Sudigali Sudheer : రష్మీ లేకపోతే నేనులేను….సుడిగాలి సుదీర్ ఎమోషనల్ కామెంట్స్…

Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుదీర్ రష్మిల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడి స్క్రీన్ పై కనిపిస్తే చాలు అభిమానులకు కనుల పండగే. బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రేమికులుగా దంపతులుగా వీరిద్దరూ కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరిని కపుల్స్ గా చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అంతలా వీరికి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అయితే గత కొంతకాలంగా ఈ జోడి బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. ఇక దీనికి గల కారణం ఏంటో అందరికీ తెలిసిందే. గాలోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.

Advertisement

if-there-is-no-rashmi-i-am-nothing-sudheer-sudhir-emotional-comments

Advertisement

దీంతో ప్రస్తుతం బుల్లితెరకు కాస్త దూరమయ్యాడు. అలాగే రష్మీ కూడా అప్పుడప్పుడు సినిమాలో కనిపిస్తూ వస్తుంది. దీంతో సుధీర్ రష్మీల జోడి బుల్లితెరపై ఎక్కువగా కనిపిండం లేదు. అయితే చాలాకాలం తర్వాత సుధీర్ రష్మీ ల జోడి బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న “నిజమే నే చెబుతున్న జానీ జానా” అనే పాటకు వీరిద్దరూ కలిసి డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. అనంతరం రష్మితో తనకున్న అనుబంధంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు సుధీర్. రష్మితో నాది బ్యూటిఫుల్ జర్నీ. ఆమె చాలా సెన్సిటివ్ , హార్డ్ వర్కింగ్ పర్సన్, రష్మీ నాకు అందరికంటే ఎక్కువ.

if-there-is-no-rashmi-i-am-nothing-sudheer-sudhir-emotional-comments

అయితే మేము బయటకు వెళ్లినా మా ఫ్యామిలీతో బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ మా జోడి గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నా బ్యూటిఫుల్ జర్నీలో నా సక్సెస్ లో రష్మీది చాలా పెద్ద పాత్ర ఉంది. కెరియర్ లో నేను పైకి రావడానికి జబర్దస్త్ లో నా కామెడీ స్కిట్స్ తో పాటు రష్మీ పాత్ర చాలా ఉంది. రష్మితో చేసిన ప్రతి ప్రోగ్రామ్స్ అన్ని చాలా సక్సెస్ అయ్యాయి. అందుకు రష్మికి రుణపడి ఉన్నానని చెప్పిన సుధీర్ ఆఖరి నిమిషంలో ఐ మిస్ యు అని చెప్పాడు. ఇంత ప్రస్తుతం సుధీర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రేమ పక్షులు ఇలా గాలిలోనే ఎగురుతాయా ,లేక ఓకే గూటికి చేరుకుంటాయా అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు.

Advertisement