Intinti Gruhalakshmi 18th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 18-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. తులసిని మళ్లీ అపార్థం చేసుకున్న సామ్రాట్.

Intinti Gruhalakshmi 18th July Today Episode : తులసి స్కూల్ ప్రిన్సిపాల్ కి కాల్ చేసి అడుగుతుంది మేడం ఇప్పుడు రావచ్చా అని, అప్పుడు తను నిన్నే వస్తా అన్నారు కదా ఎందుకు రాలేదు అంటే, కుదరలేదు అని అంటుంది తులసి, దాంతో ప్రిన్సిపల్ మా మేనేజర్కి మీ యాటిట్యూడ్ నచ్చలేదు కనీసం రావడం కుదరట్లేదు అని ఇన్ఫామ్ కూడా చేయలేదు దాంతో క్యాన్సిల్ చేసారు అని అంటుంది. అప్పుడు తులసి కుటుంబసభ్యులు మంచి చేయబోతో మనకి చెడెదురైంది అని, అమ్మాయి నష్టజాతకురాలు అని అంటుండగా హానీ పాప వస్తుంది అక్కడికి, పాపను చూసిన తులసి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటుంది.

Advertisement

అప్పుడు తులసి వాళ్ళ అత్త ఎందుకో మళ్లీ ఏం చేద్దామని వచ్చాను అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు తులసి ఆపుతుంది ఏమీ అనొద్దని. తరువాత తులసి పాపని దగ్గరికి పిలిచి ఏమైందమ్మా ఇలా వచ్చావు అని అంటే నావల్ల తప్పు జరిగింది అంటీ,మా నాన్న మిమ్మల్ని బాగా తిట్టారు, పోలిస్ స్టేషన్ లో పెట్టించాడు సారీ చెపుదామని వచ్చాను అని అంటుంది హనీ పాప. అప్పుడు తులసి వాళ్ళ మామ సారీ చెప్పవలసింది నువ్వు కాదు అమ్మా మీ డాడీ అని అంటాడు పాపతో.తులసి పాపతో ఇంట్లో చెప్పే వచ్చావా అని అడుగుతుంది, అప్పుడు పాప తాతయ్యకు చెప్పేవచ్చాను, తనేమీ అడ్రస్ ఇచ్చాడు అని అంటుంది.

Advertisement

Intinti Gruhalakshmi 18th July Today Episode : తులసిని మళ్లీ అపార్థం చేసుకున్న సామ్రాట్

Intinti Gruhalakshmi 18th July Today Episode
Intinti Gruhalakshmi 18th July Today Episode

అప్పుడు తులసి ఈసారి వచ్చేటప్పుడు మీ పెద్దవాళ్ళతో కలిసి రా ఒక్కదానివే రాకు అని అంటుంది అప్పుడు పాప నా మీద కోపంగా ఉన్నారా అంటి అంటోంది అదేమీ లేదు అమ్మా అని అంటుంది తులసి. అయితే మీరు బెండు అవ్వండి అని అంటుంది, తులసికి ముద్దు పెడుతుంది పాప. తులసి వాళ్ల ఇంటి బయట గులాబీ చెట్టుకి గులాబి పువ్వుని తెంచుకొని వెళుతుంది పాప అప్పుడే ఆ పాప చెయిన్ కిందపడిపోతుoది. సామ్రాట్ వల్ల బాబాయ్కి ఫోన్ చేసి, తులసి విషయంలో అంత పాజిటివ్ గా ఎలా మారిపోయారు అని అడుగుతాడు.

కళ్లతో చూసినవన్నీ నిజాలు కాదు, తులసి మంచిది మనం అపార్థం చేసుకున్నాము, నేను ముంబై నుంచి రాగానే మాట్లాడదాం అని చెప్తాడు. ఇంతలో పాప సామ్రాట్ దగ్గరికి వస్తుంది, అప్పుడే వచ్చావేంటి అని అడిగితే, డాడీ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆప్డే స్కూల్ మర్చిపోయారా అని, అలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు, ఇంతలో సామ్రాట్ పాప మెడలో చెయిన్ కనిపించకపోవడంతో ఏమైంది అమ్మ అంటే, స్కూల్లో పడిపోయిందేమో డాడీ అని అంటుంది, స్కూల్లో పడితే వాళ్లు ఈపాటికి ఫోన్ చేసేవారు కదా, అని కార్లో పడిందో ఏమో అని డ్రైవర్ కి కాల్ చేసి వెతకమని చెబుతాడు.

పాప బ్యాగ్ ని కూడా వెతుకుతూ ఉంటాడు, కానీ అది ఎక్కడా కనిపించదు, అప్పుడు పాపతో నీకు ఆ చెయిన్ చాలా ముఖ్యమని చెప్పాను కదా అమ్మా అని అంటాడు, ఈ రోజు స్కూల్ కి కాకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్లావా అమ్మా అని అడుగుతాడు సామ్రాట్ పాపని. అప్పుడు పాప మనసులో తులసి అంటీ వాళ్ల ఇంటికి వెళ్లేది చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉండగా, డ్రైవర్ స్కూలుకి వెళ్ళేటప్పుడు బుక్స్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్లావు కదా అమ్మా మర్చిపోయావా అని అడుగుతాడు, అప్పుడు పాప అవును అవును అని అంటోంది. అప్పుడు సామ్రాట్ ఎవరి ఇంటికి అని అడగగా ఫ్రెండ్ కాదు డాడీ తులసి ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లాను అని అంటుంది.

