Poorna : హీరోయిన్ పూర్ణ తెలుగు పరిశ్రమ లోకి ‘ శ్రీ మహాలక్ష్మి ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత అల్లరి నరేష్ ‘ సీమటపాకాయ్ ‘ చిత్రం పూర్ణకి టాలీవుడ్లో ఓ మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలను చేసింది. ప్రస్తుతం పూర్ణ బుల్లితెరలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ మరోవైపు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతుంది. గత సంవత్సరంలో వచ్చిన బాలయ్య ‘ అఖండ ‘ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఏ సినిమాలో అయినా పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడు అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు గ్లామర్ ను చూపించింది.
చిన్న పాత్ర అయినా సరే తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. అవకాశం వచ్చినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెర పై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ డి 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. షోలో చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది పూర్ణ. అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే. అయితే రవిబాబు డైరెక్షన్లో హీరోయిన్ పూర్ణ మూడు సినిమాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డు బాబు చిత్రాల్లో రవిబాబు పూర్ణకు ఛాన్స్ ఇచ్చారు.
Poorna : ఆ డైరెక్టర్ తో పూర్ణ ప్రేమాయణం నడిపిందా..

రవిబాబు పూర్ణ కాంబినేషన్లో వరుస సినిమాలు రావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ టాలీవుడ్లో టాక్ మొదలైంది. దాంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు హీరోయిన్ల సంబంధం ఉండదని అన్నారు. షూటింగ్ తర్వాత వారికి ఫోన్ కూడా చేయను అని చెప్పారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పూర్ణ యాక్టింగ్ చూసి ఆమెకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు. అదే నిజమైతే నా సినిమాలు ఏ హీరోయిన్ కూడా చేయదు అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఈ మధ్యనే పూర్ణ ఎంగేజ్మెంట్ జరుపుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోంది. ప్రస్తుతం పూర్ణ దసరా సినిమాలో నటిస్తుంది.