Panneer Tomato Pulao : సింపుల్ గా రుచికరమైన పన్నీర్ టమాటో పులావ్ చేసుకోవడం ఎలా మీకోసం…..

Panneer Tomato Pulao : ముందుగా పన్నీర్ టమాట పులావ్ కి కావలసిన పదార్థాలు. నెయ్యి, నూనె, ఉప్పు, కారం,పసుపు,పన్నీరు,అల్లంవెల్లుల్లిపేస్ట్,టొమాటో,ప్యూరీపసుపు,పచ్చిబటానీ,క్యారెట్,సాజీరా,రెండు యాలకులు, రెండు లవంగాలు, రెండు దాల్చిన చెక్క ముక్కలు బిర్యానీ ఆకు, చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు,రెండుమూడుపచ్చిమిర్చిచీలికలు,జీలకర్రపొడి,కొత్తిమీర,క్యాప్సికమ్,క్యాబేజీ,ధనియాల పొడి,ఉడికించి పెట్టుకున్న అన్నం, గరం మసాలా.పన్నీర్ పులావ్ తయారీ విధానం.

Advertisement

ముందుగా స్టవ్పై ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకువద్దుఅనుకుంటేమొత్తంనూనెవేసుకోవచ్చు.నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో రెండు యాలకులు, మూడు లవంగాలు, దాల్చినచెక్క, కొద్దిగా షాజీర వేసుకోవాలి.అవి వేగేటప్పుడు కొద్దిగా బగార ఆకు వేసుకోవాలి.తరవాత దాంట్లో రెండు,మూడు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి.

Advertisement

Panneer Tomato Pulao : పన్నీర్ టమాటో పులావ్ చేసుకోవడం ఎలా మీకోసం…..

how to make tasty healthy paneer tomato pulao
how to make tasty healthy paneer tomato pulao

ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేవరకు వేయించుకోవాలి.తరవాత దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు కూడా కొద్దిగా వేగిన దాకా ఉంచుకోవాలి.దాంట్లోనే ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.అల్లంవెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.తరవాత దాంట్లోనే టొమాటో ప్యూరీ వేసుకోవాలి.టమోటా ప్యూరీ వేసుకున్న తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

అంతా మంచిగా కలుపుకొని,స్టవ్ మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. టమాటో ప్యూరీ బాగా వేగిన దాకా ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకూ స్టవ్ మంట అలాగే తక్కువ పెట్టుకొని ఉం చుకోవాలి .తరవాత దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, ఉడికించి పెట్టుకున్న బఠానీ, అలాగే క్యారెట్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా దాంట్లోనే వేసుకొని, మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.

తరువాత దాంట్లోనే పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మంట తక్కువ లోనే ఉంచుకొని రెండుమూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి.పన్నీర్ ముక్కలు పచ్చిగ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు.

పన్నీర్ ముక్కలు వేగిన తరవాత దాంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం లేదా రోజూ ఇంట్లో వండుకునే అన్నం వేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి.దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మొత్తం మంచిగా కలుపుకోవాలి .తర్వాత అన్నం కి మొత్తం సరిగా పట్టేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ పులావ్ తయారవుతుంది

Advertisement