అప్పుడు సామ్రాట్ పాపను తీసుకొని తులసి వాళ్ళింటికి వెళ్తాడు, అక్కడ అందరూ సంతోషంగా భోజనం చేస్తుంటే మీకు ముద్దా ఎల దిగుతోంది, కిడ్నాప్ కాకుండా చెయిన్ దొంగతనాలు కూడా చేస్తున్నారా అని, మళ్లీ అవమానించి మాట్లాడుతాడు తులసిని, కుటుంబాన్ని. దాంతో తులసి మీకు ఏం కావాలి అని అడిగితే, అర్జెంటుగా మా పాప గోల్డ్ చెయిన్ తిరిగి ఇచ్చేయ్ అని అంటాడు. చెయిన్ ఏంటి అని తులసి అడిగితే, అప్పుడు సామ్రాట్ ఉదయం వచ్చేటప్పుడు పాప మెడలో చైన్ ఉందా లేదా ఇప్పుడు లేదు అని అడుగుతాడు, దాంతో తులసి వాళ్ళ అత్త దారిలో పడేసుకుoదేమో అని అంటే, కాదు అని సామ్రాట్ కోపంగా తులసీనే దొంగతనం చేసింది ఖచ్చితంగా అని అంటాడు.

మర్యాదగా ఆ చెయిన్ తిరిగి ఇస్తే క్షమించి వెళతాను అని అంటాడు, దాంతో తులసి మీరు ఎన్నిసార్లు అడిగినా ఆ చెయిన్ గురించి ఏమీ తెలియదు అని అంటుంది. అప్పుడు పని వాళ్లతో ఆ చెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసుకదా వెతకండి అని అంటాడు, అప్పుడు తులసి కోపంగా అసలు మీరు మారరా కిడ్నాప్ అని మొన్న నింద వేశారు ఇప్పుడు ఇలా అని అంటుంది, అoకిత ఖరీదు చెప్పండి ఆ డబ్బుల్ని మొహాన వేస్తాము అని అంటుంది. దాంతో సామ్రాట్ కోపంగా అలాంటి ఎన్నో చేన్లను దానం చేసింది నా బిడ్డ అలాంటి రేంజ్ మాది అని అంటాడు. అప్పుడు అంకిత మరి ఎందుకు చెయిన్ కోసం ఇలా చేస్తున్నారు అని అంటే, సామ్రాట్ అది చనిపోయిన నా చెల్లెలు జ్ఞాపకం.

అలానే ఉండాలి అని పాప మెడలో వేశాను, మీకు ఏమి కావాలో చెప్పండి డబ్బులు ఇస్తాం అని అంటాడు. పనివాళ్లతో వెతికించినా ఏమీ దొరకదు, అప్పుడు తులసి ఇప్పుడన్నా అర్థమైందా అని అంటే, నువ్వు చాలా తెలివైన దొంగవి నీకొక గంట టైం ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత నందు టెన్షన్ పడుతూ ఉంటాడు, సామ్రాట్ గురించి ఆలోచిస్తూ, అప్పుడు లాస్య ఎందుకు నందు టెన్షన్ పడుతున్నావు, యాక్సిడెంట్ జరిగిన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేదు, నిజం తెలిసిన తులసి ఎలాగో చెప్పదు.

టెన్షన్ పడకు, మనం బిజినెస్ కోసం ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నం వచ్చిన ఈ అవకాశాన్ని వదులు పెట్టొద్దు అని చెపుతుంది. కొన్ని రోజులు అయితే యాక్సిడెంట్ గురించి సామ్రాట్ గారు మర్చిపోతారు ఐనా పాపకి ఏమీ కాలేదు కదా అని లాస్య నందు తొ అంటుంది. తర్వాత తులసి ఇంట్లో ఇంటి సభ్యులు అందరూ మళ్లీ మనల్ని అపార్థం తీసుకున్నాడు.

నిలదీయొచ్చు కదా అమ్మా అని అంటారు తులసిని, అప్పుడు తులసి మనం ఇప్పుడు చేయాల్సింది తనది తప్పు అని నిరూపించడము కాదు మనది ఏది తప్పు లేదు అని నిరూపించుకోవడం. ఆవేశానికి పోకూడదు అని అంటూ ఉంటుంది. ఇంతలో దివ్య చెట్లకు నీళ్లు పోస్తుండగా అక్కడ పడివున్న చెయిన్ చూసి మామ్ అని లోపలికి వెళ్లి అందరికీ చూపిస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లు అందరూ ఇది ఇచ్చినా కూడా మనల్ని నమ్మారు ఇందులో కూడా మన తప్పే ఉంది అని అంటాడు, అని అనుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement