Intinti Gruhalakshmi 13th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి ఎవ్వరూ

Intinti Gruhalakshmi 13th July Today Episode : పోతురాజు ఇచ్చిన మజ్జిగను తులసి తాగుతుంది తరువాత నందు లాస్యకు ఇచ్చి తాగు లాస్య ఇది ఇక్కడ సాంప్రదాయం అంటాడు కానీ లాస్య దానిని ఎవరూ చూడకుండా భాగ్య కి ఇస్తుంది భాగ్య దానిని పారబోసింది అందరూ చూడకుండా తాగినట్టు యాక్టింగ్ చేస్తుంది. తరువాత లాస్య తులసి ఇద్దరు భోనం ఎత్తుకొని వెళుతూ ఉంటారు అప్పుడు తులసికి కళ్ళు తిరిగినట్లు అవుతుంది, తులసి పక్కనే ఉన్న వసుధార దానిని గమనించి తులసి చెప్పింది. గుర్తుకు తెచ్చుకొని పసుపు నీళ్లు తీసుకుని తులసి దగ్గరికి వస్తుంది తులసి ముఖ౦ మీద పసుపు నీళ్లు చల్లుతూ ఉంటుంది వసుధార నెమ్మదిగా వెళ్లండి అంటీ అమ్మవారు మీ వెంటే ఉన్నారు అంటూ ధైర్యం చెప్తుంది.

Advertisement

తులసి అమ్మవారి దగ్గరికి వెళ్లి భోనాన్ని సమర్పించి, అక్కడే అమ్మవారి దగ్గర పడిపోతుంది. తులసి మళ్లీ లేచి అమ్మవారికి దండం పెట్టుకుంది అప్పుడు లాస్య భోనం సమర్పించడానికి వచ్చి కిందపడబోతుంటే తులసి పట్టుకుంటుంది లాస్య ని, నువ్వు పడకుండా ఆపింది నీ మీద ప్రేమతో కాదు నువ్వు తలమీద మోస్తున్న అమ్మవారి ప్రసాదం మీద గౌరవంతో నీ తలమీద పెట్టుకుంది కేవలం మట్టి కుండ కాదు అందులో మీ వాళ్ల ఆశలు, భవిష్యత్తు అందులో ఉన్నాయి వాటిని నేలపాలు కానివ్వకు జాగ్రత్తగా కాపాడుకో అమ్మవారికి భోనం ని సమర్పించు అని తులసి లాస్యతో చెబుతుంది.

Advertisement
Intinti Gruhalakshmi 13th July Today Episode
Intinti Gruhalakshmi 13th July Today Episode

అమ్మవారి దగ్గర ఒక ఆవిడ పూనకంతో అమ్మవారు వచ్చి ఊగుతుంది తులసి ని చూసి ఆవిడ మారిపోతుంది జీవితం తొందర్లోనే నీ జీవితంలోకి కొత్త మనిషి రాబోతున్నాడు, జీవితం మారిపోతుంది, ఆ కొత్త మనిషి నీ జీవితాన్ని కొత్తమలుపు తిప్పబోతున్నాడు, నీ చిక్కు ముళ్ళు విప్పబోతున్నాడు, నరదృష్టి నాశనమౌతుంది, నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది, ఏడిపించేవాళ్ళు ఏడుస్తూ పారిపోతారు, పెదాల మీద జీవం ఉన్న నవ్వులు కనిపిస్తాయి, అధైర్యపడకు సహనంతో సరైన నిర్ణయం తీసుకో, నీ వెంట ఉండి నేను నడిపిస్తాను అని అంటోంది.

Intinti Gruhalakshmi 13th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి ఎవ్వరూ

తరువాత భాగ్య లాస్య తో ఏంటి లాస్య ఇలా అయింది అని ఉంటుంది అప్పుడు అక్కడికి వసుధార వచ్చి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి చెడపకురా చెడేవు అని అంటుంది. తులసి ఆ౦టి తాగే మజ్జికలో నిద్రమాత్రలు కలపాలి అని మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను మీరు చెడు చేద్దామనుకున్నా ఆంటీ మీకు మంచే చేసింది మీ మొక్కు సభ్యంగా తీరేలా హెల్ప్ చేసింది మంచితనం నడిచి మీ ఎదురుంగా నిలబెడితే ఎలా ఉంటుందో తెలుసా తులసి ఆంటీలా ఉంటుంది.రాయి రూపంలో ఉన్న అమ్మవారికి తులసి ఆంటీ రూపంలో ఉన్న అమ్మవారికి తేడా ఏమీ లేదు అది తెలుసుకోండి మీకు మంచి బుద్ధి ప్రసాదించమని అమ్మవారికి మొక్కు కొని వచ్చే ఏడాది మళ్లీ భోనం సమర్పిస్తానని మొక్కుకోండి బాగుపడతారు అని చెప్పి వెళ్ళిపోతుంది వసుధార.

