Hero Venu : మరో కొత్త సినిమాతో పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మన ముందుకు రాబోతున్న తొట్టెంపూడి వేణు బయోగ్రఫీ

Hero Venu : తొట్టెంపూడి వేణు 1976 జూన్ 4 న జన్మించాడు, వేణు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు అయితే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి నటించాలి అనే కోరిక కలిగింది అంటా, అందువల్ల ఇంజినీరింగ్ పూర్తి అయిన వెంటనే చెన్నై వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు, వేణు ప్రయత్నాలు ఫలించి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేసిన భారతి రాజా సినిమాలో హీరోగా అవకాశం సంపాదించాడు కాని ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు.

Advertisement

ఆ తరువాత వేణు హైద్రాబాద్ కి వచ్చి స్నేహితుడైన వెంకట్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ సారధ్యంలోనే కె విజయభాస్కర్ దర్శకత్వంలో 1999 వచ్చిన స్వయంవరం అనే సినిమా లో వేణు తొలి సినిమా ఇందులో హీరోయిన్ లయ, లయ కి కూడా ఈ సినిమా మొదటి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించింది. దీనితో వేణు కి చాలా అవకాశాలు వచ్చాయి.

Advertisement

Hero Venu : మరో కొత్త సినిమాతో పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మన ముందుకు రాబోతున్న తొట్టెంపూడి వేణు

Hero venu come back with powerful role
Hero venu come back with powerful role

పెళ్లాం ఊరెళితే సినిమా వెణుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఖుషి ఖుషీగా, యమగోల మొదలైంది సినిమాతో తన కెరియర్ గ్రాఫ్ ని బాగా పెంచుకున్నాడు వేణు. కొత్తగా వస్తున్న హీరోల పోటీని తట్టుకోలేక ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోల్ కూడా వేయాల్సి వచ్చింది. ఇక అలాంటి సినిమాలు తీసుకుంటే దమ్ము ఎన్టీఆర్ కి బావగా కూడా నటించాడు వేణు.ఇక ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రావు రమేష్ లాంటి వాళ్లు అన్ని రకాల పాత్రలను పోషించడంలో ఆ క్యారెక్టర్ రోల్స్ కూడా వేణుకి తగ్గిపోయాయి.

ఆ తర్వాత రామాచారి మూవీతో హీరోగా మరొకసారి ప్రయత్నం చేశారు కాని ఆ సినిమా విఫలం అవడoతో సినిమాలకి గుడ్ బాయి చెప్పాడు, వేణు కి 2001 లో వివాహం జరిగింది. భార్య పేరు అనుపమ చౌదరి చెన్నైకి చెందిన అమ్మాయి, వీరికి ఇద్దరు పిల్లలు, ఎంబీఏ పూర్తిచేసిన అనుపమ, పెళ్ళి తరువాత వేణు తో కలిసి వ్యాపార రంగంలో బిజి అయిపోయింది. అనుపమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య ఘట్టాలను చిత్ర రూపంలో అందంగా ఒక ఆల్ బాము లాగా రూపొందించడం.ఇప్పుడు సెలబ్రిటీ కుటుంబాలలో ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.

భార్య తో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించిన వేణు కి పొలిటికల్ బిజినెస్ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు కస్టమర్ గా ఉన్నారు, అయితే మంచి పాత్రలు వస్తే సినిమాల్లోకి నటించడానికి సిద్ధంగా ఉన్నానని చేపుతాడు. అయితే ఇప్పుడు రవితేజ నటించబోతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీలో సిఐ మురళీ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మనముందుకు రాబోతున్నాడు అయితే ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో తన అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement