Srikanth – Ooha : ఊహతో హీరో శ్రీకాంత్ విడాకులు అంటూ న్యూస్ వైరల్.. ఆన్సర్ ఇచ్చిన శ్రీకాంత్..!

Srikanth – Ooha : సినిమా ఇండస్ట్రీ అంటేనే తెలుసు కదా. లేనిపోని పుకార్లు ఇక్కడ ఎక్కువ. కొంచెం కనిపిస్తే.. దాన్ని పెద్దది చేస్తారు.. టాం టాం చేస్తారు. రచ్చ రచ్చ చేస్తారు. అయితే.. సినీ సెలబ్రిటీల జీవితం అనేది తెరిచిన పుస్తకం అని అంటుంటారు. దానికి కారణం ఏంటో తెలుసు కదా. అందరూ సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే సెలబ్రిటీల మీదనే ఎక్కువగా రూమర్స్ పుడుతుంటాయి. అలా ఇప్పటి వరకు చాలామంది హీరో, హీరోయిన్లు, ఇతర నటులు, దర్శకులు, నిర్మాతల మీద వచ్చాయి. కొందరు వాటిని లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్ అవుతారు. ఇంకొందరు మీడియా ముందుకు వచ్చి అసలు ఆ రూమర్ నిజమా కదా.. డైరెక్ట్ గా చెప్పేస్తారు.

Advertisement
hero srikanth denies divorce rumour with his wife
hero srikanth denies divorce rumour with his wife

తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య, సమంత విడాకుల అంశం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకొంటున్నారని వస్తున్న వార్తలు ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement

Srikanth – Ooha : ఇలాంటి నిరాధారమైన, పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తారు

శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకొంటున్నారంటూ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు జోరుగా రావడంతో చివరకు హీరో శ్రీకాంత్ స్పందించాల్సి వచ్చింది. ఈ విషయం శ్రీకాంత్ ఫ్యామిలీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే శ్రీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరు పుట్టిస్తారు. పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తారు. ఇదివరకు కూడా ఒకసారి నేను చనిపోయినట్టుగా వార్తలు రాశారు. నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయకండి.. మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల విడాకులు తీసుకుంటున్నాం అంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఊహకు తన ఫ్రెండ్స్.. కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన ఫేక్ న్యూస్ ను ఫార్వార్డ్ చేశారట. దీంతో తను కంగారు పడుతూ వాటిని నాకు చూపించింది. ఇవన్నీ ఫేక్ న్యూస్.. నమ్మకు అని నేను సర్ది చెప్పాను. చిల్లర వెబ్ సైట్స్ వాళ్లు, యూట్యూబ్ చానెల్స్ వాళ్లు చేసిన పని వల్ల.. చివరకు సోషల్ మీడియా మొత్తం ఇటువంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. మా ఫ్యామిలీపై ఇలాంటి ఫేక్ న్యూసై స్ప్రెడ్ చేస్తున్న వాళ్లపై సైబర్ క్రైమ్ శాఖ వాళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని హీరో శ్రీకాంత్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Advertisement