Intinti Gruhalakshmi 15 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 15-aug-2022 (711) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…..తులసి ని చూసి సామ్రాట్,తులసి గారు మిరు మొదటిసారిగా ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. ఈ జర్నీ మీకు మధుర జ్ఞాపకంలా మిగిలిపోవాలని అని చెప్తూ ఉంటాడు. సామ్రాట్ చెప్పేమాటలకీ తులసి పొంగిపోయి తమ గురించి తాము ఆలోచించుకునే మొగవాళ్ళు ఉన్నారు తప్ప. మొదటిసారిగా ఎదుటి వాళ్ల గురించి ఆలోచించే మొగవాడ్ని మిమ్మల్ని చూస్తున్నాను అని తులసి చెబుతోంది.ఫ్లైట్లో వెళ్తుంటే మబ్బులని, మేఘాలని చూస్తూ తులసి చాలా పొంగిపోతూ ఉంటుంది. తులసి చేసే చేష్టలేమో నందుకి లాస్యకి నచ్చవు.ఇంతలో తులసి ఆదమరచి నిద్రపోతోంది.తులసి చలికి వణుకుతూ ఉంటే సామ్రాట్ తన జాకెట్ తీసి తనకి కప్పుతాడు. తులసికి మెలకువ వచ్చి చూస్తే తనమీద సామ్రాట్ జాకెట్ ఉంటుంది ఏంటిది మీరు పడుకున్నారు ఏయురహొస్టర్ ని పిలిచి దుప్పటి అడుగుదామంటే మీరు లేస్తారని నా జాకెట్ కఫాను ఏమనుకోదు అని చెప్తాడు సామ్రాట్.
ఫర్వాలేదండీ అని అంటోంది తులసి. చుసావ అల నాకెప్పుడైనా చేశావా అని లాస్య నందుని అడుగుతోంది.శృతికి నచ్చచెప్పి ఇంటికి తీస్కెళ్దామని ప్రేమ్ వస్తే స్ఫూర్తి వాళ్ళ అత్తయ్య ఇంటికి తాళం వేసి ఉంటుంది. తాళం తీసి ఏం చేయాలో అర్థంకాక ప్రేమ్ అక్కడ నిలబడతాడో ఇంతలో ప్రేమకి అంకిత ఫోన్ చేస్తుంది.ఇప్పుడు ఎలా అని అడిగితే యింటికొద్దామనుకుంటున్నాను అని చెప్తాడు ప్రేమ్. వద్దు అక్కడే ఉంటూ అతికష్టం మీదని మనసు మార్చుకుని అక్కడికి వెళ్ళావు ఇక్కడికొస్తే మళ్ళీ నీ మనసు మారుతోంది. ఎంత లేటైనా పర్వాలేదు శృతి వచ్చే వరకు అక్కడే వుండు అని అంకిత చెబుతుంది ఎంత లేటైనా పర్వాలేదు స్ఫూర్తి ని తీసుకుని ఇంటికి రా అని చెప్తోంది.అలాగే వదినా అని చెప్తాడు ప్రేమ్. ఇంతలో ఇంకాసేపట్లో మీ ఫ్లైటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ అయిపోతుంది అని చెప్పగానే నాకైతే ఫ్లైట్దీన్ని చేసినట్టే లేదో ఇంకా ఇలాగే వెళ్తే బాగుండు అని అని అంటోంది తులసి.ఇంతలో ఏదో ఇబ్బంది జరుగుతోంది టెక్నికల్ ఇస్యూ జరిగే సమస్య ఎదురయ్యే లాగా ఉంది అందరూ సీట్బెల్ట్ పెట్టుకునే కూర్చోమని ఎయిర్హోస్టెస్ చెప్తారు.

ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ టెన్షన్ పడుతూ ఎయిర్హోస్టెస్ని తిడుతు ఉంటారు.తులసి తీపి జ్ఞాపకాలను తీసుకెళ్దామంటే ఇంతలో ఈ పరీక్ష ఏంటి స్వామి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.నందు టెన్షన్ తట్టుకోలేక హెయిర్ హొస్టర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అసలు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ప్రమాదం ఉంటే మీరు కంగారు పడకుండా కూర్చోమని అంటారేంటి ఎయిర్హోస్టెస్ని నందు నెట్టేస్తాడు.మీరు అసలు మనుషులేనా మానవత్వం ఉందా ఉద్యోగ ధర్నా౦ చేస్తున్న ఒక ఆడపిల్లతో ఇలాగేనా ప్రవర్తించేది అని తులసి నందుతో అంటోంది. ఇలా అరచి గోల చేసినంత మాత్రాన ప్రాణాలు దక్కుతాయా మనతోపాటు ఎయిర్ఫోర్స్వి కూడా ప్రాణాలు పోతాయి కదా కదలకుండా కూర్చుంటే ఏమౌతుంది మన కోసమే కదా జాగ్రత్తలు చెబుతోంది అనే తులసి అంటోంది.ఇంతలో అతనికి యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తు చేస్తోంది తులసి వెంటనే నందు భయపడి లాస్య సైలెంటుగా కూర్చో అని చెప్పి కూర్చుంటాడో వెనకాల ఉన్న ప్యాసింజర్ మాత్రం నందు ని లాసయని గమనిస్తూ ఉంటాడు.తులసి అందరికీ చెప్తున్నాను అందరు ఖంగారు పడకుండా దేవుని తలచుకొంటూ ఉండండి.
Intinti Gruhalakshmi 15 August Today Episode : ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ జరిగితే అందరికీ ధైర్యం చెప్పిన తులసి.
మన భయమే మనకి ప్రమాదం పిరికితనంగా ఉండకుండా ధైర్యంగా ఉండమని అందరికీ చెప్తోంది.ఇంతలో టెక్నికల్ ఇష్యూస్ సాల్వయింది ఎలాంటి ప్రమాదం లేదు అని చెబుతారు ఎయిర్హోస్టర్గా. అందరూ క్లాప్స్ కొడతారు.తులసి చేసిన పనికి సామ్రాట్ మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని అనౌన్స్ వస్తుంది.ఇంతలో మళ్ళీ సామ్రాట్ కళ్లు మూసుకుని భయపడుతూ ఉంటే భయపడకుండా మనస్ఫూర్తిగా పడండి అని తులసి చెప్తుంది అలా వాళ్లిద్దరూ నవుకు౦టువుంటారు. అందరూ కలిసి ఒక హోటల్కు వెళ్తారు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే తులసి ఆశ్చర్యపోయి సంబరపడుతూ సామ్రాట్తో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అవి చూసి లాస్య మాత్రం తట్టుకోలేక ఎప్పటికప్పుడు చాడీలు చెప్తూనే ఉంటుంది నందుతో.సామ్రాట్ కి ఫోన్ వస్తుంది ఫ్లైటు రెండు గంటలు లేటయినంఫ్లైట్దుకు మీటింగ్ క్యాన్సిల్ చేశారని చెబుతారు.రేపటికి మిస్సింగ్స్ పోస్ట్ పోన్ చేశారని చెబుతారు మరి అప్పటివరకు ఏం చెయ్యాలి అంటే ఇంకేముంది రెస్ట్ తీసుకోవడమే అని చెప్తాడు సామ్రాట్.
ఇకపోతే రిసెప్షన్ కి వెళ్లిన తర్వాత సామ్రాట్తో అడిగితే మీకు రెండు రూమ్స్ బుక్ చేసి ఉన్నారని చెబుతారు. ఇంకో రూం కావాలని చెప్తే ఇంకొకరుమో అవైలబుల్గా లేదు అని రిసెప్షన్ వాళ్లు చెప్తారు.ఇదంతా ముందే రన్నింగ్ కామెంటరీ లాగా లాస్య నందకి చెప్తుంది.ఎంతో తెలివిగా ఫర్వాలేదు సార్ మీరు నేను ఒక గదిలో ఉందాం. వాళ్లిద్దరూ లేడీస్ ఒక గదిలో ఉంటారు అని చెప్తే నేను ఒప్పుకోను అని సామ్రాట్ అంటాడు. వీరిద్దరూ భార్యాభర్తలు మీరిద్దరూ సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే మిమ్మల్నిద్దర్నీ చెరొక గదిలో ఉంచితే నాకు పాపం తగులుతుందా అని సామ్రాట్ నందుతో అంటాడు.మీరు ఓకే అన్నా నేను ఒప్పుకోను ఏమంటారు తులసి గారు అంటే తులసి కుడా అటూ ఇటూ తల ఊపుతూ ఉంటుంది. రెండు రూమ్ కీస్ రిసెప్షన్ వాళ్ళు ఇస్తే ఓక కీ నందు వాళ్ళకిచ్చి మీరు రూమ్ కి వెళ్ళండి అని చెప్తాడు సామ్రాట్. మరి మీరు అని అడిగితే మా సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు సామ్రాట్.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.