Intinti Gruhalakshmi 11 July Today Episode : తెలుగు సూపర్ సింగర్ కాంపిటీషన్ లో ప్రేమ్ గెలుస్తాడా లేదా…

Intinti Gruhalakshmi 11 July Today Episode : సింగింగ్ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ లో ప్రేమ్ రక్షిత్ ఇద్దరి పర్ఫామెన్స్ ముగిసిన తర్వాత ఆడియెన్స్ పోల్ కండక్ట్ చేస్తారు.అందులో ఒక్క ఓటు తేడాతో ప్రేమ్ విన్నర్ గా నిలుస్తాడు.  తెలుగు సూపర్ సింగర్ మ్యూజిక్ కాంపిటీషన్ విన్నర్ ప్రేమ్ అని ఎనౌన్స్ చేస్తారు,అప్పుడు లాస్య నందు ఫోన్ తీసుకోబోతుoడగా అప్పుడు నందు చెక్ చేయాల్సిన అవసరం లేదని ప్రేమకే ఓటు వేశానని లాస్యతో చెప్పుతాడు,నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ప్రేమ్ కే ఓటు వేస్తావు అని లాస్య అనడంతో నందు, ప్రేమ్ నా కొడుకు వాడు పొరపాటు చెస్తే కోప్పడేవాడిని, నిజంగా వాడి పర్ఫామెన్స్ నాకు నచ్చింది అందుకే ఓటు వేశాను అని అంటాడు.

Advertisement

గెలిచిన ప్రేమ్ ని మాట్లాడామని అంటారు, అప్పుడు ప్రేమ్ నాకు ఓటు వేసిన అందరికీ థ్యాంక్స్ తర్వాత నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, తను చిన్నప్పుడే నాలోని గాయకుణ్ణి చూసింది, నన్ను ఎంకరేజ్ చేసింది, అదే నా గోల్ ని ఫిక్స్ చేసింది నేను గాయకుడిగా గొప్ప గుర్తింపు పొందాలని కలలు కనింది అందుకు ఓపిగ్గా ఎదురు చూసింది ఇన్నేళ్ళకి మా అమ్మ కళ నెరవేరేలా చేశాను అని తులసి వేపు చూస్తూ అమ్మా సంతోషమే అని అడుగుతాడు ఇప్పుడు గొప్పగా చెప్పుకో అమ్మా నీ కొడుకు గెలిచాడు అని అంటాడు.

Advertisement
Intinti Gruhalakshmi 11 July Today Episode
Intinti Gruhalakshmi 11 July Today Episode

మా నాన్న నన్ను నమ్మలేదు దారి తప్పాను అనే వదిలేశాడు మా అమ్మే నాకు అన్నీ అయి నిలిచింది ఈ గెలుపు మా అమ్మకు అంకితం అని అంటాడు మా అమ్మ తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి నా భార్య శ్రుతి నా కష్టాన్ని పంచుకుంది నా కన్నీళ్లను పంచుకుంది నా కోపాన్ని బరించింది. అమ్మ తర్వాత అమ్మలా అక్కువ చేర్చుకొని ఓదార్చింది నా జీవితంలోనే కాదు ఈ గెలుపులో కూడా సగభాగం నా భార్యది థాంక్యూ శ్రుతి అని నాకు సరైన సంపాదన లేకపోయినా తనే జాబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తుంది తనకి జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా నా కోసం శ్రమపడుతుంది అని అంటాడు.

