Hyper Aadhi : జబర్దస్త్ షోలో పంచులు వేయాలంటే ఆది తర్వాతనే ఎవరైనా. హైపర్ ఆది వేసిన పంచులు మరే ఏ కమెడియన్ వేయలేడు. తన పంచులతో కడుపుబ్బ నవ్వించే సత్తా కలవాడు హైపర్ ఆది. అవతల ఎవరు ఉన్నారన్నది కూడా ఆది పట్టించుకోడు. తనదైన స్టైల్ లో పంచులు వేసుకుంటూ వెళతాడు. అలాంటి ఆది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో పంచుల వర్షం కురిపిస్తున్నాడు. ఆటో రాంప్రసాద్ తో కలిసి ఆ షోలో దుమ్ము లేపుతున్నాడు.
Hyper Aadhi : రష్మీకి తెలివి లేదు, పూర్ణకి అసలేం లేదు…
తాజాగా ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఆది అందరిని ఒక ఆట ఆడేశాడు. అందరి దగ్గర అప్పు తీసుకున్నట్టు, ఆ అప్పు తిరిగి ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్ లో ఆది రాంప్రసాద్ దుమ్ము దులిపేశారు. అయితే వారందరికీ అప్పు చెల్లించకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లతో ఇప్పిస్తా అని అంటాడు. ఇది ఎలా సాధ్యం అంటూ వారి దగ్గర పని చేసే ఇమ్మానుయేల్ అడుగుతాడు. వాళ్ల దగ్గర కూడా అప్పు తీసుకొని, వీళ్లకు ఇస్తాం. వారితోనే ఎంటర్టైన్ చేస్తామని ఆది అంటాడు.

అప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళు తెలివైన వాళ్లు కదా, మనకు ఎందుకు అప్పు ఇస్తారంట అడుగుతాడు. దానికి బదులుగా ఆది వాళ్లు తెలివైన వాళ్ళా.. రష్మీకి తెలివేలేదు, ఇక పూర్ణకు అసలు ఏం లేదు అని కౌంటర్లు వేస్తాడు. పూర్ణ వచ్చాక రాంప్రసాద్ తగులుకుంటాడు. నాలుగు ఎపిసోడ్లకు గ్యాప్ ఇచ్చావని ఆది అడుగుతాడు. నువ్వు రానప్పుడే బాగుంది. అందరూ బాగుందని అన్నారు, రాకుండా ఉంటేనే బాగుండేది అన్నట్టుగా రాంప్రసాద్ అంటాడు. దీంతో పూర్ణ ఒక గుద్దు గుద్దేస్తుంది. అలా కొట్టడంతో రాంప్రసాద్ షాక్ అవుతాడు. అలా ఆది రాంప్రసాద్ ఇద్దరూ పూర్ణ, రష్మీల పరువు తీసేసారు.