Sreeleela : ఆ హీరోతో శ్రీలీల రొమాన్స్ ఏంటి… చూడలేం రా బాబు అంటున్న నెటిజన్లు…

Sreeleela : హీరో రవితేజ ఇటీవల వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నాడు. గతేడాది క్రాక్ సినిమాకు ముందు వరుస ప్లాపులు అందుకున్న రవితేజ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇందులో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు ధమాకా సినిమా రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకు నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ సినిమా పోస్టర్లు వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాలో రవితేజ కి జోడిగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె అందాలు చూడటానికి సినిమాకి వెళ్లే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా ఆమె పేరు వచ్చింది. ఇక ధమాకా నుంచి తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో కూడా రవితేజ శ్రీ లీలాకు రొమాంటిక్ సైగలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీ లీలా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్న, ఇది సినిమాకు ఆమె కెరీర్ కు మైనస్ అని కొందరు అంటున్నారు.

Advertisement

Sreeleela : చూడలేం రా బాబు అంటున్న నెటిజన్లు…

Heroin sreeleela act with Raviteja neigens negitive comments
Heroin sreeleela act with Raviteja neigens negitive comments

50 ఏళ్లు దాటేసిన రవితేజతో 20 ఏళ్ల బ్యూటీ రొమాన్స్ ఏంట్రా బాబు ఈ రొమాన్స్ ఎలా చూడాలా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అసలే రవితేజ ఫేస్ లో ఒకప్పటి జోష్ లేదు. పైగా తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో రవితేజ ఫేస్ పూర్తిగా ముడతలు వచ్చేసింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడలేకపోయాం. మరి రేపు సినిమాలో రెండున్నర గంటల పాటు రవితేజ శ్రీ లీల పక్కన చూస్తే ఆ జంట ఏమాత్రం బాగోదని అంటున్నారు. ఇక శ్రీ లీలా కూడా ఇలాంటి టైంలో స్టార్ హీరోలు, కుర్ర హీరోలను కాదనుకొని రవితేజ లాంటి ఏజ్డ్ హీరోలతో రొమాన్స్ చేస్తే ఆమె కెరియర్ మైనస్ అవుతుందని అంటున్నారు.

Advertisement