు వారాలు, ఆపై బడ్జెట్ తో చిత్రాలు పది వారాలు తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధన తీసుకొచ్చారు.సినీ పరిశ్రమలో హీరోలు దర్శకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఫేక్ కలెక్షన్స్ చూపెడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాతలు, బయ్యర్లు మాత్రం బాగా నష్టపోతున్నారు అని చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితులు ఇంతలా దిగజారిన కూడా ప్లాఫ్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించడం లేదు. సినిమా బడ్జెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.

Advertisement

Ram Pothineni : రామ్ రెమ్యూనరేషన్ 20 కోట్లు అంట…

Hero Ram charges 20 crores for boyapati' s movie
Hero Ram charges 20 crores for boyapati’ s movie

హీరో రామ్ పోతినేని కూడా 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు అంటే నిర్మాతలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీ ప్రకటించగా ఆయన రెమ్యూనరేషన్ 20 కోట్లు అంట. రామ్ గత రెండు చిత్రాలు ‘ రెడ్ ‘, ‘ ది వారియర్ ‘ 20 కోట్లు షేర్ రాబట్టడానికి చాలా కష్టపడ్డాయి. ఒక్క ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ సినిమా తప్ప రామ్ కెరీర్లో 25 కోట్ల షేర్ దాటిన సినిమా లేదు. కేవలం బోయపాటి శ్రీను కావడం వలన రామ్ కు అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారంట. మరో 20 కోట్లు బోయపాటి రెమ్యూనరేషన్ గా తెలుస్తుంది. 100 కోట్ల పాన్ ఇండియా మూవీలో 40 కోట్ల బడ్జెట్ ఇద్దరి రెమ్యూనరేషన్ గా చెల్లిస్తున్నారు. దిల్ రాజు సైతం ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో తెలియక అనేక కొత్త ప్రాజెక్టులను పక్కన పెట్టారు. కానీ కొందరు నిర్మాతలు ఇలా గుడ్డిగా ముందుకు వెళ్లి నష్టపోతున్నారు.

Advertisement