తర్వాత తులసి వసుధార కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో వసుధార తులసి దగ్గరికి వచ్చి ఆ౦టీ నన్ను ఆశీర్వదించండి అంటుంది అప్పుడు తులసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి, నా మొక్కు తీర్చడానికి సాయం చేశారు అని ఉంటుంది తర్వాత వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత శృతి దేవుడికి పూజ చేస్తూ ఈ అయిదు లక్షలు నీ కష్టార్జీతం ప్రేమ్ అని నువ్వు ఆల్బమ్ ఇప్పుడు తయారుచేసుకోవడానికి ఉపయోగపడుతుంది వెంటనే పని ప్రారంభించు అని అంటుంది కానీ ప్రేమ్ నేను ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని శృతి ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తాను అని అంటాడు.

వెంటనే శృతి నేను తులసి ఆ౦టీ కి చెపుతాను నువ్వు వినట్లేదు అని అనగానే ప్రేమ్ శృతి తో నేను ఈ డబ్బు ఇచ్చేది అమ్మకే అమ్మ నాకు ఎంతో సహాయం చేసింది ఇప్పుడు అమ్మకి డ్యాన్స్ స్కూల్ కోసం డబ్బు చాలా అవసరం అని చెబుతుంది ఈ నిర్ణయం నాకు సంతోషమే ప్రేమ్ కానీ దాని కోసం అ౦టీ ఒప్పుకుంటుందా అని శ్రుతి అంటోంది ఎలాగైనా ఒప్పిద్దామని ప్రేమ్ అంటాడు. తరువాత తులసి తో అంకిత ఆంటీ నాకొక సజెషన్ ఇవ్వండి అని అంటోంది ఏంటి చెప్పు అంకిత అనగానే నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది అది నడవక మూసేద్దాం అని అనుకుంటున్నారు.

రేపటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లీనిక్ పెట్టి వర్క్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు కానీ అక్కడ శాలరీ ఏమీ ఉండదు ఆంటీ పేషెంట్లను బట్టే వస్తుంది అని అంటుంది. అప్పుడు తులసి అంకిత ఏ డాక్టర్ కి అయినా సొంతంగా క్లినిక్ పెట్టుకోవడమే లక్ష్యం కదా అవకాశం వచ్చింది దాన్ని వినియోగించుకో అని అంటుంది. తరువాత తులసి అత్త, తులసితో మ్యూజిక్ క్లాసెస్ కోసం ఒక్క రూమ్ ని అద్దెకు తీసుకుంటే మంచిది అని అంటుంది.తర్వాత తులసి స్కూల్ ప్రిన్సిపల్ కి కాల్చేసి మేడమ్ నేను తులసిని నన్ను గుర్తుపట్టారా మీరు నాకు సహాయం చెయ్యాలి అని నాకు ఒక రూమ్ మీరు ఇప్పించగలరా నేను మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకుంటాను అని అడుగుతుంది.

అప్పుడు ప్రిన్సిపల్ నేను మేనేజర్ తో మాట్లాడుతాను ఈ లోపు మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెబుతుంది దాంతో తులసి అక్కడికి బయలుదేరుతుంది. తర్వాత ఒక కొత్త పాప సైకిల్ తొక్కుతూ ఉంటుంది అక్కడ ఉన్న పనివాళ్లు జాగ్రత్త అమ్మా అని అంటూ ఉంటారు అప్పుడు ఆ పాప ఎంతసేపు లోపుల ఇంట్లోనే తొక్కడం ఏంటి నేను బయటికి వెళ్లి సైకిల్ తొక్కుతాను అని అంటుంది అప్పుడు వాళ్లు అమ్మా నీ కేమన్నా అయితే అయ్యగారు ఊరుకోరు అని చెప్తారు అప్పుడు సరే వెళ్లను అని దాహంగా ఉంది నీళ్లు తీసుకొని రా అని చెబుతుంది అందులో పనిచేసే ఒక అతనికి ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement