Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమాజ్ తల ప్రేమ వివాహం గురించి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ రోజుల్లో చేసినటువంటి వంశీ సినిమా ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిన విషయం విధితమే. నమృతా శిరోద్కర్ అప్పటికే మిస్సిడ్గా కావడంతో బాలీవుడ్లో మంచి క్రేజ్ తో అనేక ఆఫర్ల ఆమె చేతిలో ఉన్నాయి. మహేష్ బాబు తో వివాహం అయిన తర్వాత శిరోద్కర్ ఈ ఆఫర్లన్నీ వదిలేయడం జరిగింది. అయితే మహేష్ బాబు ఈ సినిమాలను వదిలేయమని ఎటువంటి కండిషన్స్ ఆమెకి పెట్టలేదట. అయినప్పటికీ కుటుంబ బాధ్యతలు నేపథ్యంలో నమ్రత శిరోద్కర్ తన కెరీర్ ని వదిలేసిందని అంతే తప్పితే మహేష్ బాబు ప్రత్యేకంగా తనని సినిమాలు వదిలేయమని అవ్వకే నాడు అడ్డు చెప్పలేదట.
మహేష్ బాబుతో ప్రేమలో ఉన్న టైంలో తెలుగు మరియు బాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటువంటి టైములో కూడా మహేష్ బాబు తనను ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎటువంటి కండిషన్స్ కానీ షరతులు గానీ ఏమీ పెట్టలేదట. తన ప్రత్యర్థులతో సినిమాలు తీస్తున్నప్పటికీ ఇటువంటి సినిమాలు ఏమీ చేయొద్దని ఆంక్షలు కూడా పెట్టలేదని తెలుస్తోంది. దీన్ని చూస్తే తెలుస్తుంది మహేష్ బాబు, నమ్రత శిరోత్సర్ల ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అని. వీరిద్దరూ రెండు సంవత్సరాలు ప్రేమలో ఉండి ఎటువంటి బయట తిరుగుడు లేకుండా చాలా పద్ధతిగా పెళ్లి చేసుకోవడం జరిగింది.
Mahesh Babu : మహేష్ బాబు నమ్రతల జంట అందరికీ ఆదర్శప్రాయం

వీరిద్దరి ప్రేమ పెళ్లి ఎంతో మందికి ఆదర్శం అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది విడిపోయారు. ఏదో ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్న విడిపోయాం అన్న విధంగా లేకుండా పెళ్లి తర్వాత కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది ఈ జంట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పూర్తి బాధ్యతను నమ్రత శిరోద్కర్ తీసుకొని ఆదర్శ మహిళగా వ్యవహరిస్తుంది. నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుల జంట అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు.