Intinti Gruhalakshmi 19 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 19-aug-2022 ఎపిసోడ్ 715 ముందుగా మీ కోసం….. తులసి, సామ్రాట్ ఒక రెస్టారెంటులో కూర్చుని డిన్నవర్ చేస్తూ ఉంటే, అదే రెస్టారెంట్కి లాస్య, నందు కూడా వస్తారు. సామ్రాట్కి పొరపోతే తులసి తలనిమిరి మంచి నీళ్లు తాగిస్తోంది. అదంతా నందు చూస్తూ ఉంటాడు. నందుకి చాలా కోపం వస్తూ ఉంటుంది.ఇంతలో సామ్రాట్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే సామ్రాట్ వెళ్లి పోతాడు.వెంటనే తులసి దగ్గరికి నందు వచ్చి కూర్చుంటాడు.నందు వచ్చే తులసితో చాలా వెటకారంగా మాట్లాడుతూంటాడు కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వచ్చింది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు.అంతకు ముందు చెప్పిన మాట చెబుతున్నాను సామ్రాట్ గారికి నా మాజి భార్యని చెప్పొద్దు అని అంటాడు.ఇచ్చిన మాట నేను మర్చిపోను అని చెప్పి అంటోంది తులసి.
ఇక తర్వాత సామ్రాట్తో తులసికి దూరంగా ఉండండి తన మాజీ భార్య అని చెప్పినా నందు తర్వాత ఇద్దరూ కొట్టుకోవడం గొడవపడటం ఇదంతా లాసయ ఊహించుకుంటూ ఉంటుంది.తర్వాత నందు, సామ్రాట్ ఇద్దరూ కనిపించకపోయేసరికి తులసి లాస్య వాళ్ళిద్దర్నీ వెతుకుతూ ఉంటారు. తీరా చూస్తే సామ్రాట్ నందు ఇద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు.లాస్యకి, తులసికి చాలా కోపం వస్తుంది. తెలివిగా ఇద్దరు ఇద్దరికి సారీ చెప్పారు. సామ్రాట్ ఏమో నాకు డ్రింక్కు అలవాటులేదు సంతోషంతో ఉండి తాగుతున్నాను అని చెప్తాడు. నందు ఏమో నాకు బాధగా ఉంది తాగుతున్నాను అని చెప్తాడు.ఏమీ అనుకోవద్దు తులసిగారు అంటే తులసి గారూ ఏం అనుకోరు అని నందు చెప్తాడు.
Intinti Gruhalakshmi 19 August Today Episode : సామ్రాట్ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు అసలేం జరిగి ఉంటుంది.

మీకెలా తెలుసు అని అడిగితే ఏదో చెప్పి కవర్ చేసేస్తాడు నందు. ఇంతలో మళ్లీ అక్కడి నుంచి సామ్రాట్, నందు ఇద్దరూ మాయమైపోతారు.తాగిన మైకంలో ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నందుని, సామ్రాట్ ని చూసి లాస్య, తులసి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు.ఎలాగో అలాగ వాళ్ళిద్దర్నీ డ్యాన్స్ చేయడం ఆపేసి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు.తాగిన మైకంలో నందు సామ్రాట్ ఏదేదో చేస్తూ ఉంటారు.లిఫ్ట్ లోకి ఎక్కి పైకి వెళ్దామంటే అబ్బాయి లోపలికి వెళ్లి అమ్మాయిగా బయటికి వస్తున్నారు నేను రాను అని చెప్తూ ఉంటాడు సామ్రాట్. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది