Sadha : హీరోయిన్ సదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుంది. ఉదయ్ కిరణ్ జీవితం ఎంతటి విషాదకరంగా ముగిసిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రేమ కథ చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఉదయ్ కిరణ్ నే. వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటూ లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. కానీ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరోయిన్ సదా ఉదయ్ కిరణ్ తో కలిసి ఔనన్నా కాదన్న సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సదా మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ సూసైడ్ గురించి మాట్లాడింది.
అతడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. ఉదయ్ కిరణ్ లాంటి మంచి నటుడిని కోల్పోవడం దురదృష్టకరం. నేను, ఉదయ్ కిరణ్ కలిసి ‘ ఔనన్నా కాదన్న ‘ సినిమాలో నటించాం. మన లైఫ్ లో అన్ని ప్లాన్ ప్రకారం జరగవు. ఉదయ్ కిరణ్ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు, మన లైఫ్ ప్లాన్ చేసుకున్న విధంగా జరగకపోతే ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాలి. లైఫ్ అంతకంటే గొప్పది. చాలామంది నటులు డిప్రెషన్ లోకి వెళుతున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాను. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన జీవితంలో అన్ని విషయాలు అదే విధంగా జరుగుతాయని డిప్రెషన్ లోకి వెళ్లకూడదని సదా అన్నారు.
Sadha : ఉదయ్ కిరణ్ సూసైడ్ పై ఎమోషనల్ అయిన హీరోయిన్ సదా…

జీవితంలో సాధించాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి అని అన్నారు. విజయాలు పరాపజయాలు మన చేతుల్లో ఉండవు. నటుడిగా మన బెస్ట్ ఇవ్వాలి అంతే అని సదా అన్నారు. ‘ జయం ‘ సినిమాతో సదా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా లంగా వోణీలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ అపరిచితుడు ‘ సినిమాలో నటించింది. ఆ తర్వాత సదా కెరీర్ అనుకున్నంతగా ముందుకు రాలేకపోయింది. వరుస ప్లాపులు ఎదురవడంతో ఆమెకి ఆఫర్స్ కూడా తగ్గాయి. ఇప్పుడు కొన్ని బుల్లితెర కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.