Intinti Gruhalakshmi 17 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 17-aug-2022 ఎపిసోడ్ 713 ముందుగా మీ కోసం…. సామ్రాట్ తులసి రూమ్ దగ్గరకెళ్లి డోర్ను నాక్ చేసి తులసిని పిలుస్తారు. అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు కూడా వస్తారా అని అడుగుతాడు. బలవంతమేం లేదు మీ ఇష్టం అని చెప్తాడు సామ్రాట్ సరే అని అంటోంది తులసి.ఇదంతా లాస్య చూస్తూ రన్నింగ్ కామెంటరీ నందుతో చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి తులసి మీద కోపం వచ్చేలా చేసి వాళ్లిద్దరూ దూరమయ్యేలాగే నువ్వే చేయాలి అనే నందూకి చెప్తుంది లాస్య.తులసి బయట కిందికొచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. సామ్రాట్ ఆటోలో వస్తూ ఆటోను తీసుకుని వచ్చి తులసీని పిలుస్తాడు. తులసి ఏంటి సార్ మీరిలా ఆటోలో అని అడిగితే బిజినెస్ కి సంబంధించింది అయితే కారులో వెళ్లాలి. ఇది మన పర్సనల్ కాబట్టి ఆటోలు అయితేనే బాగుంటుంది అని చెప్తాడు.అలా వాళ్ళిద్దరూ ఆటోలో వెళతారు.అంకిత ప్రేమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రేమేమో ఒక్కడే ఇంటికి వస్తాడు. ఏమైందే అనడిగితే మీ మాట విని శృతిని బతిమిలాడ్డానికి వెళతానువదినా ఆయన తను నా మాట వినడం లేదు. ఇక మేమిద్దరం శాశ్వతంగా విడిపోయాం అని చెప్తాడు.
అంకిత ఏదో ఆవేశంలో ఉండి ఉండుంటుంది తన కోపం తగ్గిన తర్వాత నిదానంగా వెళ్ళి చెప్పు అని మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అంకిత. కానీ ఈసారి ప్రేమ్ వినడు అందరూ హృతిక్కే సపోర్ట్ చేస్తారో ఎవరు నాకు సపోర్ట్ చేయరు అని కోప్పడి ఇంతటితో ఈ విషయం వదిలేయండి అని చెప్తాడు ప్రేమ్. ఇక ఆ తర్వాత సామ్రాట్టు,తులసినీ ఒక్కచోటికి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పట్లేదు అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్తాడు సామ్రాట్.తులసి కళ్లుమూసుకోమని చెప్పి తన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. తులసి కళు ఓపెన్ చేసి చూస్తే సముద్రం దగ్గరికి తీసుకెళ్తాడు సామ్రాట్.అది చూసి తులసి ఆనందం మాటల్లో చెప్పలేం అంత సంతోషపడుతుంది అంత సంబర పడిపోతూ ఉంటుంది తులసి.వెంటనే తులసి వాళ్ళ మామయ్య కి ఫోన్ చేసి చెప్తుంది.ఇన్ని రోజులు నిజజీవితంలో జరిగిన గతాన్ని గుర్తుతెచ్చుకోకుండా సంతోషపడు అని చెప్తాడు తులసి వాళ్ళ మామయ్య.ఉదయం గాల్లో ఫ్లైట్లో ఎగిరారు ఇప్పుడు నీళ్లల్లో ఎగరండి మంచిగా ఎంజాయ్ చేయండి అని సామ్రాట్ తులసితో అంటాడు.సామ్రాట్ ని కూడా సముద్రం లోపలికి వెళ్దాం రండి అని పిలుస్తుంది కాని సామ్రాట్ వెళ్ళడు.
Intinti Gruhalakshmi 17 August Today Episode : తులసి సముద్రం అలల్లోనె కొట్టుకుపోతుందా.

మరీ దూరంగా వెళ్లకండి అలల తాకిడి ఉంటుంది అని జాగ్రత్తలు చెప్తాడు. తులసి చాలా సంబరపడుతూ నీళ్ళల్లోకి వెళ్తుంది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.చిన్నప్పటి నుంచి దాచిపెట్టిన కలలన్నీ తులసి గారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్నాయి ఎన్నెన్ని మనసులో దాచిపెట్టుకుంది తీరని కలలు నెరవేరితే ఇంత సంతోషంగా ఉంటుందా ఈ అనుభూతి ఇన్ని రోజులకి నాకు తెలిసే అవకాశం తులసి గారి వల్ల దొరికింది అని సామ్రాట్ అనుకుంటూ ఉంటాడు.సామ్రాట్ తులసిగారి వెనకాల బాడీగార్డ్ లాగా తెరవడం ఏంటిఅని నందు లాస్యతో అంటాడు.తులసిని ఇప్పుడిలా వదిలేస్తే తరవాత తను మనకి యజమానురాలవుతుంది. ముందు వాళ్ళెక్కడున్నారో వెతుకుదాం పద అని అంటోంది లాస్య.ఇకపోతే తులసి సముద్రం దగ్గర మట్టితో గోపురం కడుతుా నిళ్ళల్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డబ్బుతో ప్రతి ఒక్కదాన్ని కొనలేము అనే ఒకప్పుడు తులసి చెప్పిన మాటల్ని గుర్తు పెట్టుకుంటాడు సామ్రాట్. ఇంతలో సామ్రాట్కి ఫోనొస్తే మాట్లాడుతూ కొద్దిగా అటువైపు వెళతాడు.ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకావిడ అలల్లో కొట్టుకుపోయింది అని ఒకతను చెప్పే సామ్రాట్ వెళ్లి చూశాడు తులసి కనిపించదు.తులసి గురించి సామ్రాట్ చాలా కంగారు పడుతూ తులసిని వెతుక్కుంటూ బాధపడుతూ ఉంటాడు.సామ్రాట్ సముద్రంలోకి వెళ్ళబోతుంటే అందరూ అతణ్ని ఆపుతారు.తులసికి ఏమైందో అని సామ్రాట్ చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటాడు. ఎంతటిదో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.