Sridevi Drama Company : నటి పూర్ణ గురించి తెలుసు కదా. సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ఆ తర్వాత తనకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపును తెచ్చుకుంది పూర్ణ. ఆ తర్వాత తనకు అవకాశాలు తగ్గడంతో బుల్లితెర వైపు వెళ్లింది. అక్కడ షోలు చేస్తూ బిజీ అయిపోయింది.

కట్ చేస్తే తనకు పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే తనకు ఎంగేజ్ మెంట్ కూడా అయింది. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తనపై శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వచ్చిన పూర్ణ
తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు జడ్జిగా వచ్చింది పూర్ణ. ఇదే సమయంలో హైపర్ ఆది, రామ్ ప్రసాద్.. పూర్ణను ఉద్దేశిస్తూ.. ఏంటి నాలుగు ఎపిసోడ్ లకు గ్యాప్ ఇచ్చారు అంటూ హైపర్ ఆది ప్రశ్నిస్తాడు. దీంతో వెంటనే రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. మీరు లేనప్పుడే షో బాగుంది. ఆ గ్యాప్ ను కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అంటూ ఒక్కసారిగా నోరు జారాడు రామ్ ప్రసాద్.
దీంతో అక్కడే ఉన్న పూర్ణ… రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి అతడిని తన మోచేత్తో కడుపులో గుద్దుతుంది. తను కొంచెం ఫీల్ అయినట్టుగానే షోలో కనిపిస్తుంది. ఏది ఏమైనా.. అంత డైరెక్ట్ గా పూర్ణపై వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.