Intinti Gruhalakshmi 11 July Today Episode : తెలుగు సూపర్ సింగర్ కాంపిటీషన్ లో ప్రేమ్ గెలుస్తాడా లేదా…

తర్వాత జిల్లా కలెక్టర్ ని స్టేజ్ మీదికి పిలుస్తారు ప్రేమ్ కి అవార్డు ఇవ్వడానికి, అప్పుడు ప్రేమ్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ట్రోఫీని నాకు కాకుండా మా అమ్మకి ప్రెసెంట్ట్ చెయ్యగలరా ప్లీజ్ అని అడుగుతారు, అప్పుడు సరెే అని తులసి కి అవార్డును ఇస్తారు, తరువాత తులసిని మాట్లాడమని అడుగుతారు అప్పుడు తులసి నన్ను తల్లిగా నేను ఓడిపోయాను అని ఒక పెద్దమనిషి నా మీద నింద వేశాడు ఇప్పుడు ఆ పెద్దమనిషి ఇక్కడే ఉన్నాడు కొడుకు పక్కన గర్వంగా తలెత్తుకుని నిలబడిన నన్ను చూస్తూ ఉన్నాడు.

తల్లిగా నేను ఓడిపోయాను అని ఇప్పటికీ మీకు అనిపిస్తే ఈ స్టేజ్ మీదికి వచ్చి అందరి ముందు ఆ మాట చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని ఈరోజు తల్లిగా నేను గెలిచాను నా కొడుకుని గెలిపించుకున్నా ను పిల్లల మనసును అర్థం చేసుకొని వారికి ఏది ఇష్టమో ఆ దారిలో నడిచే స్వేచ్ఛ ఇవ్వాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి అదే నేను అదే చేశాను నా బిడ్డ మొహంలో సంతోషం చూస్తున్నాను అని చెబుతుంది.తరువాత నందు ప్రేమ్ తొ నీ టాలెంట్ ఈరోజే చూశాను కంగ్రాట్స్ రా అని, తండ్రిగా నేను ఓడిపోయాను నిన్ను బాధపెట్టను సారీ రా అని చెబుతాడు.

తరువాత లక్కీ లాస్య పిజ్జా తింటూ ఉంటారు ఇంతలో నందు వచ్చి ఏంటి లాస్య ఇంటికి నన్ను వదిలేసి వచ్చావు అని అనడంతో అప్పుడు లాస్య నువ్వక్కడే సంబరాలు చేసుకుంటావు ఏమో అని నాకు ఆకలి అవుతుంది అని వచ్చాను ఇంతకు తిన్నావా లేదా అని అడగడంతో నేను తినలేదు అని అంటాడు అప్పుడు లాస్య నువ్వు రావేమో అనుకోని మా ఇద్దరికీ పిజ్జా ఆర్డర్ చేసుకున్న ఇదొక్క పీస్ మిగిలింది అంటూ తనకు ఇస్తోంది నందు దానిని తినబోతూ ఉంటే నువ్వు ఆ పీస్ నాకు యిస్తావేమో అనుకున్నాను అప్పుడు భార్యగా నేను సంతోషపడేదానిని కానీ అలా చేయలేదు అని వెటకారంగా మాట్లాడుతుంది’

దాంతో నందు పీస్ అక్కడే పెట్టి అర్థమైంది లాస్య ఆ ఒక్క ఓటు గురించి నీ కోపము అని కొద్ది సేపు మాట్లాడతారు ఇద్దరు.తరువాత తులసి బొమ్మని చూస్తూ తన పిల్లల గురించి తనలో తాను ఆలోచిస్తూ ఉండగా తులసి అత్తమామలు వచ్చి తులసిని చూస్తూ అమ్మా కోడళ్ళ చేత బోనం ఏతిద్దాం అని చెబుతారు. తరువాత తెల్లారి బోనాలు మొదలు అవుతాయి అక్కడికి అభి వస్తాడు అప్పుడు తులసి థ్యాంక్స్ రా రమ్మనగానే వచ్చినందుకు అని అనగానే నేను అమ్మవారి కోసం వచ్చాను అని కోపంగా అంటాడు అభి, తర్వాత అక్కడికి సాక్షి వసుధార ఇద్దరూ బోనాలు కోసం వస్తారు కాని ఇద్దరికీ బోనాలు ఎలా చేయాలో ఆ పద్ధతి గురించి ఏమీ తెలియదు ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. ఇదే మొదటిసారా అని అడిగి భోనం ఎలా చేయాలో అంతా వాళ్లకి చెబుతుంది ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement