Intinti Gruhalakshmi 12th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి భోనం ఎత్తకుండా లాస్య పన్నిన పన్నాగాలు ఫలిస్తాయా..

Intinti Gruhalakshmi 12th July Today Episode : తులసి వసుధార సాక్షిలకు భోన౦ ఎలా తయారుచేయాలో చెబుతుంది అప్పుడు వసుధార థ్యాంక్యూ తులసి ఆంటీ అని చెప్పడంతో తులసి నా పేరు మీకు ఎలా తెలుసు అని అంటుంది అప్పుడు వసుధార ఆగస్టు ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే అని నీకు ఎలా తెలుసు అని అడిగినట్టు ఉంది ఎంతో మంది ఆడవాళ్ళకి మీరు ఆదర్శం తులసి ఆంటీ అని అనడంతో సరే సరే మీరేదో మాట్లాడుతున్నారు, భోనం తయారు చేసుకోండి అని చెపుతుంది అప్పుడు వసుధార ఆంటీ ఏమైనా టిప్ చెప్పండి అని అడగడంతో తులసి ఉపవాసం ఉన్న నీరసంగా ఉన్న భోనాలు ఎత్తేటప్పుడు కళ్లు తిరుగుతాయి. అప్పుడు పక్కన ఉన్నవాళ్లతో ముఖం మీద పసుపు నీళ్లు చెల్లించుకోండి సమస్య ఉండదు అని చెబుతోంది.

Advertisement

భోనాల దగ్గరికి నందు లాస్య భాగ్య కూడా వస్తారు.నందు లాస్యతో ఒకసారి ఆలోచించుకో లాస్య భోనం ఎత్తడం అంత సులభం కాదు నీకు అలవాటు లేని పని చెయ్యకు అని చెప్పి వెళ్లిపోతాడు అప్పుడు లాస్య నేను తులసి మీద కసి తోనే చేస్తున్నాను అని అంటుంది అప్పుడు భాగ్య ఆ విషయం బావగారికి తెలియదు కదా అని అంటుంది.భాగ్య అత్తగారు ఏంటి తులసి అక్కతో భోన౦ ఎత్తిస్తున్నారు భోనమ్ నీతో కదా ఎత్తి౦చాలి అని అనగానే, లాస్య తులసి అయినా చెప్పొచ్చు కదా తను మాజీ కోడలు తను ఎత్తకూడదని అయినా నేను ఎత్తకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటారు.

Advertisement

Intinti Gruhalakshmi 12th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి భోనం ఎత్తకుండా లాస్య పన్నిన పన్నాగాలు ఫలిస్తాయా..

Intinti Gruhalakshmi 12th July Today Episode
Intinti Gruhalakshmi 12th July Today Episode

ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు.అప్పుడు అక్కడికి నందు వచ్చి ఏంటి ఇక్కడే దoడ౦ పెట్టు కుoటున్నావు ఇక్కడినుంచి ఇక్కడే వెళ్లిపోదామని డిసైడ్ అయ్యారా అని అనడంతో అప్పుడు లాస్య లేదు నేను భోనమెత్తుకొని నడుస్తూ వుంటే నువ్వు పోతురాజులాగ నా ముoదు ఉండి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలని అని డిసైడ్ అయ్యాను అని, లగేజ్ తీసుకుని రా వెళ్దాం అని నందుతో అంటుంది. తరువాత అభి, ప్రేమ్ ఇద్దరూ సంతోషంగా ఉండటం చూసి అందరూ సంతోషపడతారు.లాస్య, భాగ్య,నందు ముగ్గురూ కూడా తులసి కుటుంబం ఉన్న పక్కనే వచ్చి భోనం తయారు చేస్తూ ఉంటారు.

లాస్య భాగ్య తో మా అత్తగారు శ్రద్ధగా అమ్మవారికి మొక్కుకున్నారు కోడలు చేత భోనం సమర్పిస్తాను అని,అమ్మ వారు ఎంతో మహిమగలదో అత్తయ్యగారు సమక్షంలోనే భోనం సమర్పించే అవకాశాన్ని ఇచ్చింది అని అనడంతో అప్పుడు తులసి అత్త కోపంగా పట్టు చీర కట్టుకొని నిండుగా బొట్టుపెట్టుకొని జై మాతా జి అని అంటే చూసే జనం భక్తురాలు అని అనుకుంటారో ఏమో కానీ అమ్మ వారికి తెలుసు నిజంగా ఎవ్వరి మనసులో ఏముందో అని ఇలా కొద్దిసేపు వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరిని ఒకరు.అప్పుడు తులసి మామగారు మనం గుడికి వచ్చాం ఈ గొడవ ఆపండి ప్రశాంతంగా భోనం చేసుకుందాం అని అంటాడు.తరువాత తులసి ప్రేమ్ ని భోనం ఎత్తడానికి మట్టికుండలు తెచ్చాను అవి ఎక్కడ ఉన్నాయి అని అనడంతో ప్రేమ్ కారులోనే ఉన్నాయి అమ్మ తెస్తాను అని అంటాడు.

అప్పుడు దివ్య నువ్వుండు అన్నయ్యా నేను తెస్తాను అని అనడంతో తులసి , తులసి మామగారు ఇద్దరూ జాగ్రత్త అమ్మ వాటిని జాగ్రత్తగా తేవాలి మళ్లీ ఇక్కడ మనకి దొరకవు అని అంటారు. తర్వాత భాగ్య దివ్య వెనకాలే వెళుతుంది దివ్య డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెనకనుంచి భాగ్య తనను తోసేయడంతో కుoడలు పగిలిపోతాయి చుట్టుపక్కల వాళ్లు అందరూ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అందుకే భోనం పెట్టే కుoడలు పగిలాయి అంటూ ఉంటారు. అక్కడికి మాధవి రెండు కుండలను తీసుకొని వస్తుంది వదినా నువ్వు మొదటిసారి భోనo ఎత్తు కొంటున్నావని నీకు ఇద్దామని వచ్చాను కానీ ఇవి ఇలా ఉపయోగపడుతున్నాయి అని అంటుంది.

దాంతో తులసి నువ్వు అమ్మవారి లాగా వచ్చి కాపాడావు మాధవి అని అంటుంది.తర్వాత భాగ్య లాస్య ఇద్దరూ తమ ప్లాన్ ఫ్లాఫ్ అయ్యింది అని అనుకుంటూ ఉంటారు, లాస్య భాగ్యకు స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి ఎలాగైనా వీటిని తులసి వేసుకునేలాగే చేయాలి అని అంటుంది, ఇలా తులసి పైన మరో కుట్ర పన్నుతారు ఇద్దరు. లాస్య తను అనుకున్నట్టుగా తులసి కళ్లుతిరిగి కిందపడి భోనం కిందపడినట్టు కలగంటోంది.అప్పుడు అక్కడికి భాగ్య వచ్చి లాస్య పగటి కలలు కనకు అని అంటుంది. ఒకవైపు సాక్షి, వసుధార ఇద్దరు భోనాలు సమర్పిస్తూ అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమ గెలవాలని.

తులసి భోనం కి అన్ని సిద్ధం చేస్తూ ఉండగా తులసీ దగ్గరికి వసుధార సాక్షి ఇద్దరు వస్తారు. అప్పుడు అక్కడ భాగ్య తులసి కుటుంబంతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది కొద్దిసేపు. దాన్ని చూసిన వసుధార సాక్షి మనసులో అనుకుంటూ వుంటారు వాళ్లకు తోచింది. మొక్కు లాస్య తీర్చుకోవాలి అని నందు లేదు తులసి తీర్చుకోవాలి అని నందువల్ల అమ్మగారు ఇలా కొద్దిసేపు వాదించుకుoటారు.అప్పుడు వసుధార ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే వచ్చే ఏడాది భోనాల పండుగ కూడా వస్తుంది ఇప్పుడు భోనం సమర్పించండి అని మీరు ఏమీ అనుకోకపోతే నేను పరిష్కారం చెప్తాను అని అంటోంది.

అప్పుడు వాళ్లు సరే అనడంతో వసుధార తులసి వాళ్ల అత్తగారితో ఆంటీ మీరు మొక్కు ఎలా మొక్కుకున్నారు అని అంటోంది, అప్పుడు నేను నా కోడలు తులసి అనే అనుకోని తులసి చేత భోనం సమర్పిస్తాను అని మొక్కుకున్నాను చచ్చే వరకు నా కోడలు తులసిని అని అంటుంది. దానితో వసుధార అప్పుడు తులసి అంటీనే భోనం సమర్పించాలి అని అంటోంది. తరువాత తులసి పోతురాజు ఇచ్చిన మజ్జిక తాగుతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement