Zodiac Signs : ధనస్సు రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : జూలై మాసం 2022 ధనస్సు రాశి వారికి గ్రహ స్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నెలలో మేషరాశిలో రాహువు, కుజుడు, కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు శుక్రులు కలిసి ఉన్నారు. కలిసివుండి రెండవ తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటారు. 17వ తేదీ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తున్నాడు.

Advertisement

అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది. ఈ ధనస్సు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నదో తెలుసు కుందాం..అలాగే ఈ రాశి లో ఉన్న నక్షత్రాలు వారికి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ మాసంలో చక్కటి విద్య, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త భూములను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబం లో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయాలని అందుకుంటారు. ఈ రాశిలో పూర్వాషాడ, మూల నక్షత్రం, ఉత్తరాషాడ ఈ మూడు నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి.

Advertisement

Zodiac Signs : ధనస్సు రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు

horoscope July 2022 Zodiac Signs for Sagittarius
horoscope July 2022 Zodiac Signs for Sagittarius

అయితే ముందుగా మూల నక్షత్రం వారికి ఈ మాసంలో కొన్ని మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు కలిగేటట్లు కనిపిస్తున్నాయి. కానీ వ్యాపార విషయాలలో మంచి అనుకూలతను పొందుతారు. పూర్వాషాడ నక్షత్రం వారికి ఈ నెలలో వివాహ సంబంధించిన ప్రయత్నాలు పలిస్తాయి. 13వ తేదీ నుంచి తర్వాత నెల 13వ తేదీ వరకు ధన విషయంలో అనుకూలత కనిపిస్తుంది.  ఉత్తరాషాడ నక్షత్రం వారికి, వీరికి కూడా వివాహ సంబంధించిన విషయాలు మంచి అనుకూలత కనబడుతుంది. 17వ తేదీ తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలలో మంచి అనుకూలతను పొందే అవకాశం కనిపిస్తుంది. ధనుస్స్ రాశి వారు కి ఈ మాసంలో రావలసిన ధనం లభిస్తుంది.

సంతానం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఈ విషయంలో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రేమకి సంబంధించిన అలాగే పెళ్లికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తలు వహించాలి. కొన్ని నిర్ణయాలను ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. అయితే ఈ మాసంలో ఈ రాశి వారికి అన్నిట్లో మంచి విజయాలని పొందాలంటే. ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధన: విష్ణు సహస్రనామాలు చేయాలి. అలాగే నరసింహ స్వామిని ఆరాధించాలి. దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన అన్ని విధాల బాగుంటుంది. అలాగే కొన్ని విషయాలలో విజయాలను పొందుతారు.

Advertisement