Intinti Gruhalakshmi 14th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో హనీ పాపకి యాక్సిడెంట్ చేసిన నందు, లాస్య పాపని కాపాడిన తులసి.

Intinti Gruhalakshmi 14th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 14-July -2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం హనీ పాప సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వెళుతుంది ఈలోపు నీళ్లు తీసుకుని ఒక వ్యక్తి వచ్చే సరికి పాప అక్కడ ఉండదు బయటికి వెళ్ళింది చిన్నమ్మగారు అని అందరూ పనివాళ్లు కంగారు పడుతూ ఉంటారు.నందు లాస్య కార్లో వెళుతూ ఉంటారు అప్పుడు లాస్య నందుతో సామ్రాట్ గారు చాలా మంచి బిజినెస్ మ్యాన్ ఎట్ ది సేమ్ టైమ్ కైండ్ హార్టేడ్ పర్సన్ అని ఇప్పుడు మనం అతని దగ్గరికే వెళుతున్నాం ఆయనను ఇంప్రెస్ చేయగలిగితే మన కంపెనీకి ఇన్వెస్టరు దొరికినట్టే అని అంటుంది అప్పుడు నందు కోట్లలో తేలేవాడు మనవంక చేస్తాడా అని అంటాడు ఇలా నందు లాస్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

సైకిల్ తొక్కుతున్న హానీ పాపను నందు కారు ఢీకొట్టింది అప్పుడు నందు పాప కిందపడింది అని వెళుతుంటే లాస్య నందుని ఆపి మనం ఇప్పుడు పారిపోవాలి లేదంటే జనాలు వస్తే ఇబ్బంది అవుతుంది అని బలవంతంగా వెళ్లేలా చేస్తుంది లాస్య. కింద పడ్డ పాపని ఆటోలో వెళుతున్న తులసి గమనించి ఆ పాపని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది దానిని చూసిన నందు తప్పు చేసింది నేను అయితే తులసి ఇబ్బంది పడుతుంది మనం కూడా ఆసుపత్రికి వెళదాం అని లాస్య తో అంటాడు నందు. అక్కడ డాక్టర్ పాప మీకు ఏమవుతుంది అని అడిగితే తెలియదు అని చెప్తె జాయిన్ చేసుకుంటారో లేదో అని అమ్మని అని చెపుతుంది తులసి డాక్టర్తో.

Advertisement

Intinti Gruhalakshmi 14th July Today Episode : లాస్య పాపని కాపాడిన తులసి.

Intinti Gruhalakshmi 14th July Today Episode
Intinti Gruhalakshmi 14th July Today Episode

హాస్పిటల్ లో డబ్బులు కూడా తులసినే కడుతుంది దానిని చూసిన నందు తులసి ఇబ్బంది పడుతుంది నేను యాక్సిడెంట్ చేశాను అని తనతో చెప్తాను అని వెళుతుంటే లాస్య ఆపుతుంది నందుని. లాస్య నందు తో ఇక్కడినుండి వెళ్లిపోదాము అని తీసుకువెళ్ళుతుoది. లాస్య నందు ఇద్దరూ సామ్రాట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ నoదు మాత్రం ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో హనీ పాప వాళ్ల ఇంటిలో పనిచేసేవాళ్లు పాప గురించి వెతుకుతూ ఉండగా పాప సైకిల్ కిందపడి ఉంటుంది దాంతో పాపకి ఏమైందో వెంటనే అయ్యగారికి చెప్తామని అనుకుంటూ ఉంటారు.

ఇంతలో ఆఫీస్ దగ్గర సామ్రాట్ గారి ఎంట్రీ జరుగుతుంది అప్పుడు అందులో ఒకతనిని చూసి నువ్వు అబద్ధం చెప్పవు ఇక్కడికెందుకొచ్చావ్ మళ్లీ అని ఒక వ్యక్తిపై కోప్పడుతూ ఉంటాడు అలా సామ్రాట్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. అప్పుడు సామ్రాట్ కి ఫోనొస్తుంది ఇంటి దగ్గర నుంచి పాప కనిపించడం లేదు అని దాంతో సామ్రాట్ వెంటనే ఇంటికి వెళ్లి పనివాళ్ల మీద విరుచుకు పడుతూ ఉంటాడు.నందు లాస్య మళ్లీ ఆస్పత్రికి వెళతారు తులసి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ పాపకి ఎలా వుంది అనడంతో పాప మంచిగా ఉంది ఇప్పుడు అని అంటుంది దాంతో తులసి వెంటనే వాళ్ల అమ్మా నాన్నలకి అప్పచెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

అప్పుడు లాస్య నందు ని చూశావా పాపకి ఏమీ కాలేదు నువ్వు ఊరికే టెన్షన్ పడుతున్నారు అని అంటుంది.అప్పుడు నందు పాపని ఒకసారి చూసి తులసి కి థాంక్యూ చెప్పి వస్తాను అనడంతో లాస్య ఆపుతుంది నందుని ఎందుకు వెళ్లి ఏం చేస్తావు తులసి కి పాదపూజ నా అని నందుని అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది.సామ్రాట్ వాళ్ల ఇంటికి పోలీసులు వస్తారు సార్ మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా పాపని కిడ్నాప్ చేశారు అని అడుగుతారు అప్పుడు సామ్రాట్ అన్ని పోలీస్ స్టేషన్లకి నా పాప ఫోటో ని పంపించి ఎంక్వయిరీ చేయండి పాపని జాగ్రత్తగా తీసుకుని వచ్చిన వారికి వన్ క్రోర్ ఇస్తాను అని చెప్తారు. తులసి ఆ పాప దగ్గరికి వెళ్లి నొప్పిగా వుందా అమ్మా అని అడుగుతుంది.

అప్పుడు లేదు అంటీ మీరేనా నన్ను హాస్పిటల్ కి తీసుకొచ్చింది అని అంటుంది ఔనూ అమ్మ అనడంతో థ్యాంక్యూ ఆంటీ అంటుంది నీ పేరు ఏంటి అని అడుగుతుంది తులసి అప్పుడు ఆ పాప నాపేరు హసిని అందరూ ముద్దుగా హనీ అని పిలుస్తారు మీరు కూడా అలానే పిలవండి అని అంటుంది.అప్పుడు తులసి నీ పేరు చాలా ముద్దుగా ఉంది అని అంటోంది మరి నేను అంటీ అంటుంది అప్పుడు తులసి పేరు కన్నా ముద్దుగా ఉన్నావు నువ్వు అని అంటుంది తులసి ఆ పాపని మీ నాన్న నెంబర్ చెప్పు కాల్ చేస్తాను అని అంటుంది కానీ ఆ పాప కావాలని నాకు నెంబర్ గుర్తు లేదు అని అంటుంది. అడ్రస్ చెప్పు అమ్మ అని అంటే అడ్రస్ ఎలా చెప్పాలో నాకు తెలియదు అంటీ అని అంటుంది .

ఆ పాప తులసితోనే ఉంటే సరదాగా తిరగొచ్చని వాళ్ల నాన్న తీసుకెళ్తే ఎటువెళ్ళనివడు అని మనసులో అనుకుంటూ ఉ౦టుంది.ఆ౦టీ ఎలా వెళ్లాలో చెబుతాను నన్ను తీసుకెళ్లండి చూపిస్తాను అని అంటుంది. అప్పుడు తులసి ఆ పాపను తీసుకుని వెళుతుంది ఆటోలో ఎక్కడికి వెళ్లినా ఇది కాదు అని అంటుంది యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి తీసుకెళ్తే ఎమన్నా చేబుతు౦దని అక్కడికి తీసుకెళ్తుంది కానీ పాప ఏమీ చెప్పదు గుర్తుకురావట్లేదు ఆంటీ అని అంటూ ఉంటుంది ఒకవైపు సామ్రాట్ వాళ్లు కూడా పాప కోసం ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అక్కడికి వెళ్లి చూస్తారు కాని తులసి వెళ్లెలోపు సామ్రాట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇలా ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఒకరి కోసం ఒకరు ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement