Intinti Gruhalakshmi 15th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 15-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం, తులసి ని అరెస్ట్ చేయించిన సామ్రాట్.

Intinti Gruhalakshmi 15th July Today Episode : హనీ పాప, తులసి ఇద్దరూ ఆటోలో వెళుతూ ఉంటారు అప్పుడు హనీ పాప ఆంటీ నాకు ఐస్క్రీమ్ కావాలి అని అడుగుతుంది అప్పుడు తులసి ఆ పాపకి ఐస్క్రీమ్ ఇప్పిస్తుంది. తులసి మనసులో పాప ఊరంతా తిప్పితు ఉoది కానీ ఇల్లు ఎక్కడ ఉoదో తనకి గుర్తుకు రావటం లేదు ఏం చెయ్యాలి పాపని చూస్తే జాలేస్తుంది వదిలేయలేను నేనేమో డ్యాన్స్ స్కూల్ కి వెళ్లాలి అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇంతలో ప్రేమ్ తులసికి కాల్ చేస్తాడు అమ్మ నిన్ను కలవాలి ఒకసారి ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతాడు.లేదురా బయట ఉన్నాను చిన్న పని ఉంది కాసేపట్లో ఇంట్లో ఉంటాను అని చెబుతుంది. తులసి ఫోన్ మాట్లాడిన తర్వాత చూస్తే పాప ఉండదు పక్కన వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఒక దగ్గర బెలూన్స్తో ఆడుకుంటూంటుంది పాప.

Advertisement

తులసి బెలూన్స్ ని కొని ఇస్తుంది పాపకి, తర్వాత పోలీస్ వాళ్లు ఒక సీసీటీవీ ఫుటేజ్ని సంపాదిస్తారు పాపకు సంబంధించి, అందులో పాప ఐస్క్రీమ్ తింటున్నట్టు తులసి పక్కన కూర్చొని ఉన్నది ఉంటుంది దాన్ని చూస్తారు సామ్రాట్ కూడా వెంటనే ఈమె డీటేల్స్ నాకు కావాలి ఇంటి మీద ఎటాక్ చేయండి అని అంటాడు పోలీసులతో సామ్రాట్.పోలీసులు తులసి ఇంటి దగ్గరికి వచ్చి తులసి ఎక్కడ ఉంది అని అంటారు.

Intinti Gruhalakshmi 15th July Today Episode : తులసి ని అరెస్ట్ చేయించిన సామ్రాట్.

Intinti Gruhalakshmi 15th July Today Episode
Intinti Gruhalakshmi 15th July Today Episode

ఇంటిలో లేదు అని వాళ్లు అనడంతో ఎక్కడ దాచారు అని అంటారు. పోలీసులు వాళ్ళు ఇంటి సభ్యుల ముందే సామ్రాట్కి కాల్ చేసి మీ పాపని కిడ్నాప్ చేసిన ఆమె ఇంట్లో లేదు సార్ ఏం చేయమంటారు అని అంటారు ఇంట్లో వాళ్లని జైలులో వేయండి అని అంటాడు ఎంత చెప్పినా వినకుండా తులసి అత్తామామలను జైలుకి తీసుకునివెళ్తారు పోలీసులు.

అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు జరిగిన విషయాన్ని దివ్య అంకిత, ప్రేమకి చెబుతారు. అంకిత తులసికి ఫోన్ చేసి జరిగింది అంత చెబుతుంది తులసితో అప్పుడు హనీ పాప ఏమైంది ఆంటీ అని అడుగుతుంది అప్పుడు తులసి మీ నాన్న నిన్ను కిడ్నాప్ చేశాను అని మా వాళ్ళని అరెస్ట్ చేయించాడు అని చెబుతుంది.అప్పుడు పాప సారీ అంటీ నేనే కావాలని ఇల్లు గుర్తు లేదు అని చెప్పాను సరదాగా మీతోపాటు తిరగడానికి నాన్న నన్ను ఎక్కడికి వెళ్లనివ్వడు అందుకే ఇప్పుడు నేను కరెక్టుగా అడ్రస్ చెప్తాను అంటీ కానీ నాకు ప్రామిస్ చేయండి నేను ఇలా తిరిగాను ఊరంతా అని మా డాడి కి చెప్పకండి అని అంటుంది.

పాప.తరువాత సామ్రాట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కాల్ చేశారా తులసికి అని అంటే ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని పోలీసులు ఉంటారు ఆ ముసిలోల్లని ఎలాగైనా ఎంక్వైరీ చేసి, నాకు తులసి డీటైల్స్ కావాలి అని కోపంగా అంటాడు. తులసి పాపని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళుతుంది. పాపని సామ్రాట్ దగ్గరికి తీసుకుంటాడు అప్పుడు తులసి ఈ పాప మీ దగ్గరికి చేరింది కదా ఇప్పుడు మా వాళ్ళని వదిలేయమని చెప్తారా అని అంటుంది.

అప్పుడు సామ్రాట్ పాపని తాతయ్య దగ్గరికి వెళ్లు అని అంటాడు అప్పుడు పాప ఆంటీ చాలామంచిది నాన్నా అని అంటే ఐస్క్రీమ్ కొనిచ్చిందా చాక్లెట్ కొనిచ్చిందా నేను ఎంత మంచి వాడినో చూపిస్తాను ఆంటీకి అని అంటాడు. సామ్రాట్ తులసిపై గన్ ని గురిపెట్టి హనీ ని కిడ్నాప్ చేస్తావా షూట్ చేసి పాడేస్తాను ఎవరొస్తారో చూస్తాను అని అంటాడు అప్పుడు తులసి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను తనని కిడ్నాప్ చేయలేదు అని అంటుంది.

అప్పుడు సామ్రాట్ మరి మీ దగ్గర ఎందుకుంది పాప అని అంటే యాక్సిడెంటై స్పృహ లేకుండా రోడ్డుమీద పడుంటే హాస్పటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించాను అని అంటుంది యాక్సిడెంట్ జరగడం చూశావా అని సామ్రాట్ అంటాడు. అప్పుడు తులసి చూశాను అంటుంది ఎవరు, కారు నెంబరు గుర్తుపట్టగలవా నువ్వు అంటే నేను గుర్తుపట్టలేను అని అంటుంది గుర్తు పట్టలేవు ఎందుకంటే యాక్సిడెంట్ నువ్వే చేయించావు అని అంటూ ఉంటాడు తులసిని, తులసి కి యాక్సిడెంట్ చేసింది నందు అని తెలుసు అందుకే చెప్పలేకపోయింది తను.

నువ్వు చెప్పిందే నిజమైతే పాపని ట్రీట్మెంట్ చేయించాక పోలీస్స్టేషన్లో అప్పగించాలి ఎందుకు అప్పగించలేదు అని అంటాడు పాప చెప్పొద్దు అని చెబుతుంది సైగ చేసింది కాబట్టి తులసి ఆ విషయం చెప్పలేకపోతోంది దాంతో సామ్రాట్ తులసిని అపార్థం చేసుకుంటాడు తులసిని కూడా అరెస్ట్ చేయిస్తాడు.తరువాత నందు యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ, పాప ఎలా ఉందో అని ఆలోచిస్తూ, తులసికి ఒకసారి ఫోన్ చేస్తాను అంటే లాస్య నందుని ఆపుతుంది నువ్వే యాక్సిడెంట్ చేశావని తులసికి తెలిస్తే తులసి ఊరుకోదు అని అంటుంది.

ప్రేమ్ తులసి దగ్గరికి వస్తాడు ఏంటీ అమ్మా ఇలా చేశాడు ఆ మనిషి సాయం చేస్తే అని కోపంగా అంటాడు తులసి ఓపికగా ఉండాలి నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది అని అంటుంది. ప్రేమ్ తొ అప్పుడు తులసి మామ తులసితో యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని నువ్వు చూశావు కదా అమ్మ చెప్పు గుర్తు తెచ్చుకొని అంటే, అప్పుడు తులసి చెబితే మీ అబ్బాయిని తీసుకొచ్చి జైల్లో వేస్తారు మామయ్య అని అంటుంది. అంటే యాక్సిడెంట్ చేసింది నందునా అని అంటారు అప్పుడు తులసి అవును అని అంటుంది. తప్పు చేసిన వాళ్లు బయట మనం లోపల ఉండాలా అని అంటారు.

అప్పుడు తప్పదు అని అంటుంది బెయిల్ కోసం ఎవరినైనా వెతుకు అని ప్రేమ్ తొ చెప్తుంది తులసి. తరవాత సామ్రాట్ పాప దగ్గరికి వెళ్లి నిన్ను దూరం చేసుకున్నానేమోనని భయపడ్డాను అని బాధపడుతూ ఉంటాడు.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Advertisement