Heroin Anjali : ఇంతకాలమైనా అంజలి దానిని పెంచలేక పోతుంది… ఎందుకని…

Heroin Anjali : తెలుగు హీరోయిన్ అయినా అంజలి కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ ఇక్కడ పాపులారిటీని సంపాదించుకుంటుంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది. ‘ షాపింగ్ మాల్ ‘ సినిమాతో అంజలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ బ్యూటీ తరువాత టాలీవుడ్ లో మాత్రం నెమ్మదిగా ఒక్కో సినిమా చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలో వెంకటేష్ కి జోడిగా నటించింది. తనలోని మరో కొత్త టాలెంట్ ను బయటపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ జనాలకు గుర్తుండిపోయింది. అయితే తాజాగా అంజలీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అంజలి దాదాపు 17 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఖాళీగా ఏ రోజు లేదు. హీరోయిన్ గా, ఐటెం గర్ల్ గా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ మొత్తం అంజలి ఇన్నాళ్లు సంపాదించిన ఆస్తి విలువ పట్టుమని 10 కోట్లు కూడా లేవట. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అంజలి ఒక్కో సినిమాకి దాదాపు కోటి రూపాయలు తీసుకుంటుందంట. అంతకుముందు ఓ సినిమాకి 70 లక్షల 80 లక్షలు సినిమాలో తన పాత్ర అనుసారంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంట. ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు కోటి 70 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నా అంజలి ఇన్నాళ్ళ తన కెరీర్లో కేవలం దాచుకుంది 10 కోట్లేనా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Heroin Anjali : ఇంతకాలమైనా అంజలి దానిని పెంచలేక పోతుంది…

Heroin Anjali not increase in these matter
Heroin Anjali not increase in these matter

అంజలికి చెన్నైలో ఓ ఇల్లు ఉన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాదులో కొన్ని భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. వాటిలో 10 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలమైనా తన ఆస్తులను ఎందుకు పెంచుకోలేక పోతుంది, అంజలికి చెప్పుకోని సమస్యలు ఇంకా ఉన్నాయా, లేకపోతే అంజలి తన ఆస్తులను దాచిపెడుతుందా అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు అభిమానులు. అయితే గతంలో ఆమె తన ఆస్తుల విషయంలో తన కుటుంబ సభ్యులతో గొడవ పడిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యుల కారణంగా పోలీస్ కేసు లు కూడా ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం అంజలి అందరికీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

Advertisement